వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంలో నలుగురు మరణించగా, పలువులు గాయపడ్డారు. శనివారం ఉదయం మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం …
మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె …
అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. …
ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు అంతా బాగానే ఉంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున …
సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘అమృత’ సాంగ్ విడుదల యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో …
ఇటీవలే మొదలైన ‘వకీల్ సాబ్’ షూట్ అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ దసరాకి సినిమా నుంచి అప్ డేట్ సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు …
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి మ్యాన్ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలి ప్రభావిత ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలి తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతోన్న నేపథ్యంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై …
ఎఫ్3లో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే నటిస్తే ఈ సినిమాలో మరింత ఫన్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్‌గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా …
కొవిడ్-19 నేపథ్యంలో వినూత్న కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్న చెర్రీ దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆన్లైన్ డ్యాన్స్ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా …
సుధీర్ బాబు భార్య ప్రియ పుట్టినరోజు వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ …
రుచి, వాసన తెలియకపోతే కరోనా కావొచ్చని వెల్లడి పరిశోధన జరిపిన యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఉల్లి, వెల్లుల్లి వాసనలు తెలియకపోతే టెస్టు చేయించుకోవాలన్న నిపుణులు కరోనా వైరస్… చైనాలో పుట్టిన ఈ రాకాసి వైరస్ ప్రపంచానికి పూర్తిగా కొత్త. తొలినాళ్లలో దీనికి నిర్దిష్ట …
ఉల్లి, వెల్లుల్లి వాసనలు తెలియకపోతే టెస్టు చేయించుకోవాలన్న నిపుణులు
కరోనా వైరస్… చైనాలో పుట్టిన ఈ రాకాసి వైరస్ ప్రపంచానికి పూర్తిగా కొత్త. తొలినాళ్లలో దీనికి నిర్దిష్ట వైద్య విధానం గానీ, దీని లక్షణాలపై స్పష్టమైన అవగాహన గానీ లేదు. అయితే క్రమంగా పరిశోధకులు, వైద్య నిపుణులు కరోనా వైరస్ ను నిశితంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో యూనివర్సిటీ కాలేజ్ లండన్ కు చెందిన పరిశోధ కులు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కరోనా సోకిన వ్యక్తి కొన్నిరోజుల పాటు వాసన, రుచి చూసే శక్తి కోల్పోతాడని ఇప్పటికే అనేక అధ్యయనాలు తెలిపాయి.తాజాగా లం డన్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో, ఈ రెండు లక్షణాలే కరోనా నిర్ధారణలో అత్యంత కీలకమని వెల్లడైంది. జ్వరం, జలుబు, దగ్గు కంటే వాసన, రుచి కోల్పోవడమే కరోనా వైరస్ కలిగించే లక్షణాల్లో ప్రధానమైనవని వీరు తేల్చారు. ఈ పరిశోధనలో భాగంగా రుచి, వాసన శక్తిని కోల్పోయిన 590 మందిని పరిశీలించారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 78 శాతం మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ చేశారు. 40 శాతం మందిలో జ్వరం, దగ్గు లేకపోగా, రుచి, వాసన శక్తి తగ్గినట్టు గుర్తించారు.ఈ రెండు లక్ష ణాల ద్వారా కరోనా రోగులను త్వరగా గుర్తించేందుకు వీలుపడుతుందని, తద్వారా వైరస్ వ్యాప్తిని మరింత సమర్థంగా అడ్డుకోవచ్చని ఈ పరిశోధనకు నాయకత్వం వహిం చిన ప్రొఫెసర్ రేచెల్ బాటర్ హమ్ తెలిపారు. కరోనా సోకిందని అనుమానం ఉన్నవా ళ్లు ఇంట్లో ఉండే వెల్లుల్లి, ఉల్లి, పెర్ఫ్యూమ్, కాఫీ వాసనలు గుర్తించేందుకు ప్రయత్నించాలని, వాటి వాసన తెలియకపోతే కరోనా టెస్టు చేయించుకోవాలని పరిశోధకులు వెల్లడించారు.
