వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంలో నలుగురు మరణించగా, పలువులు గాయపడ్డారు. శనివారం ఉదయం మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం …
మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె …
అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. …
ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు అంతా బాగానే ఉంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున …
సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘అమృత’ సాంగ్ విడుదల యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో …
ఇటీవలే మొదలైన ‘వకీల్ సాబ్’ షూట్ అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ దసరాకి సినిమా నుంచి అప్ డేట్ సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు …
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి మ్యాన్ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలి ప్రభావిత ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలి తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతోన్న నేపథ్యంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై …
ఎఫ్3లో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే నటిస్తే ఈ సినిమాలో మరింత ఫన్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్‌గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా …
కొవిడ్-19 నేపథ్యంలో వినూత్న కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్న చెర్రీ దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆన్లైన్ డ్యాన్స్ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా …
సుధీర్ బాబు భార్య ప్రియ పుట్టినరోజు వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ …
నిర్భయ చట్టం ఉన్నా.. దిశ చట్టం వచ్చినా.. కామాంధుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(NCRB) విడుదల చేసిన నివేదికలో విస్తుపోయే నిజాలు …
నిర్భయ చట్టం ఉన్నా.. దిశ చట్టం వచ్చినా.. కామాంధుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(NCRB) విడుదల చేసిన నివేదికలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మహిళలకు, బాలికలకు దేశంలోని ఏ రాష్ట్రమూ సురక్షితం కాదని ఎన్సీఆర్బీ స్పష్టం చేసింది. 2018తో పోలిస్తే 2019లో మహిళలపై నేరాలు 7.3 శాతం గణనీయంగా పెరిగాయని.. 4,05,861 కేసులు నమోదైనట్లు నివేదిక పేర్కొంది.భారత్‌లో ప్రతి 16 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోందని.. 2019లో దేశవ్యాప్తంగా 32,033 రేప్ కేసులు నమోదైతే అందులో 11% దళిత వర్గాలలోనే జరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) వెల్లడించింది. అటు నేరాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. 2019లో రాజస్థాన్‌లో 5,997 రేప్ కేసులు నమోదు కాగా.. అందులో 1313 కేసులు మైనర్ బాలికలపై జరిగిన దాడులుగా నివేదిక వెల్లడించింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో 3,065 రేప్ కేసులు నమోదయ్యాయి. ఇక 2020 ఆగష్టు వరకు రాజస్థాన్‌లో 3498 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. మరోవైపు 2018తో పోలిస్తే 2019లో కిడ్నాపింగ్ కేసులు 0.7 శాతం తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. 2018లో 1,05,734 కేసులు నమోదు కాగా.. 2019లో మొత్తంగా 1,05,037 కేసులు నమోదయ్యాయి.కాగా, యావత్ దేశాన్నే కదిలించి వేసిన నిర్భయ, దిశ సంఘటనలు..ప్రస్తుతం మరో సంచలనంగా మారి రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతున్న హత్రాస్ సంఘటనలు మహిళల రక్షణకే పెను సవాల్‌గా మారాయి. ఇటువంటి దారుణాలు జరిగిన వెంటనే ప్రభుత్వాలు, రక్షణ వ్యవస్థలు త్వరగా స్పందించి, నేరస్తులకు తగిన శిక్షలు విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృత్తం కాకుండా ఉండేందుకు కఠినమైన చట్టాలు రావాల్సి ఉందంటూ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని.. ఆయన సహచరుడు, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అభినందించా రు. ఈ మేరకు అమిత్ షా బుధవారం ట్విట్టర్లో పలు ట్వీట్లను పోస్టు చేశారు. అక్టోబర్ 7వ తేదీ భారత దేశ చరిత్రలో అత్యంత …
