వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంలో నలుగురు మరణించగా, పలువులు గాయపడ్డారు. శనివారం ఉదయం మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం …
మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె …
అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. …
ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు అంతా బాగానే ఉంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున …
సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘అమృత’ సాంగ్ విడుదల యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో …
ఇటీవలే మొదలైన ‘వకీల్ సాబ్’ షూట్ అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ దసరాకి సినిమా నుంచి అప్ డేట్ సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు …
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి మ్యాన్ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలి ప్రభావిత ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలి తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతోన్న నేపథ్యంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై …
ఎఫ్3లో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే నటిస్తే ఈ సినిమాలో మరింత ఫన్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్‌గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా …
కొవిడ్-19 నేపథ్యంలో వినూత్న కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్న చెర్రీ దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆన్లైన్ డ్యాన్స్ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా …
సుధీర్ బాబు భార్య ప్రియ పుట్టినరోజు వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ …
ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా వైరస్.. ఆరంభంలో కరోనా ఉధృతికి యూరోప్ వణికిపోయింది. లక్షల సంఖ్యలో మరణాలతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వాలు.. లాక్ డౌన్ అమలు చేశాయి. తర్వాత కరోనా శాంతించింది. దీంతో అత్యంత వేగంగా అన్‌లాక్ ప్రక్రియ అమలు చేస్తున్నాయి. అయితే, ప్రపంచ …
ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా వైరస్.. ఆరంభంలో కరోనా ఉధృతికి యూరోప్ వణికిపోయింది. లక్షల సంఖ్యలో మరణాలతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వాలు.. లాక్ డౌన్ అమలు చేశాయి. తర్వాత కరోనా శాంతించింది. దీంతో అత్యంత వేగంగా అన్‌లాక్ ప్రక్రియ అమలు చేస్తున్నాయి. అయితే, ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించినట్లుగానే.. యూరోప్‌లో కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. దీంతో సభ్య దేశాలు మళ్లీ కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తున్నాయి.నేటి నుంచి రెండు వారాల పాటు పారిస్‌లో అన్ని బార్లు మూసివేయనున్నారు. ఫ్రాన్స్‌లో మరో అతిపెద్దనగరం మార్సెల్లీలో గతవారం నుంచే పది హేను రోజులపాటు బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వివాహ వేడుక నుంచి… అన్ని ఈవెంట్స్ బ్యాన్ చేశారు. పదిమంది ఒకచోట గుమిగూడరాదని ఆదేశాలున్నాయి. ఈ సంవత్సరాంతం వరకూ జర్మనీలో పండుగలు, ఈవెంట్లపై బ్యాన్ పొడిగించారు. కరోనా హైరిస్క్ దేశాలకు వెళ్లొచ్చినవారు 14 రోజుల పాటు క్వారంటైన్ ఉండాలి. మాస్క్ వేసుకోకుంటే.. 50 యూరోస్ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కోవిడ్ వైరస్ పీడిత దేశాల్లో ఒకటైన స్పెయిన్‌లో… ఆంక్షలు మళ్లీ అమల్లోకి వ చ్చాయి. ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు కూడా ఆరుగురికి మించి ఉండకూడదని నిబంధన తెచ్చారు. ఆరే ళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని నిబంధన విధించారు. ఇటలీలో డాన్స్ బార్లు, నైట్ క్లబ్బు లు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక, నెదర్లాండ్స్‌లో తాజా నిబంధనలు అమల్లోకి వ చ్చాయి. పెద్దనగరాల్లో బార్లు, రెస్టారెంట్లలోకి వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరి చేశారు. ఇళ్లలో జరిగే కార్యక్ర మాలకు ముగ్గురుకి మించి ఉండకూడదు. డెన్మార్క్‌లో ఆగస్టు నుంచి కేసులు విపరీతంగా పెరిగాయి. దీంతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించేవారు మాస్క్ తప్పనిసరి చేశారు. లేట్‌నైట్ పార్టీలపై బ్యాన్ విధిం చారు. బెల్జియం, పోర్జుగల్, గ్రీస్‌లో కూడా ఇలాంటి నిబంధనలే విధించారు. అన్ లాక్ ప్రక్రియను వేగవం తంగా అమలు చేయడంతో… యూరోప్‌లో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తోంది. దీంతో మళ్లీ వైరస్‌ను నియం త్రించేందుకు…. ఆయా దేశాలు నిబంధనలు అమల్లోకి తీసుకురాక తప్పని పరిస్థితి ఏర్పడింది…
కరోనా సోకిన కొందరిలో లక్షణాలు కనిపిస్తున్నా.. మరికొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. దీనిపై అధ్యయనం చేసిన అమెరికాలోని ఓ బృందం పలు కీలక విషయాలను వెల్లడించింది. కొందరిలో లక్షణాలు కనిపించకపోవడానికి ఓ ప్రత్యేక కారణముందని వారి పరిశోధనల్లో తేలింది. వైరస్‌లోని ఓ …
కరోనా సోకిన కొందరిలో లక్షణాలు కనిపిస్తున్నా.. మరికొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. దీనిపై అధ్యయనం చేసిన అమెరికాలోని ఓ బృందం పలు కీలక విషయాలను వెల్లడించింది. కొందరిలో లక్షణాలు కనిపించకపోవడానికి ఓ ప్రత్యేక కారణముందని వారి పరిశోధనల్లో తేలింది. వైరస్‌లోని ఓ రకమైన ప్రొటీను మనుషుల నాడీమండలానికి, నొప్పి సంకేతాలను పంపే రిసెప్టర్లను నిర్వీర్యం చేస్తుం దని.. అందుకే కొంతమందిలో స్వల్ప లక్షణాలు, ఇంకొంతమందిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదని వారు కనుకొన్నారు. దీని వలన వైరస్ వ్యాప్తికి వారు ఒక కారణం అవుతున్నారని ఈ బృందం వెల్లడిం చింది.కరోనా సోకిన రోగిలో తొలి లక్షణమైన నొప్పిని వైరస్ స్పైక్ ప్రొటీన్ తెలియనివ్వదు. అలాగే నొప్పి సంకేతాలను శరీరానికి పంపే సిగ్నలింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. దీని వలన కొంతమందిలో ఎలాం టి నొప్పి తెలీదు. మొదట ఏసీఈ రిసెప్టర్లలో ఈ వైరస్ సోకుతుందని పరిశోధకులు గుర్తించారు. ఆ తరు వాత సార్స్ కోవ్ 2 కూడా శరీరంలోని న్యూరోపిలిన్-1కి సోకుతుందని తేల్చారు. ఈ అంశం తమను ఆకర్షించిందని ఈ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ రాజేష్ ఖన్నా అన్నారు.
పాలు, పాల సంబంధిత పదార్థాలను తీసుకుంటే పేగు క్యాన్సర్ ముప్పును 13 శాతం నుంచి 19 శాతం వరకు తగ్గించుకోవచ్చని కెనడాలోని మెక్‌గ్రిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వివరాలు ‘గట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఆస్ప్రిన్ వంటి మాత్రలతో (రోజుకు 75మిల్లీగ్రామ్-325మిల్లీగ్రామ్) కూడా …
పాలు, పాల సంబంధిత పదార్థాలను తీసుకుంటే పేగు క్యాన్సర్ ముప్పును 13 శాతం నుంచి 19 శాతం వరకు తగ్గించుకోవచ్చని కెనడాలోని మెక్‌గ్రిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వివరాలు ‘గట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఆస్ప్రిన్ వంటి మాత్రలతో (రోజుకు 75మిల్లీగ్రామ్-325మిల్లీగ్రామ్) కూడా ఈ క్యాన్సర్ ముప్పు 14 శాతం నుంచి 29 శాతం వరకు తగ్గుతున్నట్టు వివరించారు.
