వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంలో నలుగురు మరణించగా, పలువులు గాయపడ్డారు. శనివారం ఉదయం మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం …
మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె …
అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. …
ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు అంతా బాగానే ఉంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున …
సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘అమృత’ సాంగ్ విడుదల యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో …
ఇటీవలే మొదలైన ‘వకీల్ సాబ్’ షూట్ అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ దసరాకి సినిమా నుంచి అప్ డేట్ సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు …
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి మ్యాన్ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలి ప్రభావిత ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలి తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతోన్న నేపథ్యంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై …
ఎఫ్3లో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే నటిస్తే ఈ సినిమాలో మరింత ఫన్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్‌గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా …
కొవిడ్-19 నేపథ్యంలో వినూత్న కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్న చెర్రీ దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆన్లైన్ డ్యాన్స్ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా …
సుధీర్ బాబు భార్య ప్రియ పుట్టినరోజు వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ …
ప్రేయసి కోసం సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు ఓ ప్రేమికుడు. తానూ ప్రేమించిన అమ్మా యి వస్తేనే కిందకు దిగుతానని హల్ చల్ చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో రోహిత్ అనే యువకుడు తానూ ప్రేమించిన అమ్మాయి కోసం సెల్ టవర్ …
ప్రేయసి కోసం సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు ఓ ప్రేమికుడు. తానూ ప్రేమించిన అమ్మా యి వస్తేనే కిందకు దిగుతానని హల్ చల్ చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో రోహిత్ అనే యువకుడు తానూ ప్రేమించిన అమ్మాయి కోసం సెల్ టవర్ ఎక్కాడు. ప్రేమించిన అమ్మాయి కోసం సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అమ్మాయి వస్తేనే కిందకు దిగుతానంటూ రాత్రి నుంచి సెల్‌టవర్‌పైనే కూర్చుని ఆందోళనకు దిగాడు.బుధవారం ఉదయం ఇన్‌ఛార్జి సీఐ మల్లేశ్వర రావు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మాట్లాడదాం కిందకు రావాలని రోహిత్‌ను పిలిచారు. అయితే రోహిత్ సెల్‌టవర్‌పై నుంచి కిందకు దిగుతున్న సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. దీంతో రోహిత్ పక్కనే ఉన్న కల్యాణమండపంలోకి దూకేశాడు. గాయపడిన రోహిత్‌ను జంగారెడ్డిగూడెంహాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
బలపడిన అల్పపీడనం 48 గంటల పాటు వర్ష సూచన హెచ్చరించిన వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటం, ఇదే సమయంలో ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ ఉపరితల ఆవర్తన ద్రోణి విస్తరించడంతో తెలుగు రాష్ట్రాలను మబ్బులు క …
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటం, ఇదే సమయంలో ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ ఉపరితల ఆవర్తన ద్రోణి విస్తరించడంతో తెలుగు రాష్ట్రాలను మబ్బులు క మ్మేశాయి.దీంతో నేటి సాయంత్రం నుంచి రానున్న 48 గంటల వరకూ పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షా లు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. గడచి న 24 గంటల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లోనే వర్షపాతం నమోదైందని, రానున్న రెండు రోజుల్లో మాత్రం భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతం అది ఒడిశాకు తూర్పున కేంద్రీ కృతమై ఉందని తెలిపారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే, ఒడిశాపై అధికంగా ఉంటుందని, అయితే, ఉపరితల ద్రోణి కారణంగా ఏపీ, టీఎస్ లో వర్షాలు పడనున్నాయని హెచ్చరించారు.
30 వేల క్యూసెక్కులకు పడిపోయిన వరద అంతే మొత్తం నీరు దిగువకు సాగర్ కు చేరుకున్న 18 వేల క్యూసెక్కులు కృష్ణా నదిలో కొనసాగుతున్న వరద ప్రవాహం క్రమంగా తగ్గుతూ ఉండటంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జలాశయంలోని 30 …
కృష్ణా నదిలో కొనసాగుతున్న వరద ప్రవాహం క్రమంగా తగ్గుతూ ఉండటంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జలాశయంలోని 30 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని, ఈ నీటిని వివిధ ఎత్తిపోతల పథకాలతో పాటు, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. మొత్తం 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 214 టీఎంసీల నీరుందని అన్నారు. కాగా, నాగార్జున సాగర్ జలాశయానికి 18 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆ నీటిని కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు వదులుతున్నారు.