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని.. ఆయన సహచరుడు, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అభినందించా రు. ఈ మేరకు అమిత్ షా బుధవారం ట్విట్టర్లో పలు ట్వీట్లను పోస్టు చేశారు. అక్టోబర్ 7వ తేదీ భారత దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజుగా అమిత్ షా పేర్కొన్నారు. మోదీ సారథ్యం దేశానికి కొత్త దశను, దిశను ఇస్తోందని ఆయన తన ట్వీట్లలో ప్రస్తావించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 7వ తేదీతో ప్రజా పరిపాలనలో 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రపంచ చరిత్రలో వరుసగా 20 ఏళ్ళ పాటు ప్రజా పరిపాలన రంగంలో కొనసాగిన ఏకైక వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా ప్రజా పరిపాలనలో 20 ఏళ్ళు (రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గాను, రెండు విడతలు అమెరికా అధ్యక్షునిగాను) పూర్తి చేసుకున్నప్పటికీ ఆయన మధ్యలో బ్రేక్ తీసుకున్నా రు.నరేంద్ర మోదీ అక్టోబర్ 7, 2001లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాతి సంవత్సరమే గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా.. మోదీ సారథ్యంలోనే మరోసారి బీజేపీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత 2007, 2012 ఎన్నికల్లోను మోదీ విజయఢంకా మోగించి ముఖ్య మంత్రి అయ్యారు. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా విస్తృత ప్రచారం చేశారు.2014 ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ మోదీని ప్రధానిని చేసింది. దాంతో ముఖ్యమంత్రి నుంచి నేరుగా ప్రధాని అయిన రికార్డు సృష్టించారు నరేంద్ర మోదీ. ఈ అంశాలన్నింటినీ తన ట్వీట్లలో ప్రస్తావించిన అమిత్ షా.. మోదీ పరిపాలనలో దేశం ముందడుగు వేస్తోందని అన్నారు.
బహిరంగ ప్రదేశాలను ధర్నాల కోసం ఆక్రమించరాదు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని షెహీన్‌భాగ్‌లో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆందోళన పేరుతో షెహీన్భాగ్ను నిరసనకారులు ఆక్రమించారు. దీనిపై జారీ అయిన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు స్పందించింది. …
బహిరంగ ప్రదేశాలను ధర్నాల కోసం ఆక్రమించరాదు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని షెహీన్‌భాగ్‌లో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆందోళన పేరుతో షెహీన్భాగ్ను నిరసనకారులు ఆక్రమించారు. దీనిపై జారీ అయిన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు స్పందించింది. నిరసన, ప్రజాస్వామ్యం కలిసి ముందుకు సాగవచ్చు అని, కానీ షెహీన్‌భాగ్ లాంటి నిరస నలను ఆమోదయోగ్యం కాదు అని కోర్టు వెల్లడించింది. పబ్లిక్ ప్లేస్‌లను ఎప్పటి కోసం ఆక్రమించడం సరికాదు అని కోర్టు పేర్కొన్నది. షెహీన్‌భాగ్ అయినా లేక ఇతర ప్రదేశమైనా ఇది కరెక్ట్ కాదు అని కోర్టు చెప్పింది. షెహీన్‌భాగ్ లాంటి నిరసనలను ఆమోద యోగ్యం కాదు అని, అధికారులు నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. షెహీన్‌భాగ్ లాంటి ప్రాంతాలను అవరోధాల నుంచి దూరంగా పెట్టాలని కోర్టు చెప్పింది. నిరసన ప్రదేశాల నుంచి జనాల్ని తొలగించేందుకు కోర్టు ఆదేశాల కోసం అధికా రులు వేచి చూడాల్సిన అవసరం లేదని సుప్రీం పేర్కొన్నది.శాంతియుతంగా ప్రదర్శనలు చేపట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ అలాంటి ప్రదర్శనలు నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే జరగాలని కోర్టు వెల్లడించింది. ఒకే చోట నిరంతర ధర్నా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న అంశంపై వేసిన పిటిషన్‌కు సుప్రీం స్పందించింది. జస్టిస్ ఎస్కే కౌల్, అనిరుద్ బోస్, కృష్ణ మురారీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. సీఏఏను వ్యతిరేకిస్తూ షెహీన్‌భాగ్‌లో సుమారు మూడు నెలల పాటు మహిళలు బైఠాయింపు చేశారు.