సూది చర్మానికి గుచ్చుకుంటేనే అల్లాడిపోతాం. అలాంటిది ఆ మహిళ మెదడులోకి చొచ్చుకొని పోయా యి. విచిత్రం ఏంటంటే.. ఆ సూదులు ఆమె మెదడులోకి ఎప్పుడు, ఎలా వెళ్లాయో తెలియదు. తలమీద చిన్న గాయం, మచ్చ కూడా లేదంట. మరి ఎలా వెళ్లింది.. చైనాలోని …
సూది చర్మానికి గుచ్చుకుంటేనే అల్లాడిపోతాం. అలాంటిది ఆ మహిళ మెదడులోకి చొచ్చుకొని పోయా యి. విచిత్రం ఏంటంటే.. ఆ సూదులు ఆమె మెదడులోకి ఎప్పుడు, ఎలా వెళ్లాయో తెలియదు. తలమీద చిన్న గాయం, మచ్చ కూడా లేదంట. మరి ఎలా వెళ్లింది.. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో జెంగ్జౌలో నివసిస్తున్న జుహు అనే 29 ఏళ్ల మహిళ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమెకు గాయాలు తగలకపోయినప్పటికీ వైద్యులను సంప్రదించింది. వారు అన్ని టెస్టులు చేసి, సీటీస్కాన్ కూడా చేశారు. ఆ స్కాన్ రిపోర్టులో అసలు విషయం బయట పడింది.ఆమె మెదడులో 4.9 మి.మీ. పొడవున్న 2 సూదులు కనిపించాయి. ఇది యాక్సిడెంట్ వల్ల జరిగిన ప్రమాదం కాదు. దీంతో షాక్‌కు గురైన వైద్యులు ఆమెను విచారించారు. కానీ తలకు సంబంధించిన గాయలు, ప్రమాదం, సర్జరీలు ఏమీ జరగలేదని చెప్పింది. చిన్నప్పుడు జుహు తల్లిదండ్రులు యాత్రలకు వెళ్లేటప్పుడు తనని తన పిన్ని ఇంట్లో వదిలేసి వెళ్లేవారట. అప్పుడు పిన్ని జుహు తల మీద రెండు మచ్చలు చూసినట్లు చెప్పిందని జుహు తల్లిదండ్రు లు వైద్యులకు వెల్లడించారు. ఇప్పుడు తలమీద గాయలు, మచ్చలు వంటివేం కనిపించకపోయేసరికి వైద్యులకు ఏం అర్థం కాలేదు. ఈ సూదులు ఇలానే ఉంటే ప్రమాదం వెంటనే సర్జరీ చేసి తొలిగించాలని వైద్యులు వెల్లడించారు.
ఇండియాతో గల సరిహద్దు ప్రాంతాలకు తమను పంపుతున్నందుకు చైనా సైనికులు కొందరు ఏడుస్తు న్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లడాఖ్ వాస్తవాధీన రేఖ వద్దకు తమను పంపడం పట్ల వారు అసంతృప్తిగా ఉన్నారని, భారత దళాల చేతిలో తమకు చావు …
ఇండియాతో గల సరిహద్దు ప్రాంతాలకు తమను పంపుతున్నందుకు చైనా సైనికులు కొందరు ఏడుస్తు న్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లడాఖ్ వాస్తవాధీన రేఖ వద్దకు తమను పంపడం పట్ల వారు అసంతృప్తిగా ఉన్నారని, భారత దళాల చేతిలో తమకు చావు తప్పదని భయపడి వీరు ఏడుస్తున్నట్టు ఉందని అంటున్నారు. వీళ్ళలో కొంతమంది ఇంకా కుర్ర వయస్సులోనే ఉన్నారు. కొత్తగా రిక్రూట్ అయిన సుమారు 10 మంది చైనాలోని అన్ హూ ప్రావిన్స్ కి చెందినవారు. వీళ్ళలో కొందరు కాలేజీ స్టూడెంట్స్ కూడా ఉన్నారని, టిబెట్ లో సేనలకు సహకరించేందుకుకొంతమంది స్వఛ్చందంగా సైన్యంలో చేరారని తెలుస్తోంది. అయితే వీరిది భయం కాదని, తమ కుటుంబాలను వీడి వెళ్తున్నందుకు బాధతో విలపిస్తున్నారని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. భారత సేనల చేతిలో తమకు మరణం తప్పదేమోనని ఈ కుర్ర సైనికులు ఏడుస్తున్నారన్న తైవాన్ కథనాన్ని ఈ పత్రిక ఖండించింది.