సత్యం గెలిచింది దేశంలోని ఎంతో గౌరవనీయులైన నాయకులపై కేసు చివరకు మూడు దశాబ్దాల తర్వాత తొలగిపోయింది ఈ తీర్పును ప్రతి ఒక్కరు స్వాగతించాలి బాబ్రీ మసీదు కూల్చి వేత కేసులో 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థా …
బాబ్రీ మసీదు కూల్చి వేత కేసులో 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థా నం ఈ రోజు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు ఈ కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా తేల్చడం పట్ల ఆ పార్టీ నేతలు హర్షం వ్య క్తం చేస్తున్నారు.’సత్యం గెలిచింది. బాబ్రీ కుట్రపూరిత కేసులో నిందితులుగా ఉన్న వారిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించడంలో చాలా ఆలస్యం జరిగింది. దేశంలోని ఎంతో గౌరవనీయులైన కొందరు నాయకులపై కుట్రపూరితంగా పెట్టిన ఈ కేసు చివరకు మూడు దశాబ్దాల తర్వాత తొలగిపోయిం ది. ఈ తీర్పును ప్రతి ఒక్కరు స్వాగతించాలి’ అని బీజేపీ నేత రామ్ మాధవ్ పేర్కొన్నారు.
పోలీస్..మనకు ఏ కష్టం వచ్చినా వినిపించే పేరు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ పోలీస్ మాత్రం విధి నిర్వహ ణలో వెెనకడుగు వెయ్యడు. వృత్తి ధర్మాన్ని విస్మరించడు. తాజాగా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో ఓ పోలీస్ కానిస్టేబుల్ అందుకు సాక్ష్యంగా …
పోలీస్..మనకు ఏ కష్టం వచ్చినా వినిపించే పేరు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ పోలీస్ మాత్రం విధి నిర్వహ ణలో వెెనకడుగు వెయ్యడు. వృత్తి ధర్మాన్ని విస్మరించడు. తాజాగా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో ఓ పోలీస్ కానిస్టేబుల్ అందుకు సాక్ష్యంగా నిలిచాడు. హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఎప్పుడు ట్రాఫిక్ తో కిక్కిరిసి ఉంటుంది. అక్కడ డ్యూటీ చేసే పోలీసులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోతుంది. ఈ సర్కిల్ వద్ద కానిస్టేబుల్ దేవిశెట్టి శ్రీనివాస్ సెప్టెంబర్ 25 సాయంత్రం విధులు నిర్వహి స్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం విరుచుకుపడింది. వర్షం పడితే ట్రాఫిక్ ఎలా ఉంటుందో మళ్లీ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో జోరు వానలో తడు స్తూనే, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఎంతో నిబద్ధతతో కానిస్టేబుల్ శ్రీనివాస్ డ్యూటీ చేశా రు.కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా డ్యూటీలో నిమగ్నమై కానిస్టేబుల్ శ్రీనివాస్ చూపిన వృత్తి ధర్మానికి.. రాష్ట్ర హోం మాంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో శనివారం జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు జిల్లా పోలీసు కార్యాలయంలో సదరు కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించి, తను చేసిన సేవకు ప్రోత్సాహకంగా నగదు రివార్డును అందజేసి అభినందించారు.
ఏపీలో కరోనా వైరస్ మరింతగా విస్తరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ విలయం సృష్టిస్తున్న ఈ మహ మ్మారి అంతకంతకు వ్యాపిస్తోంది. తాజాగా ఏపీలో 7,738 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 57 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,25, 514కి చేరగా, మరణాల సంఖ్య 5,359కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,836 మంది చికిత్స పొందు తున్నారు. కరోనా నుంచి విముక్తులైన వారి సంఖ్య 5,41,319గా నమోదైంది.