ఆస్ట్రియాలోని 86 మంది రోగులపై అధ్యయనం ఆరోవారంలో 88 శాతం వరకు క్షీణించిన ఊపిరితిత్తుల సామర్థ్యం అధ్యయనానికి ఎంపిక చేసిన వారిలో సగం మందికి పొగ తాగే అలవాటు కరోనా నుంచి కోలుకున్నాక కూడా దీర్ఘకాలంపాటు సమస్యలు వేధించే అవకాశం ఉందని యూరోపియ …
ఆరోవారంలో 88 శాతం వరకు క్షీణించిన ఊపిరితిత్తుల సామర్థ్యం
అధ్యయనానికి ఎంపిక చేసిన వారిలో సగం మందికి పొగ తాగే అలవాటు
కరోనా నుంచి కోలుకున్నాక కూడా దీర్ఘకాలంపాటు సమస్యలు వేధించే అవకాశం ఉందని యూరోపియ న్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులకు ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, కొందరిలో ఈ సమస్య కొంతకాలం తర్వాత తగ్గిపో తుందన్నారు. ఆస్ట్రియాలోని పలు ఆసుపత్రులలో 86 మంది కరోనా రోగులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.అధ్యయన వివరాలను వర్చువల్ కాంగ్రెస్ సమావేశంలో వివరించారు. రోగులు డిశ్చార్జ్ అయిన అనంతరం 6, 12 వారాల్లో వారి ఊపిరితిత్తులు, గుండె పనితీ రుకు సంబంధించి పలు పరీక్షలు నిర్వహించి ఫలితాలను నమోదు చేసినట్టు వివరించారు. ఆరోవారంలో సీటీ స్కాన్ తీయగా వారి ఊపిరితిత్తుల సామర్థ్యం 88 శాతం వరకు క్షీణించిందని, 12వ వారంలో అది 56 శాతానికి తగ్గిందని విశ్లేషించారు.అయితే, ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసిన వారిలో సగం మందికి పొగ తాగే అలవాటు ఉందని, 65 శాతం మంది ఊబకాయులని అధ్యయనకారులు తెలిపారు. అయితే, ఎటువంటి వ్యసనాలు లేని వారికి ఈ ముప్పు ఎంతవరకు ఉంటుందన్న విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదు.
ఒకసారి కరోనా వచ్చి నెగటివ్ వచ్చిన తర్వాత శరీరకంగా ఎంతో బలహీనతకు గురవుతారు. తగ్గిపోయిం ది కదా అని మరలా పాత లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడడం సబబు కాదు. దీనివల్ల మరికొన్ని అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కరోనా నెగటివ్ వచ్చిన తర్వాత ప్రాణామాయం అసలు చేయకూడ దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి చేస్తే ఏమవుతుందో కూడా తెలియజేశారు. అదేంటంటే.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తులు బాగా బలహీనపడుతాయి. ఒకవేల వీరికి గనుక ఎసిడిటీ ఉంటే మరింత ప్రమాదానికి గురవుతారు. వీరు పడుకున్నప్పుడు గొంతు నుంచి వచ్చే యాసి డ్లు ఊపిరితిత్తుల్లోకి చేరుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ యాసిడ్లు ఊపిరితిత్తులను నెమ్మదిగా పనికిరా కుండా మార్చేస్తాయి. అందుకే ఎసిడిటీ ఉన్నవాళ్లు వైద్యుల సలహా తీసుకోవాలంటున్నారు. ఇకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేవాళ్లు యోగాసనాలు వేసేస్తుంటారు. ముఖ్యంగా ప్రాణామాయం అసలు చేయ కూడదంటున్నారు. దీనివల్ల శ్వాస తీసుకోవడం అసౌకర్యంగా ఉంటుంది. ప్రాణామాయం చేయడం వల్ల ఊపిరితిత్తుల మీద పగుళ్లు ఏర్పడుతాయి. అందుకనే అలోమ, విలోమ వ్యాయామాలు చేస్తే బెటర్ అంటున్నారు నిపుణులు.