గుజరాత్ హైకోర్టులో ఘటన వర్చ్యువల్ విధానంలో కేసుల విచారణ న్యాయవాది సిగరెట్ తాగుతుంటే చూసిన జడ్జి రూ. 10 వేల జరిమానా న్యాయమూర్తి కేసును విచారిస్తున్న వేళ, సిగరెట్ తాగిన న్యాయవాదిపై రూ. 10 వేల జరిమానా పడిం ది. ఈ ఘటన …
న్యాయమూర్తి కేసును విచారిస్తున్న వేళ, సిగరెట్ తాగిన న్యాయవాదిపై రూ. 10 వేల జరిమానా పడిం ది. ఈ ఘటన గుజరాత్ హైకోర్టులో జరిగింది. కరోనా కారణంగా కేసు విచారణలన్నీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. కేవలం వర్చ్యువల్ విధానంలో కేసులను విచారి స్తున్నారులే అన్న ఊదాసీనతలో హైకోర్టు న్యాయవాది జేవీ అజ్మెరా, తన కారులో కూర్చుని సిగరెట్ అంటించారు.దీన్ని గమనించిన జస్టిస్ ఏఎస్ సుపెహియా, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అజ్మెరా బాధ్య తా రాహిత్యంగా ప్రవర్తించారని తేల్చిన ఆయన రూ. 10 వేల జరిమానా విధించారు. ఈ ఘటన గత నెల 24న జరుగగా, తాజాగా, అజ్మేరా కోర్టుకు క్షమాపణలు చెప్పి, జరిమానా చెల్లించారు.
వచ్చేది పండుగల సీజన్.. కరోనా వైరస్‌కేమో కాలం చెల్లడం లేదు.. ఎంతగా కట్టడి చేస్తున్నా కొత్త కేసు లు నమోదు అవుతూనే ఉన్నాయి.. మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.. నవరాత్రులతో మొద లు పెడితే రాబోయే మూడు నెలలు పండుగలే పండుగలు.. …
వచ్చేది పండుగల సీజన్.. కరోనా వైరస్‌కేమో కాలం చెల్లడం లేదు.. ఎంతగా కట్టడి చేస్తున్నా కొత్త కేసు లు నమోదు అవుతూనే ఉన్నాయి.. మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.. నవరాత్రులతో మొద లు పెడితే రాబోయే మూడు నెలలు పండుగలే పండుగలు.. దేశమంతటా నవరాత్రులు అత్యంత వైభవం గా జరుగుతాయి.. విజయదశమి పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది.? అమావాస్య రోజున వచ్చే దీపాల పండుగ దీపావళి హిందువులకు చాలా పెద్ద పండుగ… తర్వాత క్రిస్మస్.. మనకేమో బ తుకమ్మ కూడా ఉంది.. ఈ పండుగల వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.. పది మంది కలిస్తే నే కదా పండుగ సంబరం..! ఇలా ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడితే కరోనా వైరస్ పండుగ చేసుకుంటుం దంటోంది కేంద్ర ప్రభుత్వం.. పండుగలు సంతోషంగా జరుపుకోవాలనే తప్ప ప్రమాదాలను కొని తెచ్చుకు నేలా ఉండకూడదని హితవు చెబుతోంది.. పండుగల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తోంది.. కంటైన్మెంట్ జోన్లలో పండుగ ఉత్సవాలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేసింది.. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ప్రజలు ఇంటిపట్టునే ఉంటూ పండుగలు చేసుకోవాలని చెప్పిం ది.. పండుగల వేళ మండపాలలో పెట్టే విగ్రహాలను చేత్తో తాకరాదని, పవిత్ర గ్రంధాలను కూడా ముట్టుకో వద్దని ఆరోగ్యశాఖ సూచించింది.. భక్తి పాటలు వినిపించవచ్చు కానీ, పాటల పోటీలను మాత్రం నిర్వహిం చవద్దని చెప్పింది.. పండుగ కార్యక్రమాలు జరిగే చోట జనం తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించాల ని, కనీసం ఆరు అడుగుల దూరాన్ని పాటించాలని సూచించింది.. వేడుకలు జరిగే ప్రాంతాలను ఎప్పటి కప్పుడు శానిటైజేషన్ చేయాలని, థర్మల్ స్క్రీనింగ్‌ను విధిగా విధించాలని స్పష్టం చేసింది. ర్యాలీలు, ని మజ్జనాలు తగు జాగ్రత్తలో చేసుకోవాలని తెలిపింది.. ఇలాంటి కార్యక్రమాలలో వీలైనంత తక్కువ మంది పాల్గొనే విధంగా చూసుకోవాలని సూచించింది. ర్యాలీలలో తప్పనిసరిగా అంబులెన్స్‌ను అందుబాటులో పెట్టాలని పేర్కొంది ఆరోగ్యశాఖ.. ఉత్సవాలు జరిగే చోట ఎంట్రన్స్, ఎగ్జిట్ ద్వారాలు వేరువేరుగా ఉండాల ని, భక్తులకు సురక్షితమైన తాగునీటిని అందించాలని, వైద్య సదుపాయం కూడా కలిగించాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.. కేరళలో ఓనం పండుగ తర్వాత ఒక్కసారిగా కేసులు పెరగడాన్ని దృష్టిలో పెట్టు కునే కేంద్రం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది.. కేంద్ర ప్రభుత్వ సూచనలను ప్రజలు కూడా పాటిస్తే కరోనా ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.. పండుగలను సంబరంగా జరుపుకోవచ్చు..
తమిళనాడులో అధికార అన్నాడీంకే ఎమ్మెల్యే ప్రభు (35) రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. విల్లుపురం జిల్లాలోని తియగదురుగమ్ పట్టణానికి చెందిన ప్రభు అదే పట్టణానికి చెందిన సౌందర్య (19) గత నాలుగేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే సౌందర్య తండ్రి స్వామినాథన్ (48), ఇతర కుటుంబసభ్యులు …
తమిళనాడులో అధికార అన్నాడీంకే ఎమ్మెల్యే ప్రభు (35) రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. విల్లుపురం జిల్లాలోని తియగదురుగమ్ పట్టణానికి చెందిన ప్రభు అదే పట్టణానికి చెందిన సౌందర్య (19) గత నాలుగేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే సౌందర్య తండ్రి స్వామినాథన్ (48), ఇతర కుటుంబసభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో బీఏ సెకండియర్ విద్యార్థిని అయిన సౌందర్య , ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిపోయింది.దీంతో సౌందర్య తండ్రి స్వామినాథన్ తన కూతరును కళ్లకు రిచి ఎమ్మెల్యే ప్రభు కిడ్నాప్ చేశాడని సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని ఎమ్మెల్యే అనుచరులు తనను బెదిరించారని ఆ వీడియోలో పేర్కొ న్నారు. అయితే, స్వామినాథన్ వీడియోకు ప్రతిగా ఎమ్మెల్యే ప్రభు, సౌందర్య మరో వీడియో పోస్ట్ చేశారు. తాము గత నాలుగేండ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకున్నా మని ఆ వీడియోలో స్పష్టంచేశారు.తమ ప్రేమ గురించి సౌందర్య తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు పట్టించుకోలేదని ఎమ్మెల్యే ప్రభు ఆరోపించారు. కూతురు పెండ్లి విషయం తెలియగానే స్వామినాథన్ ఎమ్మెల్యే ఇంటి ముందుకు వెళ్లి ఆత్మహత్యయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఐపీసీ సెక్షన్ 309 ప్రకారం ఆయనపై కేసు నమోదుచేశారు.
