వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంలో నలుగురు మరణించగా, పలువులు గాయపడ్డారు. శనివారం ఉదయం మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం …
మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె …
అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. …
ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు అంతా బాగానే ఉంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున …
సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘అమృత’ సాంగ్ విడుదల యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో …
ఇటీవలే మొదలైన ‘వకీల్ సాబ్’ షూట్ అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ దసరాకి సినిమా నుంచి అప్ డేట్ సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు …
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి మ్యాన్ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలి ప్రభావిత ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలి తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతోన్న నేపథ్యంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై …
ఎఫ్3లో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే నటిస్తే ఈ సినిమాలో మరింత ఫన్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్‌గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా …
కొవిడ్-19 నేపథ్యంలో వినూత్న కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్న చెర్రీ దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆన్లైన్ డ్యాన్స్ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా …
సుధీర్ బాబు భార్య ప్రియ పుట్టినరోజు వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ …
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారి పిలుపు మేరకు వర్షకాలంలో వచ్చే డెంగీ తదితర సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రతి ఆదివారం ‘పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వారి …
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారి పిలుపు మేరకు వర్షకాలంలో వచ్చే డెంగీ తదితర సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రతి ఆదివారం ‘పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వారి సతీమణి కొప్పుల ప్రతిమారెడ్డితో కలిసి హైదరాబాద్ లోని వారి నివాసంలో ఇంటి పరిసరాలలో పూల మొక్కలను నిల్వ ఉన్న మురికినీరు ను తొలగించి శుభ్రం చేశారు..
దౌలాపూర్ లో ముగ్గురికి సోకిన కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తున్నది. తాజాగాయాలాల మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు యాలాల మండల వైద్యాధికారి ధ్రువీకరించారు.వీరంతా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చి గత 22 రోజుల క్రితం …
దౌలాపూర్ లో ముగ్గురికి సోకిన కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తున్నది. తాజాగాయాలాల మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు యాలాల మండల వైద్యాధికారి ధ్రువీకరించారు.వీరంతా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చి గత 22 రోజుల క్రితం కర్ణాటకలోని గురుమిట్కల్ వద్ద ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉన్నారు.అయితే ఈ రోజు దౌలాపూర్ కు చేరుకున్న తర్వాత ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర వైద్యాధికారులు వికారాబాద్ జిల్లా వైద్యాధికారికి సమాచారం ఇచ్చారు.దీంతో గ్రామానికి చెరుకున్న వైద్యాధికారులు కరోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించారు…
సరళ సాగర ప్రాజెక్టు కరకట్ట నిర్మాణంలో నాణ్యత పాటించడంలేదని,లోపభూయిష్టంగా నిర్మిస్తున్న కరకట్టపై ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణ జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం నాడు బీసీ సంక్షేమ సంఘం సభ్యులతో …
సరళ సాగర ప్రాజెక్టు కరకట్ట నిర్మాణంలో నాణ్యత పాటించడంలేదని,లోపభూయిష్టంగా నిర్మిస్తున్న కరకట్టపై ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణ జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం నాడు బీసీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి కరకట్ట నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2019 డిసెంబర్ నెలలో గండిపడిన సరళ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన కరకట్ట నిర్మాణం పేరుతో ఇసుకను, మట్టిని అక్రమంగా తరలిస్తూన్నారని స్థానిక ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రాజెక్టు తెగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ మొసలి కన్నీరు కార్చుతూ అతి త్వరలో నిర్మాణం చేపడతాం అంటూ బీరాలు పలికిన నేతలు నేడు పూర్తిగా నిర్లక్ష్యంగా , ఎలాంటి నాణ్యత లేకుండా కరకట్ట ను నిర్మిస్తుండడం రైతులను మోసం చేయడమేనన్నారు. అధికార బలంతో నాయకులు ప్రాజెక్టు లోని ఇసుకను,మట్టిని అక్రమంగా తోడుతున్నా కూడా అధికార యంత్రాంగం మాత్రం మామూళ్ల మత్తులో తూగుతూ కళ్ళు మూసుకుని చూసి చూడనట్టు వ్యవహరిస్తోం దని,అధికారులు తమ తీరు మార్చుకుని ప్రజల కోసం పని చేయాలన్నారు.