అమెరికా యొక్క టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను చేర్చింది. జాబితాలో చోటుదక్కిన వంద మందిలో బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా …
అమెరికా యొక్క టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను చేర్చింది. జాబితాలో చోటుదక్కిన వంద మందిలో బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఒక్కరే ఉండటం విశేషం. అయితే ఇదే సమయంలో చాలా పదునైన వ్యాఖ్యలు కూడా చేసింది.టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో చైనా అధినేత జి జిన్‌పింగ్ కూడా చోటు దక్కించుకున్నారు. ఆ యనతోపాటు జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ కూడా జాబితాలో ఉన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్య అభ్యర్థులుగా నిలిచిన జో బిడెన్, కమలాదేవి హారిస్‌తోపాటు యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ క్లినికల్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ రవీంద్ర గుప్తాలు కూడా ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఉన్నారు.100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత ప్రధాని నరేంద్రమోదీని చేర్చిన టైమ్స్ మ్యాగజైన్.. ఇదే సమయంలో ఆయనపై పదునైన వ్యాఖ్యలు కూడా చేసింది. భారతదేశంలోని 1.3 బిలియన్ జనాభాలో క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఇతర మతాల ప్రజలు ఉన్నారని టైమ్స్ మ్యాగజైన్ ఎడిటర్ కార్ల్ విక్ రాశారు. “భారతదేశంలో ని ప్రధానమంత్రులలో ఎక్కువ మంది హిందూ సమాజానికి చెందినవారు. అయితే మోదీ మాత్రమే వేరొకరి కోసం తనలాగే వ్యవహరిస్తున్నారు. అది పట్టింపు లేదు. హిందూ జాతీయవాద బీజేపీ ఎలిటిజం మాత్రమే కాదు, బహువచనాన్ని కూడా తిరస్కరించింది. ఇది ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసు కుంది. గయాలో నిరసనలను అణిచివేసేందుకు ఒక అంటువ్యాధి అనే సాకును బీజేపీ కనుగొంటుంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యం చీకటిగా మారింది” అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
జాబితాలో బిల్కిస్ బానో
ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో పౌరసత్వ చట్టం (సిఏఏ) కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్న 82 ఏండ్ల బిల్కిస్ బానోను కూడా టైమ్స్ జాబితాలో చేర్చారు. భారతీయ మూలాలున్న సుందర్ పిచాయ్ పేరును కూడా టైమ్స్ తన ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చేర్చింది. భారతదేశం నుంచి అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లి ట్రిలియన్ డాలర్ల కంపెనీకి సీఈవో కావడం వరకు అతని కథ ప్రత్యేకమైనదని టైమ్స్ మ్యాగజైన్ కొనియాడింది.
69 శాతం అవినీతితో భారత్ అగ్రస్థానం 65 శాతం అవినీతితో రెండో స్థానంలో వియత్నాం పాకిస్థాన్ లో 40 శాతం అవినీతి ఏ దేశం కోరుకోని అప్రతిష్టను భారత్ మూటకట్టుకుంది. ఆసియా ఖండంలోని అత్యంత అవినీతి దేశాల్లో తొలి స్థానంలో నిలిచింది. ఈ …
ఏ దేశం కోరుకోని అప్రతిష్టను భారత్ మూటకట్టుకుంది. ఆసియా ఖండంలోని అత్యంత అవినీతి దేశాల్లో తొలి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెల్లడించింది. జర్మ నీకి చెందిన ఈ సంస్థ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ సంస్థ నివేదికను ఫోర్బ్స్ పత్రిక వెల్లడిం చింది.ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 69 శాతం అవినీతితో ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. మన శత్రుదేశం పాకిస్థాన్ మనకంటే మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. పాకిస్థాన్ లో 40 శాతం అవినీతి నమోదైంది. ఈ జాబితాలో 65 శాతం మంది లంచాలు తీసుకునేవారితో వియత్నాం రెండో స్థానంలో నిలిచింది. థాయిలాండ్ లో 41 శాతం అవినీతి ఉన్నట్టు తేలింది. జపాన్ కేవలం 0.2 శాతం అవినీతితో చివరి స్థానంలో ఉంది.భారత్ లో ప్రతి 10 మందిలో ఏడుగురు ఏదో ఒక సందర్భంలో లంచాలు ఇచ్చేవారేనని ఈ సర్వేలో తేలింది. ప్రాథమిక సౌకర్యాల కల్పనకు కూడా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పింది. పబ్లిక్ స్కూల్స్, ఆసుపత్రుల్లో కూడా లంచాల బెడద ఉందని తెలిపింది. ఈ సర్వే ఫలితాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. భారత్ లో ఇంత భారీ స్థాయిలో అవినీతి ఉందా అనే చర్చ ప్రపంచ దేశాల్లో జరుగుతోంది.