కొత్త చట్టాల పేరిట దేశంలో వ్యవసాయాన్ని, రైతులను కార్పొరేట్లు, బడా కంపెనీలకు తాకట్టు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త కుట్రకు తెరలేపింది. వారి దోపిడీని చట్టబద్ధం చేసేందుకు వీలుగా నిత్యావసర సరుకుల(సవరణ) చట్టం, రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) చట్టం, రైతులకు(సాధికారత, …
కొత్త చట్టాల పేరిట దేశంలో వ్యవసాయాన్ని, రైతులను కార్పొరేట్లు, బడా కంపెనీలకు తాకట్టు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త కుట్రకు తెరలేపింది. వారి దోపిడీని చట్టబద్ధం చేసేందుకు వీలుగా నిత్యావసర సరుకుల(సవరణ) చట్టం, రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) చట్టం, రైతులకు(సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టాలను రూపొందించింది. పార్లమెంట్ లో కనీస చర్చ లేకుండానే ఆమోదించి అమల్లోకి తీసుకొచ్చిన మూడు అగ్రి చట్టాలు రైతులకు మరణ శాసనాలుగా మారబోతున్నాయి. మరోవైపు ఉమ్మడి జాబితాలో వ్యవసాయం ఉన్నప్పటికీ.. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా చట్టాలు చేసి ఈ రంగాన్ని కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
కాంట్రాక్ట్ ఫార్మింగ్‌తో ముప్పే
రైతులకు(సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం వ్యవసాయంలో కాంట్రాక్ట్ పద్ధతికి చట్టబద్ధత కల్పించింది. కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించిన అనుభవాలు తెలంగాణలో చాలా ఉన్నాయి. మన రాష్ట్రంలో పలు విత్తన కంపెనీల వాళ్లు రైతుతో సాదా కాగితాలపై ఒప్పందాలు చేసుకుంటున్నారు. కంపెనీల ఏజెంట్‌గా ఆర్గనైజర్లను పెట్టుకుని పత్తి, వరి విత్తనాలు పండిస్తున్నారు. తీరా పంటచేతికి అందిన తర్వాత విత్తన సైజు సరిగ్గా లేదని, తేమ శాతం అధికంగా ఉందని, రంగు మారిందని కొర్రీలు పెడుతున్నారు. ఈ సాకులు చూపి డబ్బు చెల్లించేటప్పుడు కోతలు పెడుతున్నారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇలాంటి పద్ధతికే ఇప్పుడు కేంద్రం ఆమోదముద్ర వేస్తూ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంతో అమాయక, చదువురాని రైతుల నుంచి పంట కొనేటప్పుడు వ్యాపారస్తులదే పైచేయి అయ్యే ప్రమాదం ఉంది. రైతులు తమకు జరిగిన అన్యాయంపై కోర్టుల చుట్టూ తిరగలేక, లాయర్ ఫీజు చెల్లించలేక తమ పంటను తక్కువ ధరకు తెగనమ్ముకునే పరిస్థితి వస్తుంది.
బడా కంపెనీలకే ప్రయోజనం
కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాల్లో అత్యంత ప్రమాదకరమైనది నిత్యావసర వస్తువుల చట్టం. పైరెండు చట్టాలకూ ఇదే ఆయువుపట్టు. ప్రస్తుతం అమలులో ఉన్న నిత్యావసర సరుకుల చట్టం 1955కి కీలక సవరణలు చేసి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కొన్ని రకాల ఆహార పదార్థాలు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు వంటివి నిత్యావసరాలుగా పేర్కొనడానికి ఈ చట్టం కేంద్రానికి అధికారం ఇస్తుంది. అలాంటి నిత్యావసరాల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాన్ని నియంత్రించడానికి, నిషేధించడానికి కేంద్రానికి అధికారం ఉంటుందని చెబుతూనే బడా వ్యాపారులకు, మల్టీ నేషనల్ కంపెనీలకు మేలు చేసేలా చట్టంలో వీలు కల్పించింది.