వాతావరణం అనుకూలంగా ఉంటే ఎలాంటి రోగాలు దరిచేరవు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా వచ్చే సమస్యలకు కారణం వాతావరణం కాలుష్యమే. దీనివల్ల మనం పీల్చే గాలి కూడా కాలుష్యం అవుతుంది. మరి తింటున్న తిండితోనే కాకుండా …
వాతావరణం అనుకూలంగా ఉంటే ఎలాంటి రోగాలు దరిచేరవు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా వచ్చే సమస్యలకు కారణం వాతావరణం కాలుష్యమే. దీనివల్ల మనం పీల్చే గాలి కూడా కాలుష్యం అవుతుంది. మరి తింటున్న తిండితోనే కాకుండా పీల్చే గాలి కూడా కాలుష్యంగా మారితే ఎన్నిరోజులని బతుకుతాం. ఒక్కోసారి హాస్పిటల్లో బిల్లు చెల్లించేందుకే రోజంతా కష్టపడి సంపాదిస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు గాలి కాలుష్యం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే కాస్త అయినా జాగ్రత్తగా ఉంటారు. మరి అవేంటో తెలుసుకోండి.
ఎలాంటి వ్యాధి వచ్చినా భరించవచ్చు గాని బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆ బాధ వర్ణణాతీతం. శరీరంలోని రక్తనాళాల్లో ఏదైనా అవరో ధం వస్తే దాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఇది ఎంతటి మనిషినై నా ఇబ్బందికి గురి చేస్తుంది. ఇలాంటి ప్రమాదకర స్థితి …
ఎలాంటి వ్యాధి వచ్చినా భరించవచ్చు గాని బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆ బాధ వర్ణణాతీతం. శరీరంలోని రక్తనాళాల్లో ఏదైనా అవరో ధం వస్తే దాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఇది ఎంతటి మనిషినై నా ఇబ్బందికి గురి చేస్తుంది. ఇలాంటి ప్రమాదకర స్థితి నుంచి బయట పడలేక మనిషి ప్రాణాలే కోల్పోతున్నాడు. దీని నుంచి బయట పడాలంటే తినే ఆహారంలో ప్రతిరోజూ పాలు, పెరుగు, పండ్లు, జున్ను వంటి పదార్థాలను యాడ్ చేసుకోవాలి.వీటిని ప్రతిరోజూ తినడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ నుంచి బయట పడొచ్చు. ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు తొమ్మిది దేశాల్లోని 4.18 లక్షల మంది ఆహారపు అలవాట్లు, ఆరోగ్యాన్ని పరిశీలిం చిన తర్వాత ఈ విషయాలను వెల్లడించారు. అంతేకాదు వీటి తో పాటు కూరగాయలు, కోడిగుడ్లు తిన్నా మంచి జరగుతుం దంటున్నారు. ఎందుకంటే ఇందులో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది.
గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సంక్రమిస్తుంది ఇండోర్ లో 4.8 మీటర్ల వరకు వైరస్ విస్తరిస్తుంది ముఖాన్ని కవర్ చేసుకోవడంలో జాగ్రత్త అవసరం ప్రస్తుతం మనం పాటిస్తున్న రెండు మీటర్లు లేదా ఆరు అడుగుల భౌతికదూరం వల్ల ఉపయోగం లేదని ఫ్లోరిడా …
ప్రస్తుతం మనం పాటిస్తున్న రెండు మీటర్లు లేదా ఆరు అడుగుల భౌతికదూరం వల్ల ఉపయోగం లేదని ఫ్లోరిడా యూనివర్శిటీ వైరాలజీ విభాగానికి చెందిన పరిశోధకులు అన్నారు. ఇండోర్ వాతావరణంలో 2 నుంచి 4.8 మీటర్ల వరకు గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని తెలిపారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవా లంటే… ఇప్పుడు అనుసరిస్తున్న మార్గదర్శకాలను సవరించాలని సూచించారు. ఈ మేరకు మెడ్ రెక్సివ్ లో ప్రచురితమైన తమ పరిశోధనాపత్రంలో పేర్కొన్నారు.దగ్గుతూ, చీదుతూ మాట్లాడేవారి సమీపంలో గాలిని పీల్చడం ద్వారా కరోనా సోకుతుందని పరిశోధకులు చెప్పారు. జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్లకపోవడమే మంచిదని… ముఖాన్ని కవర్ చేసుకోవడంలో కూడా జాగ్రత్త అవసరమని సూచించారు. కార్యాలయాల్లో మనం పాటిస్తున్న రెండు మీటర్ల భౌతికదూరం… ఉద్యోగుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందని చెప్పారు.గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపించదని తొలుత ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదించిన సంగతి తెలిసిందే. అయితే, గాలి ద్వారా వైరస్ సంక్రమిస్తుందని చెప్పడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని 239 మంది శాస్త్రవేత్తలు లేఖలు రాయడంతో… ఈ వాదనను డబ్ల్యూహెచ్ఓ అంగీకరించింది.
ప్రాణాంతకంగా మారుతున్న రక్తం గడ్డలు 25-30 శాతం రోగుల్లో పల్మనరీ థ్రాంబోసిస్ చికిత్స ఆలస్యమైతే కాళ్లు తొలిగించాల్సిందే హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా సోకినవారిలో రక్తం గడ్డ కట్టే సమస్య ఇటీవల తీవ్రమవుతున్నది. కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టడాన్ని (పల్మనరీ థ్రాంబోసిస్)గతంలోనే గుర్తించారు. …
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా సోకినవారిలో రక్తం గడ్డ కట్టే సమస్య ఇటీవల తీవ్రమవుతున్నది. కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టడాన్ని (పల్మనరీ థ్రాంబోసిస్)గతంలోనే గుర్తించారు. వైరస్ సోకి దవాఖానల్లో చేరిన 25-30శాతం మందిలో రక్తం గడ్డకడుతున్నట్టు తెలుస్తున్నది. రక్తం గడ్డకట్టడం వల్ల ఆయా అవయవాలకు రక్త ప్రసరణ నిలిచిపోతున్నది. ఫలితంగా అవి చచ్చుబడిపోతున్నాయి. మెదడు, ఊపిరితిత్తులు వంటి ప్రధాన అవయవాలకు రక్తం చేరకపోవడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్నది.
హోం ఐసొలేషన్‌లో ఉన్నవారు జాగ్రత్త
గడ్డకట్టిన రక్తం కాళ్లలోకి చేరినవారికి కాళ్లల్లో, పాదాల్లో విపరీతమైన నొప్పులు వస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. వీరికి సకాలంలో వైద్యం అందకుంటే కాలు తీసేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కరోనా సోకి ఇంట్లోనే చికిత్స పొందుతున్నవారు పాదాల్లో మంటలు వస్తే వెంటనే దవాఖానకు వెళ్లాలని సూచి స్తున్నారు. ఆలస్యంగా రావడం వల్ల జూలైలోనే ఆరుగురికి కాళ్లు తీసేయాల్సి వచ్చిందని హైదరాబాద్ లోని ఓ వైద్యుడు తెలిపారు. కాళ్లలో మంటలతోపాటు ఊపిరి రేటు నిమిషానికి 20 కన్నా తక్కువగా, ఆక్సిమీటర్‌లో ఆక్సిజన్ లెవల్స్ 93 కన్నా తక్కువగా ఉంటే థ్రాంబోసిస్‌గా గుర్తించాలన్నారు. వైద్యులు సైతం వెంటనే రక్తం గడ్డకట్టడాన్ని నివారించే మందులు ఇవ్వాలని సూచిస్తున్నారు.