వ్యవసాయ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం అనుకూలంగా వ్యవహరించిన వైసీపీ బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్ కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టం బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడం తెలిసిందే. ఈ బిల్లును ప్రధాన విపక్షం కాంగ్రెస్ వ్యతిరేకించింది. అంతేకాదు పలు ప్రాంతీయ పార్టీలు కూడా …
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టం బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడం తెలిసిందే. ఈ బిల్లును ప్రధాన విపక్షం కాంగ్రెస్ వ్యతిరేకించింది. అంతేకాదు పలు ప్రాంతీయ పార్టీలు కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలుపలేదు. ఈ కొత్త వ్యవసాయ చట్టం బిల్లు విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెరో దారి అన్నట్టుగా వ్యవహరించాయి.ఏపీ అధికార పక్షం వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు వ్యవసాయ బిల్లుకు ఆమోదం తెలుపగా, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన సభ్యులు మాత్రం వ్యతిరేకిం చారు. సీఎం కేసీఆర్ మొదటి నుంచి ఈ బిల్లు పట్ల విముఖత వ్యక్తం చేస్తుండగా, సీఎం జగన్ మాత్రం స్వాగతించారు. ఇక, ఏపీ విపక్షం టీడీపీ ఈ బిల్లు పట్ల సానుకూలంగా వ్యవహరించింది.ఇక, రాజ్యసభలో ఈ నూతన వ్యవసాయ చట్టం బిల్లు, దాని అనుబంధ బిల్లులపై చర్చ జరిగిన సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఈ బిల్లుల ద్వారా రైతులకు నచ్చిన చోట పంట విక్రయించుకునే సౌలభ్యం కలుగుతుందని, రైతులకు గిట్టుబాటు ధర లభ్యమవుతుందని అన్నారు. ఈ బిల్లు వస్తే ముం దుగా నిర్ణయించుకున్న ధరకు రైతులు పంటను అమ్ముకునే వీలు కలుగుతుందని చెప్పారు. మధ్యవ ర్తుల ప్రమేయం తగ్గుతుందని విజయసాయి అభిప్రాయపడ్డారు.టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ స్పందిస్తూ, ఈ బిల్లుపై అనేక సందేహాలు ఉన్నాయని, రైతుల్లోనూ ఆందోళన వ్యక్తమవు తోందని అన్నారు. బిల్లుపై మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని చర్చ సందర్భంగా కేంద్రమంత్రిని కోరారు.
సీఐతో ఉండవల్లి శ్రీదేవి వాగ్వాదం తన వారిని వదలట్లేదని ఆగ్రహం డీజీపీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఓ సీఐని దుర్భాషలాడినట్టు చెప్పబడుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నీకేమైనా …
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఓ సీఐని దుర్భాషలాడినట్టు చెప్పబడుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నీకేమైనా మెంటలా…” అం టూ “ఏరా” అని సంబోధిస్తూ… పోలీసు అధికారని కూడా చూడకుండా మాట్లాడారు. ‘ఎప్పటి నుంచి చె బుతున్నాను.. వాళ్లను పంపేయొచ్చుగా.. వాళ్లను పట్టుకున్న రోజునే నేను నీకు ఫోన్ చేశానా.. లేదా.. ఏం మాట్లాడుతున్నావ్.. నేనంటే గౌరవం లేదా.. అంటూ రెచ్చిపోయారు.’అందరినీ వదులుతున్నావు, నా కాళ్లు పట్టుకుని పోస్టింగ్ తెచ్చుకున్నావు, రెండు నిమిషాల్లో వెళ్లిపోతావు. ఎస్పీకి, డీజీపీకి చెబుతా’ అంటూ హెచ్చరించారు. కాగా, అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నందుకు, వారిని వదిలి పెట్టాలంటూ శ్రీదేవి ఇలా మాట్లాడినట్టుగా తెలుస్తోంది.
24 గంటల్లో కొత్తగా 8,096 కేసుల నమోదు 74,710 మందికి కోవిడ్ టెస్టులు రాష్ట్రంలో 84,423 యాక్టివ్ కేసులు ఏపీలో కరోనా విజృంభన కొనసాగుతోంది. గత 24 గంటల్లో తాజాగా మరో 8,096 కొత్త కేసులు నమోద య్యాయి. దీంతో ఇప్పటి వరకు …
ఏపీలో కరోనా విజృంభన కొనసాగుతోంది. గత 24 గంటల్లో తాజాగా మరో 8,096 కొత్త కేసులు నమోద య్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 6,09,558కి చేరుకుంది. 24 గంటల్లో 74,710 మందికి టెస్టులు నిర్వహించారు. మరోవైపు ఇదే సమయంలో 67 మంది ప్రాణాలు కోల్పోయా రు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,244కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 84,423 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,19,891 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, హై స్పీడ్ డిజిల్ పై ప్రతి లీటర్ కు ఒక్క రూపాయి చొప్పున సెస్ విధిస్తూ ఏపీ స ర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. వ్యాట్ కు అదనంగా ఈ రెండు ఉత్పత్తులపై రూపాయి చొప్పున సెస్ విధి …
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, హై స్పీడ్ డిజిల్ పై ప్రతి లీటర్ కు ఒక్క రూపాయి చొప్పున సెస్ విధిస్తూ ఏపీ స ర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. వ్యాట్ కు అదనంగా ఈ రెండు ఉత్పత్తులపై రూపాయి చొప్పున సెస్ విధి స్తున్నట్లు తెలిపింది. డీలర్ వద్ద నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ప్రభుత్వం ఆర్డినెన్స్ లో పే ర్కొంది. రహదారి అభివృద్ధి నిధి కోసం ఈ సెస్ వసూలు చేస్తున్నట్టు గవర్నమెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. సెస్ ద్వారా 600 కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ అదనపు ఆదాయాన్ని రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.