వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంలో నలుగురు మరణించగా, పలువులు గాయపడ్డారు. శనివారం ఉదయం మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం …
మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె …
అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. …
ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు అంతా బాగానే ఉంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున …
సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘అమృత’ సాంగ్ విడుదల యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో …
ఇటీవలే మొదలైన ‘వకీల్ సాబ్’ షూట్ అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ దసరాకి సినిమా నుంచి అప్ డేట్ సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు …
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి మ్యాన్ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలి ప్రభావిత ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలి తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతోన్న నేపథ్యంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై …
ఎఫ్3లో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే నటిస్తే ఈ సినిమాలో మరింత ఫన్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్‌గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా …
కొవిడ్-19 నేపథ్యంలో వినూత్న కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్న చెర్రీ దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆన్లైన్ డ్యాన్స్ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా …
సుధీర్ బాబు భార్య ప్రియ పుట్టినరోజు వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ …
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1.40 కోట్లు దాటింది. ఆరు లక్షల మందికిపైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పలు దేశాలు కరోనాకు వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. వాటిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సి టీకి చెందిన జెన్నర్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న టీకా ముందంజలో ఉన్నది. అదేవిధంగా కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కూడా పలు సంస్థలు కొత్తకొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి.ఈ నేపథ్యం లోనే ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్తరకం రక్తపరీక్షను అభివృద్ధి చేశారు. ఈ కొత్త పరీక్ష ద్వారా ఒక వ్యక్తికి కరోనా సోకిందా లేదా అనే విషయాన్ని కేవలం 20 నిమిషాల్లోనే తెలు సుకోవచ్చు. అంతేగాక ఈ కొత్తరకం పరీక్ష ద్వారా కరోనా సోకినవారినే కాకుండా కరోనా బారినపడి కోలు కున్నవారిని సైతం గుర్తించవచ్చని మోనాష్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. అదేవిధంగా వ్యాక్సిన్ పరీక్షల్లో అవసరమైన యాంటీబాడీల వృద్ధిని కూడా కరోనా పరీక్షల ద్వారా త్వరగా తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.ఇటీవల తమ పరిశోధకులు 25 మైక్రోలీటర్ల ప్లాస్మాను ఉపయోగించి కరోనా కేసులను గుర్తించినట్లు మోనాష్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా పాజిటివ్ కేసులు ఎర్ర రక్తకణాల క్లస్టరింగ్‌కు కారణమవుతాయని, ఇకపై దాన్ని కంటితో సులభంగా గుర్తించవ చ్చని యూనివర్సిటీ పేర్కొన్నది. ఈ పరీక్షను ఉపయోగించి పరిశీలకులు కేవలం 20 నిమిషాల్లోనే పాజిటివ్, నెగెటివ్ రీడింగ్స్ పొందవచ్చని యూనివర్సిటీ వెల్లడించింది.