l రక్తం గడ్డలు మెదడుకు చేరితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది.
l ఊపిరితిత్తుల్లోకి చేరి రక్తం సరఫరాను అడ్డుకుంటే కంపార్ట్మెంట్ సిండ్రోమ్ వచ్చి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.
l నరాల్లో ఉంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (డీవీటీ), రక్తనాళాల్లో ఉంటే ఎక్యూట్ లింబ్ ఇష్కేమియా వస్తున్నట్టు వైద్యులు గుర్తించారు.
ఆలస్యంగా దవాఖానకు వస్తే ప్రమాదం
గత నెలలో మా దగ్గరికి వచ్చిన బాధితుల్లో 14 మందిలో కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం చూశాం. కొందరు ఆలస్యంగా రావడం వల్ల ఆరుగురికి కాళ్లు తీసేయాల్సి వచ్చింది. ముగ్గురికి డీవీటీ ఏర్పడి సివియర్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్‌తో ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి విపరీతమైన కాళ్లనొప్పులు, శ్వాససరిగా అందకపోవడం వంటి లక్షణాలుంటే వెంటనే దవాఖానకు వెళ్లాలి. ఆరోగ్యవంతుల్లోనూ రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉంటాయి. చిన్న జాగ్రత్తలతో దీనిని అధిగమించవచ్చు. ఎప్పుడూ మంచం మీదే విశ్రాంతి తీసుకోవద్దు. ఎక్కువగా నీళ్లు తాగాలి. కాలి వ్యాయామాలు, ఊపిరితిత్తుల వ్యాయామాలు చేయాలి. -డాక్టర్ నరేంద్రనాథ్, కిమ్స్ హాస్పిటల్
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇంకా వైరస్ గురించి పూర్తిగా తెలియని పరిస్థితి. ఒకవైపు వైరస్ ను నిరోధించే వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తూ తన జన్యు క్రమాన్ని …
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇంకా వైరస్ గురించి పూర్తిగా తెలియని పరిస్థితి. ఒకవైపు వైరస్ ను నిరోధించే వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తూ తన జన్యు క్రమాన్ని కూడా మార్చుకుంటూ మరింత ప్రాణాంతకంగా మారుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు భారీ సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడి కోసం ఎన్ని చర్యలు చేపట్టినా మహమ్మారి తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా వైరస్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా మందుస్తు అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో కరోనా తీవ్రత ప్రాణాంతకంగా మారుతుంది. వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ ఈ వైరస్ విజృంభిస్తోంది.. రికవరీ రేటు సానుకూలంగా ఉన్నప్పటికీ మరణాల రేటు భయాందోళన గురిచేస్తోంది. కరోనా సోకిన వారిలో ఎవరికి ప్రాణాంతకమనేది తప్పక గుర్తించాల్సిన విషయం.. దీనిపై నిర్వహించిన ఓ కొత్త అధ్యయనాన్ని Journal of American Medical Associationలో ప్రచు రించారు. ప్రాణాంతక కరోనా వైరస్ సోకిన వారిలో మరణించే అవకాశాలు ఎవరిలో ఎక్కువగా ఉంటాయో ఈ అధ్యయనం తేల్చింది.ఇందులో భాగంగా అమెరికా వ్యాప్తంగా మార్చి నుంచి ఏప్రిల్ వరకు 65 ఆస్ప త్రుల్లో 2,215 మంది కరోనా రోగులను పరీక్షించారు. వైరస్ సోకిన వారిలో 875 మంది మరణించారు. కరోనాతో మరణించివారిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో గుర్తించారు. కరోనాతో మరణ ముప్పుకు ఈ 6 కారకాలను ప్రధానంగా పరిశోధకులు తేల్చేశారు. అవేంటో ఓసారి చూద్దాం.. 1. 60 ఏళ్ల దాటితే (వృద్ధాప్యం): కరోనా వైరస్ ముప్పు అత్యధికంగా 60 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా ఉంటుందని JAMA రిపోర్టు ధ్రువీకరించింది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు కరోనావైరస్ కారణంగా మరణించడానికి మూడు రెట్లు అవకాశం ఉందని గుర్తించారు. 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు వైరస్ బారిన పడే అవకాశం 11 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
2. పురుషుల్లోనే అధికం : అధ్యయనం ప్రకారం.. కరోనావైరస్.. మహిళల్లో కంటే పురుషుల్లోనే ప్రభావం ఎక్కువనే ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చేశాయి. అయితే కరోనా సోకిన పురుషుల్లో మరణించే అవకాశం 1.5 రెట్లు ఎక్కువగా గుర్తించారు.