బ్లాక్ మార్కెటింగ్‌కు చాన్స్
పంట పండించేవారి నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, గోదాం, రవాణా, పంపిణీదారు వరకు ఎవరికీ నిల్వల విషయంలో పరిమితులు లేవని ఈ చట్టం చెబుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల వాల్యూ చైన్ పార్టిసిపెంట్లకు కూడా ఈ నిల్వ పరిమితి వర్తించదని పేర్కొంది. పండించిన పంటను నిల్వ చేసుకునే వెసులుబాటు ఇప్పటికే రైతులు, రైతు సహకార సంఘాలకు ఉంది. కానీ ఈ మినహాయింపు పరిధిలోకి ఇప్పుడు కంపెనీలను, పంపిణీదారులను చేర్చింది. ఈ చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని బడా వ్యాపారస్తులు, మాల్స్ నిర్వాహకులు రైతుల నుంచి తమ సొంత కొనుగోలు కేంద్రాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కొని భారీగా నిల్వ చేసుకునే ప్రమాదం ఉంది. తద్వారా బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే అవకాశం ఉంది. ఈ చట్టం ద్వారా లాభపడేది వ్యాపారులు మాత్రమే.
కనీస మద్దతు ధర ప్రస్తావన లేదు
కొత్త చట్టంలో కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ప్రస్తావనే లేదు. ఎంఎస్పీ ఉన్న 23 రకాల పంటలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుంచి నేరుగా కొనే అవకాశం ఉండదు. కేంద్రం ఇప్పటికే పంటల బీమా పథకంపై చేతులెత్తేసింది. ఏటా బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి, వడ్డీలేని పంట రుణాలకు చరమగీతం పాడబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చే రాయితీలను రద్దు చేయబోతోంది. ఈ చట్టాల వల్ల ఏకకాలంలో రైతుల ఆదాయం తగ్గడమేగాక వినియోగదారుడిపై మోయలేని భారం పడే ప్రమాదముంది. విద్యను ప్రైవేట్‌పరం చేయడం వల్ల సామాన్య కుటుంబాలకు అందుబాటులో లేకుండాపోయింది. వైద్య రంగం కార్పొరేట్ వ్యవస్థగా మారి పేద, మధ్యతరగతి కుటుంబాకులకు మెరుగైన వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అదే దారిలో ఇప్పుడు వ్యవసాయాన్ని కార్పొరేట్ పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
ఎక్కడైనా అమ్మే పరిస్థితి లేదు
వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) చట్టం చెబుతోంది. కానీ దేశంలో ఆ పరిస్థితులు లేవు. సాగు చేస్తున్న వారిలో 86% మంది చిన్న, సన్నకారు రైతులే. వీళ్లు ఎకరం, రెండెకరాల్లో పండించిన కొద్దిపాటి పంటను మార్కెట్లకు తరలించి అమ్ముకునేందుకు ఆసక్తి చూపడం లేదు. తమ ఉత్పత్తులను కల్లాల్లోనే కాంటా పెట్టి, స్థానిక వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు, కుటుంబ పోషణ కోసం డబ్బు అవసరం కావడంతో వారు ఇలా చేయాల్సి వస్తున్నట్లు అనేక సర్వేల్లో తేలింది. మిగతా సగం మంది తమ పంటలను ట్రాక్టర్లపై దగ్గర్లోని వ్యవసాయ మార్కెట్లకు తరలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రైతు దేశంలో ఎక్కడికైనా వెళ్లి పంట అమ్మడం సాధ్యమా? అనేది సందేహమే.