ఇట్టి విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విన్నవిస్తామన్నారు.నాయకుల తీరు చూస్తుంటే ప్రాజెక్టు లోని ఇసుకను,మట్టిని అక్రమంగా అమ్ముకోవడానికే ఉద్దేశ్యపూర్వకంగానే రైతులకు వరప్రదాయినిగా ఉన్న చారిత్రక ప్రాజెక్టును ధ్వంసం చేశారేమోనని అనుమానాలు కలుగుతున్నాయన్నారు.ఇరిగేషన్ ఎఇ తో మాట్లాడుతూ ఎమర్జెన్సీ పేరుతో నిర్మిస్తున్న కరకట్ట నిర్మాణంలో నాణ్యత లేకపోతే రైతులతో కలిసి ప్రాజెక్టు ముందర ఆందోళనలు చేయాల్సి వస్తుందన్నారు.తెరాస ప్రభుత్వం రైతుల కోసం కాకుండా కాంట్రాక్టర్ల కోసం,కమీషన్ల కోసం తమ నాయకుల వ్యాపారాల కోసం ప్రాజెక్టును వాడుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని వీటిని మానుకోవాలని లేకుంటే ప్రజలు తగిన బుద్ధి చెపుతారని హెచ్చరిం చారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భీమన్న నాయుడు,అంజన్న యాదవ్,మహీందర్,రవిందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లాలోని మొరంగపల్లి రైల్వే గేట్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తాండూర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తాండూర్ నుంచి సంగారెడ్డి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే అదుపు తప్పి రైల్వే గేటును ఢీకొని ప్రమాదం జరిగినట్లు …
వికారాబాద్ జిల్లాలోని మొరంగపల్లి రైల్వే గేట్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తాండూర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తాండూర్ నుంచి సంగారెడ్డి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే అదుపు తప్పి రైల్వే గేటును ఢీకొని ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో బస్సు కండక్టర్ తో సహా మరి కొంత మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, క్షతగాత్రులను చికిత్స కోసం మోమిన్ పేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లోని బయటికి పోయిన అమ్మాయి తిరిగిరాలేదు. ఇగ వస్తుందేమోనని అర్థరాత్రి వరకు ఎదురు చూసిన ఆమె తల్లిదండ్రులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. నగర శివార్లలోని నాచారం పరిధిలోని మల్లాపూర్‌లో19 ఏండ్ల యువతి అదృశ్యమయ్యింది. ఐడీఏ నాచారం లోని ఓ …
ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లోని బయటికి పోయిన అమ్మాయి తిరిగిరాలేదు. ఇగ వస్తుందేమోనని అర్థరాత్రి వరకు ఎదురు చూసిన ఆమె తల్లిదండ్రులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. నగర శివార్లలోని నాచారం పరిధిలోని మల్లాపూర్‌లో19 ఏండ్ల యువతి అదృశ్యమయ్యింది. ఐడీఏ నాచారం లోని ఓ ప్రైవేట్ ఎగుమతి కంపెనీలో పనిచేస్తున్న ఆమె శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. రాత్రి పొద్దుపోయినప్పటికీ ఇంటికి తిరిగిరాలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో పెయింటర్‌గా పనిచేస్తున్న ఆమె తండ్రి బీ వేణు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను ఆచూకీకోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
విజయవాడలో విద్యార్థులు రెచ్చిపోయారు. పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వివాదం తలెత్తగా.. కత్తులు, రాళ్లతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఇందులో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో పటమటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. …
విజయవాడలో విద్యార్థులు రెచ్చిపోయారు. పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వివాదం తలెత్తగా.. కత్తులు, రాళ్లతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఇందులో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో పటమటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వివాదంలో మాజీ రౌడీషీటర్ జోక్యం చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో రాజకీయ పలువురు రాజకీయ పార్టీ నేతల అనుచరుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం రావడంతో.. పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై ఆంక్షల ఎత్తివేత జూన్ 7 వరకు కంటైన్మెంట్ జోన్ల వెలుపల ప్రస్తుత పరిస్థితి కొనసాగింపు రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించింది. ముఖ్యంగా, అంతర్రాష్ట్ర …
జూన్ 7 వరకు కంటైన్మెంట్ జోన్ల వెలుపల ప్రస్తుత పరిస్థితి కొనసాగింపు
రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించింది. ముఖ్యంగా, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసింది. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. తెలంగాణలో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.ఆసుపత్రులు, మెడికల్ షాపులు మినహాయించి మిగతా అన్ని దుకాణాలకు రాత్రి 8 గంటల వరకే అనుమతించారు. ఈ మేరకు లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, జూన్ 7 వరకు కంటైన్మెంట్ జోన్ల వెలుపల ప్రస్తుత స్థితి కొనసాగించాలని నిర్ణయించారు. కాగా, తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.