నోవల్ కరోనా వైరస్ నియంత్రణలో T కణాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. అమెరికాలోని లా జొల్లా ఇమ్యూనాలజీ పరిశోధకులు ఈ విషయాన్ని చెప్పారు. సెల్ జర్నల్‌లో తమ నివేదికను వారు ప్రచురించారు. కోవిడ్19ని తగ్గించాలంటే శరీర రోగనిరోధక శక్తిలోని …
నోవల్ కరోనా వైరస్ నియంత్రణలో T కణాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. అమెరికాలోని లా జొల్లా ఇమ్యూనాలజీ పరిశోధకులు ఈ విషయాన్ని చెప్పారు. సెల్ జర్నల్‌లో తమ నివేదికను వారు ప్రచురించారు. కోవిడ్19ని తగ్గించాలంటే శరీర రోగనిరోధక శక్తిలోని T కణాల పాత్ర విశేషమైందని పరిశోధకులు గుర్తించారు. వ్యాధి తీవ్రత అదుపులోకి రావాలంటే.. శరీరంలోని హెల్పల్ (టీహెచ్) లేదా కిల్లర్(సీఎల్టీ) కణాలు కీలకమైనవని పేర్కొన్నారు. యాంటీబాడీలతో పాటు T కణాలు ఎక్కువ ఉంటేనే వైరస్ ఉదృతిని తగ్గించే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న కేసు ల్లో యాంటీబాడీల కన్నా.. టీ కణాల ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 65 ఏళ్లు దాటిన వృద్ధుల్లో T కణాల సంఖ్య తక్కువగా ఉండడం వల్లే.. వారిలో కోవిడ్‌ను తగ్గించే ప్రక్రియ కష్టంగా మారు తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇమ్యూనిటీని పెంచుకోవడంలో యాంటీబాడీలతో పాటు హెల్పర్, కిల్లర్ టీ కణాలు కూడా కీలకమని పరిశోధకులు చెప్పారు.
న్ను నొప్పితో ఇతరత్రా సమస్యల కారణంగా డాక్టర్ వద్దకు వస్తారు. పాడైన పన్నును డాక్టర్ తొలిగిస్తాడు. ఇలా చేయడం సర్వసాధారణం. మరి దీనికి ఆ డాక్టర్‌ను జైల్లో వేయడం ఏంటి. అది కూడా 12 ఏండ్లు అనుకుంటున్నారా. దీనికి కారణం లేకపోలేదు. ఆ …
న్ను నొప్పితో ఇతరత్రా సమస్యల కారణంగా డాక్టర్ వద్దకు వస్తారు. పాడైన పన్నును డాక్టర్ తొలిగిస్తాడు. ఇలా చేయడం సర్వసాధారణం. మరి దీనికి ఆ డాక్టర్‌ను జైల్లో వేయడం ఏంటి. అది కూడా 12 ఏండ్లు అనుకుంటున్నారా. దీనికి కారణం లేకపోలేదు. ఆ డాక్టర్ చేసిన పనికి శిక్ష కూడా సరిపోదు అంటున్నా రు. ఆ డాక్టర్ పన్ను పీకడంతోపాటు చేసిన తప్పేంటో తెలిస్తే మీరు కూడా శిక్ష కరెక్టే అంటారు. డాక్టర్లను దేవుడితో పోలుస్తారు. పన్ను నొప్పితో బాధపడుతూ డాక్టర్ దగ్గరకు వచ్చిన పేషంట్‌ను డాక్టర్ ఫన్నీగా తీసుకున్నాడు.ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి పడుకోబెట్టాడు. పేషంట్‌కు మత్తుమందు ఇచ్చి అతను మా త్రం హోవర్డ్బోర్డు మీద నిల్చున్నాడు. అంటే ఇది చక్రాల్లా అటూ ఇటూ కదులుతుంటుంది. వీటిని ఎక్కు వగా సర్కస్‌లో ఉపయోగిస్తారు. దాని మీద నిల్చొని పేషంట్ పన్ను పీకాడు. ఈ సమయంలో హోవర్డ్ బోర్డు ఏ మాత్రం కదిలినా పేషంట్ ప్రాణాలకే ప్రమాదం. అవేవి పట్టించుకోకుండా డాక్టర్ అతని ప్రాణాలతో చెలగాటమాడాడు. ఆ డెంటిస్ట్ అంతటితో ఆగలేదు. వైద్యం చేస్తూనే వీడియో తీసుకున్నాడు. తానేదో గొప్ప పనిచేస్తున్నట్లు పొంగిపొర్లిపొతున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఇది చూసిన కొందరు డాక్టర్‌పై విరుచుకుపడుతూ కేసు పెట్టారు. డాక్టర్ ఎంత చిత్తశుద్దితో ప నిచేయాలి. కానీ ఈ డాక్టర్‌ను నమ్ముకొని వచ్చిన పేషంట్లను ఇలా ఆడుకుంటున్నాడు. ఇతనికి శిక్షప డాలి అంటూ వాపోతున్నారు. దీన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకొని కోర్టుకు హాజరుపరిచారు. ప్రమాద కర స్టంట్లతో వైద్యం చేయడం వంటి కేసులు నమోదుకావడంతో అతనికి 12 ఏండ్లు జైలు శిక్ష విధించిం ది. ఈ డెంటిస్ట్ ఇలాంటివే కాదు వైద్యం చేయకుండా చేశానని చెప్పి డబ్బులు వసూలు చేస్తుంటాడు. ఇప్పుడు వెలుగులోకి రావడంతో జైలుపాలయ్యాడు. ఈ సంఘటన అలస్కాలోని ఎంకరేజ్‌లో చోటు చేసుకున్నది. ఈ డెంటిస్ట్ పేరు సేథ్ లోక్‌హార్ట్.