కొత్తగా ట్రాక్టర్ కొనుగోలు చేయాలనుకునేవారికి కేంద్ర సర్కారు శుభవార్త అందించింది. వారికి ఊరట కలిగించేనిర్ణయం తీసుకున్నది. బీఎస్ నిబంధనల అమలు గడువు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ కొత్త నిబంధనలను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. ఈ నిర్ణయంతో ప్రస్తుతం ట్రాక్టర్లకు కొత్త …
కొత్తగా ట్రాక్టర్ కొనుగోలు చేయాలనుకునేవారికి కేంద్ర సర్కారు శుభవార్త అందించింది. వారికి ఊరట కలిగించేనిర్ణయం తీసుకున్నది. బీఎస్ నిబంధనల అమలు గడువు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ కొత్త నిబంధనలను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. ఈ నిర్ణయంతో ప్రస్తుతం ట్రాక్టర్లకు కొత్త బీఎస్ రూల్స్ వర్తించవు. కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వెహికల్స్‌కు కొత్త ఉద్గార ప్రమాణాల గడువును ఏప్రిల్ 2021 వరకు, ట్రాక్టర్లకు 2021 అక్టోబర్ వరకు పొడిగించింది. కేంద్ర రోడ్డ రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ట్రాక్టర్లు, ఇతర కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వెహికల్స్ తయారు చేసే కంపెనీలకు భారీ ఊరట కలుగనుంది. కాగా కేంద్ర ప్రభుత్వం టూవీలర్లు, ఫోర్వీలర్లకు సంబంధించి బీఎస్ 6 ఉద్గార ప్రమాణాలను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమలులోకి తీసుకువచ్చింది. దీంతో ఇప్పుడు బైక్, స్కూటర్, కారు వంటివి బీఎస్ 6 ఇంజిన్‌తో మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే బీఎస్ 4 వెహికల్స్‌తో పోలిస్తే బీఎస్ 6 వెహికల్స్ ధర చాలా చోట్ల ఎక్కువగానే ఉంది. అయితే ఇప్పుడు ట్రాక్టర్లు, ఇతర కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వెహికల్స్‌కు పాత రూల్స్ వర్తిస్తాయి. కొత్త ఉద్గార ప్రమాణాల అమలుకు మరింత గడువు లభించింది. దీంతో ఇప్పుడు పాత ఉద్గార ప్రమాణాలు కలిగిన ట్రాక్టర్లను కొనుగోలు చేయవచ్చు.
కరోనా వ్యాక్సిన్ తొలుత ఏ జనాభాకు ఇవ్వాలో తెలుపాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. అక్టోబరు నెలాఖ రు కల్లా సంబంధిత జాబితాను సమర్పించాలని పేర్కొంది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ ప్రతి ఆదివా రం నిర్వహించే సండే సంవాద్ కార్యక్రమంలో భాగంగా …
కరోనా వ్యాక్సిన్ తొలుత ఏ జనాభాకు ఇవ్వాలో తెలుపాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. అక్టోబరు నెలాఖ రు కల్లా సంబంధిత జాబితాను సమర్పించాలని పేర్కొంది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ ప్రతి ఆదివా రం నిర్వహించే సండే సంవాద్ కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్లో పలువురితో మాట్లాడారు. ఆరోగ్య సం రక్షణ సిబ్బందితోపాటు కరోనా వైరస్ ఎవరికి ఎక్కువగా సోకుతుందో, ఎవరికి ఎక్కువగా రిస్క్ ఉంటుందో వారికి ప్రాధానత్య ఇస్తామని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక పారదర్శకంగా, సమా నంగా సరఫరా చేసే ఒక వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం 24 గంటలు పని చేస్తున్నదని ఆయన తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరికి కరోనా టీకా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని హర్ష వర్ధన్ చె ప్పారు. వ్యాక్సిన్‌ను భద్రపరిచే శీతల మౌలిక సదుపాయాల సమాచారాన్ని కూడా రాష్ట్రాలను కోరినట్లు తెలిపారు. 2021 జూలై నాటికి సుమారు 20 కోట్ల ప్రజల కోసం 40 నుంచి 50 కోట్ల డోసుల కరోనా టీకా లు సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం ప్రపంచంలో చైనా, రష్యా దేశాలు కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించాయని హర్ష వర్ధన్ తెలిపారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందితోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సూపర్ మార్కెట్ ఉద్యోగులు, సరిహద్దు సిబ్బందికి కరోనా టీకాను చైనా ఇస్తోందని అన్నారు. రష్యాలో రెండు రాష్ట్రాలకు చెందిన మీడియా జర్నలిస్టులకు కూడా స్పుత్నిక్ వి టీకా ఇవ్వనున్నట్లు తెలుస్తున్నదని చెప్పారు.