విశ్వంలోని జీవం పుట్టుక ఎప్పటికీ ఓ రహస్యమే. అయితే, తాజాగా ఓ అధ్యయనం దీని గుట్టు విప్పింది. అంతరిక్షంలోని మరుగుజ్జు నక్షత్రాల్లో భూమిపై ఉన్న జీవుల మూలాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అధ్యయన వివరాలను నేచర్ ఆస్ట్రానమీ జర్నల్ ప్రచురించింది.పాలపుంతలోని …
విశ్వంలోని జీవం పుట్టుక ఎప్పటికీ ఓ రహస్యమే. అయితే, తాజాగా ఓ అధ్యయనం దీని గుట్టు విప్పింది. అంతరిక్షంలోని మరుగుజ్జు నక్షత్రాల్లో భూమిపై ఉన్న జీవుల మూలాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అధ్యయన వివరాలను నేచర్ ఆస్ట్రానమీ జర్నల్ ప్రచురించింది.పాలపుంతలోని అన్ని నక్షత్రాలకూ ఓ గడువు తేదీ ఉంటుంది. అవి చనిపోయినపుడు సూపర్నోవా అని పిలిచే పెద్ద పేలుడు సంభవిస్తుంది. సాధారణంగా ఇంధనం అయిపోయినప్పుడు గురుత్వాకర్షణ బరువు కారణంగా నక్షత్రా లు కూలిపోతాయి. ఇది బలమైన పేలుడును ఉత్పత్తి చేస్తుంది. అదనంగా, కొన్ని నక్షత్రాలు బ్లాక్‌హోల్ లోకి వెళ్లిపోతాయి. అలాగే, చాలా నక్షత్రాలు వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తెల్లని మరగుజ్జు నక్షత్రాలుగా మారుతాయి. ఇది ఒకప్పుడు నక్షత్రంగా చలామణి అయిన దాని ప్రధాన భాగాన్ని కలిగి ఉంటుంది. దీన్నే కోర్ అంటారు.కోర్లో ఏముంది..మరుగుజ్జు నక్షత్రాలు చాలా ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి. 99,000 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుంది. బిలియన్ల సంవత్సరా తర్వాత నక్షత్రాలు చల్లబడి మసకబారుతాయి. కోర్ మాత్రమే మిగిలి ఉంటుంది. కోర్ చుట్టూ ఉన్న భాగంలోగల ఇతర అవశేషాలు కార్బన్‌ను కలిగి ఉంటాయి. కార్బన్ అనేది విశ్వంలో దొరికే నాలుగో అతిపెద్ద రసాయ న మూలకం. ప్రతి జీవిలోనూ కార్బన్ ఉంటుంది. అయితే, విశ్వంలోని కార్బన్ అంతా నక్షత్రాల ద్వారా విడుదలవుతుందని సైటింస్టులు ఈ అధ్యయనంలో తేల్చారు. వారు ఇందుకోసం పాలపుంతలోని నక్షత్రాలను పరిశీలించారు. ఒక నక్షత్రం మరుగుజ్జుగా మారేందుకు ముందు, తర్వాత వాటి డేటాను విశ్లేషించారు. కోర్ ద్రవ్యరాశి గతంలో తాము అనుకున్నదానికంటే ఎక్కువగా ఉంటున్నదని గుర్తించా రు.ఈ అధ్యయనం ఆధారంగా, రెండు సోలార్ మాస్ల కంటే ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలు మాత్రమే విశ్వంలో కార్బన్ వ్యాప్తికి దోహదపడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అదే సమయంలో 1.5 సోలార్ మాస్ల కంటే తక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలు కార్బన్‌ను విడుదల చేయలేదని గుర్తించారు. అలాగే, మన సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు, 4.6 బిలియన్ సంవత్సరాలకు పైగా విశ్వంలో కార్బన్ చిక్కుకుపోయిందని ఈ అధ్యయనం ఆధారంగా సైంటిస్టులు నిర్ధారణకు వచ్చారు.
జీఎస్టీ చెల్లించే చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. (GSTR-3B) జీఎస్టీఆర్-3 బీ రిటర్న్ దాఖలుకు సంబంధించి లేట్ ఫీని ప్రభుత్వం తగ్గించింది. దీంతో జులై 2017 నుంచి జులై 20 20కు సంబంధించిన జీఎస్టీఆర్-3 బీ రిటర్న్స్‌ను ఈ ఏడాది …
జీఎస్టీ చెల్లించే చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. (GSTR-3B) జీఎస్టీఆర్-3 బీ రిటర్న్ దాఖలుకు సంబంధించి లేట్ ఫీని ప్రభుత్వం తగ్గించింది. దీంతో జులై 2017 నుంచి జులై 20 20కు సంబంధించిన జీఎస్టీఆర్-3 బీ రిటర్న్స్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 30లోపు దాఖలు చేస్తే లేట్ ఫీ గరిష్టంగా రూ. 500గానే ఉండనుంది.ఇక ఆ పన్ను చెల్లించని పక్షంలో ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవ సరం లేదని కేంద్ర పరోక్ష పన్నుల బోర్డ్ (CBIC) ఓ ప్రకటనలో తెలిపింది. అయితే తగ్గించిన ఆలస్య రు సుం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ దాఖలు చేసిన జీఎస్టీఆర్-3 బీ రిటర్స్న్‌కు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది.