మహిళ చెట్టును పెళ్లి చేసుకోవడం ఏంటి. సోది అనుకుంటారేమో. నిజమే.. చెట్టును పెళ్లి చేసుకుంటే గొడవలు, విడాకులు అన్న మాటే ఉండదు కదా అంటున్నది ఆ మహిళ. అంతేకాదు ఈ చెట్టు తమ తండ్రి అని చెప్పుకోవడానికి ఇద్దరు కుమారులు సిగ్గు పడుతున్నారు. …
మహిళ చెట్టును పెళ్లి చేసుకోవడం ఏంటి. సోది అనుకుంటారేమో. నిజమే.. చెట్టును పెళ్లి చేసుకుంటే గొడవలు, విడాకులు అన్న మాటే ఉండదు కదా అంటున్నది ఆ మహిళ. అంతేకాదు ఈ చెట్టు తమ తండ్రి అని చెప్పుకోవడానికి ఇద్దరు కుమారులు సిగ్గు పడుతున్నారు. ఇదంతా వింటుంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంది కదా. మెర్సీసైడ్ లోని సెఫ్టోన్లో దగ్గర్లో ఉన్న రిమ్‌రోజ్ వ్యాలీ కౌంటీ పార్క్ సమీపంలో నివసిస్తున్న కేట్ కన్నింగ్ హామ్ అనే మహిళకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కడాపుట్టారు. కానీ వివాహం మాత్రం చేసుకోలేదు. ఎప్పుడు పెళ్లిచేసుకోమన్నా నో చెబుతున్నాడు. అందుకే ఆమెకు కోపమొచ్చి గతేడాది ఒక చెట్టును పెళ్లి చేసుకున్న ది. అంతేకాదు ఇటీవల వన్ ఇయర్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నది.దీం తో ఆమె చాలా సంతోషంగా ఉంది. చెట్టును పెళ్లిచేసుకొని దాని బాగోగులు చూసుకుం టూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. కానీ ఆమె పిల్లలు మాత్రం సిగ్గు పడుతున్నారు. చెట్టు మా త్రండి ఏంటని చిరాకు పడుతున్నారు. ‘ఎవరు ఏమనుకున్నానేను పట్టిం చుకోను. ఈ చెట్టు నాకు చాలా సంతోషాన్నిస్తుంది’ అని చెబుతున్నది. అయితే రిమ్ రోజ్ వ్యాలీ కౌంటీ పార్క్ మీదుగా బైపాస్ రోడ్డు నిర్మించాలని అధికారులు భావిస్తున్నా రు. దీనికి అక్కడున్న స్థానికులు ఒప్పుకోలేదు. దీని మీద ఉధ్యమం కూడా నడుస్తు న్నది. వీరంతా చెట్లను నరకొద్దని చెబుతుంటే కేట్ ఏకంగా పార్క్‌లో ఉన్న ఓ చెట్టును పెళ్లి చేసుకొన్న విషయం తెలియడంతో ఆమెకు అక్కడివాళ్లంతా అభిమానులుగా మారిపోయారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఏటా ‘మ్యారీ ఏ ట్రీ డే’ అనే కార్యక్రమం నిర్వహించాలంటున్నారు.