ఒక అవినీతి కేసులో రిటైర్డ్ సీబీఐ అధికారి సహా ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవినీతి నిరోధక విభాగం అరెస్టు చేసింది. నిందితుడు ఎన్ఎంపీ సిన్హాను ఉదయం ఏసీ మూడో యూనిట్ అరెస్టు చేసింది. ప్రశ్నించేందుకు అతడిని సీబీఐ ప్రధాన …
ఒక అవినీతి కేసులో రిటైర్డ్ సీబీఐ అధికారి సహా ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవినీతి నిరోధక విభాగం అరెస్టు చేసింది. నిందితుడు ఎన్ఎంపీ సిన్హాను ఉదయం ఏసీ మూడో యూనిట్ అరెస్టు చేసింది. ప్రశ్నించేందుకు అతడిని సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అనంర తం సీబీఐ కోర్టులో హాజరుపరిచి కస్టోడియల్ రిమాండ్ ఇవ్వాల్సిందిగా కోరనున్నట్లు సమాచారం.సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసును సిన్హాతోపాటు వివేక్ జలన్ ప్రభావితం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిన్హా ఇటీవల సీబీఐ ఎకనామిక్ నేరాల యూనిట్ నుంచి పదవీ విరమణ పొందారు.జార్ఖండ్‌లో ఇనుప ఖనిజ గనుల కేటాయింపులో అవినీతి ఆరోపణలపై 2005 లో ఈవోయూ దర్యాప్తు చేసింది. 2016 సెప్టెంబర్‌లో జార్ఖండ్‌లోని గనుల అధికారుల విభాగం, ఒక ప్రైవేట్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. సిన్హా ఈ కేసు పర్యవేక్షక అధికారిగా ఉన్నారు. దర్యాప్తును ప్రభావితం చేయడానికి సిన్హా, జలన్ రూ.25 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు ఏసీ మూడో యూనిట్‌కు ఫిర్యాదు అందిందని సీబీఐ వర్గాలు చెప్తున్నాయి. దీని లో భాగంగా ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, రాంచీలోని 8 ప్రదేశాల్లో సీబీఐ దాడులు చేపట్టి తనిఖీలు నిర్వహించింది. సిన్హాకు భారతదేశపు ప్రధాన సమాఖ్య సంస్థలో సుదీర్ఘకాలం పనిచేశారు. తన మూడు దశాబ్దాల కెరీర్లో.. సిన్హా రాజకీయంగా సున్నితమైన అనేక కేసులను విచారించారు. సీబీఐ అకాడమీలో కూడా బోధించారు. గత కొన్నేండ్లుగా ఇద్దరు డైరెక్టర్లతో పాటు సీబీఐ అధికారులు పలు అవి నీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ డైరెక్టర్లు ఏపీ సింగ్, రంజీత్ సింగ్‌పై అవినీతి నిరోధక చట్టం కేసుల్లో ఢిల్లీకి చెందిన మధ్యవర్తి మొయిన్ ఖురేషితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కేసు నమో దు చేశారు. 2018 లో అప్పటి స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్తానా, అప్పటి డీసీబీఐ అలోక్ వర్మ అధిక అవినీతి కేసుల్లో నెమ్మదిగా వెళ్లారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.