చాలా మంది చిన్న చిన్న విషయాలను తరచుగా మరిచిపోతుంటారు. ఆ జాబితాలో మొట్టమొదట ఉండేది ‘కార్ కీ’. అయితే ఇకపై అలా మరిచిపోయినా.. ఏ ప్రాబ్లెమ్ ఉండదు. ఎందుకంటే, కార్లను ఐఫోన్‌తో అన్‌లాక్ చేయడానికి వీలుగా యాపిల్.. ‘కార్ కీ’ని అందుబాటులోకి తీసుకొచ్చింది. …
చాలా మంది చిన్న చిన్న విషయాలను తరచుగా మరిచిపోతుంటారు. ఆ జాబితాలో మొట్టమొదట ఉండేది ‘కార్ కీ’. అయితే ఇకపై అలా మరిచిపోయినా.. ఏ ప్రాబ్లెమ్ ఉండదు. ఎందుకంటే, కార్లను ఐఫోన్‌తో అన్‌లాక్ చేయడానికి వీలుగా యాపిల్.. ‘కార్ కీ’ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే విడుదల చేసిన ఐవోఎస్ 14లో ఈ ఫీచర్‌ను తెచ్చింది. ఐవోఎస్ 13లోనూ ఈ ఫీచర్ పనిచేస్తుందని యాపిల్ సంస్థ వెల్లడించింది. తొలిగా బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కారుతో ఈ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేయ నున్నారు. అల్ట్రా వైడ్‌బ్యాండ్ చిప్ టెక్నాలజీని ఇందుకోసం వినియోగించారు.యాపిల్ నిర్వహించి న వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఈ ఫీచర్ ను బయటకు చూపించారు. 2021లో బీఎండబ్ల్యూ 5 సిరీస్ కార్లలో ఈ ఫీచర్‌ను యాపిల్ యాడ్ చేయబోతోంది. అతి త్వరలో మిగతా మోడ ల్స్‌కు కూడా దీన్ని ఇంటిగ్రేట్ చేయాలని కంపెనీ భావిస్తోంది. నియర్ ఫీల్డ్ టెక్నాలజీ రీడర్ సాయంతో ఐఫోన్ లేదా యాపిల్ వాచ్ కార్ కీ పెయిర్ చేసుకోవాలి. ఆ తర్వాత యాపిల్ డివైజ్‌ను రీడర్ దగ్గర ఉంచితే చాలు. కారు డోర్ తెరుచుకొంటుంది. కార్ కీ అయితే మర్చిపోతాం. కానీ, మొబైల్ ఫోన్ లేదా వాచ్ ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇతర యాప్స్‌లో ఇలాంటి ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. కానీ యాపిల్ ఐఓఎస్ దీన్ని తమ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది. వాహన యజమానులు ఈ వర్చువల్ కీ యొక్క కాపీని త్వరగా సృష్టించి, వారి ఐదుగురు కుటుంబ సభ్యులతో iMessageto సహాయంతో పంచుకోవచ్చు, తద్వారా వారు కూడా భౌతిక కీ లేకుండా కారును అన్‌లాక్ చేయవచ్చు.
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ తీసుకొస్తున్నది. ప్రస్తుతం మల్టీ డివైజ్ లాగిన్లపై టెస్టింగ్ మొదలుపెట్టామని వాట్సాప్ తెలిపింది. సెర్చింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. చాట్ క్లియర్ వంటి మరెన్నో ఫీచర్లతో అప్డేట్స్ తీసుకురానున్నది. ఇప్పటివరకూ ఒకే అకౌంట్ …
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ తీసుకొస్తున్నది. ప్రస్తుతం మల్టీ డివైజ్ లాగిన్లపై టెస్టింగ్ మొదలుపెట్టామని వాట్సాప్ తెలిపింది. సెర్చింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. చాట్ క్లియర్ వంటి మరెన్నో ఫీచర్లతో అప్డేట్స్ తీసుకురానున్నది. ఇప్పటివరకూ ఒకే అకౌంట్ ఒక డివైజ్‌లో మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంది. అంటే.. డెస్క్‌టాప్ వెబ్ వెర్షన్.. లాగిన్ అయిన డివైజ్ నుంచి యాక్సెస్ చేసుకొంటున్నారంతే. త్వరలో రానున్న ఫీచర్ ద్వారా ఒకే అకౌంట్‌తో మల్టీ డివైజుల్లో లాగిన్ కావొచ్చు.ప్రస్తుతం వాట్సాప్ ఏదైనా ఒక అకౌంట్ ఒక డివైజ్‌లో లాగిన్ అయితే.. అందులో మాత్రమే ఆ అకౌంట్ యాక్సెస్ చేసుకొనే అవకాశం ఉన్నది. మరో డివైజ్‌లో కూడా అదే అకౌంట్‌తో లాగిన్ అవ్వాలం టే మాత్రం ముందుగా లాగిన్ అయిన డివైజ్ నుంచి లాగౌట్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మరో కొత్త డివైజ్ లోకి లాగిన్ అనుమతి ఉంటుంది. త్వరలో రానున్న కొత్త ఫీచర్‌తో అలాంటి ఇబ్బంది ఉండదు. సులభంగా ఒకే అకౌంట్ ఒకే సమయంలో వేర్వేరు డివైజ్‌ల్లోకి లాగిన్ కావొచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఒకేసారి 4 డివైజుల్లో ఒకే వాట్సాప్ అకౌంట్‌తో లాగినయ్యే పరిమితి ఉంటుందని పేర్కొన్నది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్.. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇతర ఫీచర్లను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. వీటిలో లేటెస్ట్ బీటా అప్డేట్స్ కూడా ఉన్నాయి. లేటెస్ట్ బీటా iOS, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మరిన్ని ఫీచర్ల ను టెస్టింగ్ చేస్తున్నట్టుగా సమాచారం.