కొన్ని కొమొర్బిడిటీలు స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా ఉండటం వల్ల ఈ ముప్పు అధికంగా ఉంటుందని తేల్చేశారు. COVID విషయానికి వస్తే లింగ విభజన మరింత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
3. ఊబకాయం (స్థూలకాయం) : అధిక బరువు ఉన్నవారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఊబకాయంతో బాధపడేవారిలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. శరీరంలోని అనేక భాగాలపై ఊబకాయం ప్రభావం పడుతుంది.
రోగనిరోధక శక్తి కూడా బలహీన పడుతుంది. JAMA అధ్యయనం ప్రకారం.. 40 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో BMI ఉన్నవారు, తీవ్రమైన ఊబకాయం ఉన్నవారు, వైరస్‌తో మరణించే అవకాశం 1.5 రెట్లు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు.
4. కొరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నవారిలో : కొరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్న పేషెంట్లు (రక్తప్రసరణ గుండె ఆగిపోవడం, దీర్ఘకాలిక obstructive pulmonary వ్యాధితో సహా) కూడా COVID-19కు గురయ్యే అవకాశం 1.5 రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది. గుండె సంబంధిత వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారిలోనూ కరోనా ముప్పు అధికంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు
5. క్యాన్సర్ వ్యాధి : క్యాన్సర్ రోగుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. క్యాన్సర్ సంబంధింత సమస్యలు ఉన్నవారికి కరోనా వైరస్ సోకితే మరింత ప్రాణాంతకమని పరిశోధకులు అంటున్నారు.
క్యాన్సర్ రోగులకు ఒకవేళ కరోనా సోకితే వైరస్ తో పోరాడటం చాలా కష్టమని అంటున్నారు. COVID కారణంగా క్యాన్సర్ రోగులు చనిపోయే అవకాశం 2 రెట్లు ఎక్కువ అని అధ్యయనం సూచిస్తోంది.
6. ఐసీయు బెడ్ కొరత : ఇది వ్యక్తిగత అనారోగ్య సమస్య కాకపోవచ్చు.. కానీ, COVID-19 సోకిన రోగి ఆస్పత్రిలో చేరినప్పుడు ఐసీయూ పడకల కొరత అధికంగా ఉంటే మరణించే అవకాశం గణనీయంగా పెరిగిందని JAMA నివేదిక పేర్కొంది.
తక్కువ ఐసియు పడకలు ఉన్న ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగులకు మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నివేదిక తెలిపింది. సరైన వైద్య సదుపాయాలు లేక.. సకాలంలో వైద్య సాయం అందక కూడా చాలామంది కరోనా రోగులు మరణించే అవకాశం ఉంటుందని నివేదిక వెల్లడించింది.
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తగినంత మోతాదులో నీటిని తాగాలన్న విషయం అందరికీ తెలిసిందే. నీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. అన్ని అవయవాలకు పోషకాలు సరిగ్గా అందుతాయి. శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. అయితే సాధారణ …
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తగినంత మోతాదులో నీటిని తాగాలన్న విషయం అందరికీ తెలిసిందే. నీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. అన్ని అవయవాలకు పోషకాలు సరిగ్గా అందుతాయి. శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. అయితే సాధారణ నీటికి బదులుగా గోరు వెచ్చని నీటిని తాగితే మనకు ఇంకా అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటంటే..
* గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల ముక్కు, గొంతులలో ఉండే శ్లేష్మం కరుగుతుంది. శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడేవారు గోరు వెచ్చని నీటిని తాగితే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. * గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్ణంతో ఇబ్బందులు పడేవారు గోరు వెచ్చని నీటిని తాగితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. * గోరు వెచ్చని నీటిని తాగితే శరీర మెటబాలిజం పెరిగి ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. * మలబద్దకం ఉన్నవారు గోరు వెచ్చని నీటిని తాగితే సుఖ విరేచనం అవుతుంది. అలాగే రక్తంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మన శ్వాసకోశ వ్యవస్థపైనే ప్రభావం చూపుతుందని ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం. కానీ, ఇది మొత్తం శరీరంపైనే ఎఫెక్ట్ చూపిస్తుందనే చేదునిజం తాజాగా తెలిసింది. ముఖ్యంగా మెదడు దెబ్బతినే అవకాశం చాలావరకు ఉందని ఓ అధ్యయనంలో తేలింది. కొవిడ్-19 …
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మన శ్వాసకోశ వ్యవస్థపైనే ప్రభావం చూపుతుందని ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం. కానీ, ఇది మొత్తం శరీరంపైనే ఎఫెక్ట్ చూపిస్తుందనే చేదునిజం తాజాగా తెలిసింది. ముఖ్యంగా మెదడు దెబ్బతినే అవకాశం చాలావరకు ఉందని ఓ అధ్యయనంలో తేలింది. కొవిడ్-19 వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతున్నదని పరిశోధకులు గుర్తించారు. నాడీవ్యవస్థ దెబ్బతినడంతోపాటు మతిమరుపు సమస్య వచ్చే ప్రమాదముందని నిర్ధారించారు. ఈ అధ్యయన వివరాలు ది లాన్సెట్ న్యూరాలజీ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల రోగిలో అరుదైన, ప్రాణాంతక మెదడు వాపులాంటి లక్షణాలు కన్పిస్తున్నాయని గుర్తించారు. దీన్నే అక్యూట్ డిసెమినేటెడ్ ఎస్సిఫలోమైలిటీస్ (ఏడీఈఎం) అని పిలుస్తారని వారు పేర్కొన్నారు. దీనివల్ల మెదుడులో తీవ్రమైన నొప్పి కలుగుతుందని, ఇలా ఓ తొమ్మిది మంది బాధపడుతున్నట్లు తాము గుర్తించామని సైంటిస్టులు పేర్కొన్నారు. ఇది సాధారణంగా పిల్లల్లో కనిపిస్తుందని, మెదడు, వెన్నుపా ము రెండింటినీ ప్రభావితం చేస్తుందని తెలిపారు.అలాగే, తాము పరీక్షించిన 43 మంది రోగుల్లో కొందరికి శ్వాసకోశ లక్షణాలే కనిపించలేదని వారు వెల్లడించారు. కాగా, కొవిడ్-19 వల్ల రోగుల్లో కలుగుతున్న దీర్ఘకాలిక నష్టం ఏంటో ఇంకా తెలియలేదని, కానీ, తమ స్టడీ ఆధారంగా వారిలో మెదడు సమస్యలను క్రమబద్ధంగా పర్యవేక్షించాల్సిన అవసరం మాత్రం ఉందని గుర్తించినట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ రాస్ పాటర్సన్ పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని కరోనా చికిత్స, వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేయాల్సి ఉంటుందన్నారు.