లక్షదీవుల నుంచి చత్తీస్ గఢ్ వరకు ఉపరితల ద్రోణి అరేబియా సముద్రంలో అల్పపీడనం త్వరలో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు ఎండలతో మండిపోతున్న హైదరాబాద్, సంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా తదితర ప్రాంతాల్లో ఈ మధ్యాహ్నం వర్షం కురిసింది. ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం …
ఎండలతో మండిపోతున్న హైదరాబాద్, సంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా తదితర ప్రాంతాల్లో ఈ మధ్యాహ్నం వర్షం కురిసింది. ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడింది. ఇదే విధంగా తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ప్రస్తుతం లక్షదీవుల నుంచి కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ మీదుగా చత్తీస్ గఢ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికల్లా వాయుగుండంగా, ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని వివరించింది. ఇక నైరుతి రుతుపవనాలు కూడా మరికొన్ని రోజుల్లో రాష్ట్రానికి చేరుకుంటాయని తెలిపింది.
మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది.వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శివశక్తి నగర్ లో ఒక వ్యక్తి పాజిటివ్ కేసు నిర్దారణ కాగా అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని అతని కుటింబికుల ను …
మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది.వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శివశక్తి నగర్ లో ఒక వ్యక్తి పాజిటివ్ కేసు నిర్దారణ కాగా అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని అతని కుటింబికుల ను పాజిటివ్ వ్యక్తి కలసిన స్నేహితులను కూడ క్వారంటైన్ కు తరలించారు.వెంటనే ఆ ప్రాంతాన్ని హైడ్రోకోరిక్ ద్రావణం తో శుభ్రం చేసి కంటోన్మెంట్ ఏర్పాటు చేశారు..
డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు సంక్రమించకుండా ముందు జాగ్రత్తగా ఇంట్లో ఉన్న నీటిని పారబోసి కొత్త నీటిని పట్టుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.ఆదివారం ఆయన మహబూబ్ నగర్ …
డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు సంక్రమించకుండా ముందు జాగ్రత్తగా ఇంట్లో ఉన్న నీటిని పారబోసి కొత్త నీటిని పట్టుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామమైన ఏనుగొండ లో ఆదివారం 10 గంటలకు పది నిమిషాల కార్యక్రమంలో పాల్గొని వార్డు మొత్తం కలియతిరిగి ఇళ్లలో ఉన్న నిలువ నీటిని బయట పారబోయించారు.ఈ సందర్భంగా మంత్రి ఇంటి యజమానులతో మాట్లాడుతూ నీటిని నిల్వ ఉంచుకోవడం వల్ల దోమలు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉందని, దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ , చికెన్ గున్యా వంటి వైరల్ ఫీవర్ లు వచ్చే అవకాశం ఉందని, అంతేకాకుండా దోమల ద్వారా వ్యాప్తి చెందే అన్ని రకాల జబ్బులకు ఆస్కారం ఉందని అన్నారు. రాష్ట్ర మున్సిపల్ ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె. తారక రామారావు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు 10 నిమిషాల పాటు వారి వారి ఇళ్లలోని నీటితోట్లు, టబ్బులు, పూల కుండీలు ,పాతబడిన టైర్లు, కొబ్బరిబొండాలు తదితర వాటిల్లో ఉన్న నీటిని పారబోసి మళ్లీ అవసరాల నిమిత్తం కొత్త నీటిని పట్టుకోవాలని సూచించారు .ఈ సందర్భంగా మంత్రి వార్డులోని తాగునీటి ట్యాంకు వద్ద నీరు నిల్వ ఉండటాన్నీ గమనించి శుభ్రం చేయించారు. అంతేకాక బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. వీటితోపాటు కొన్ని గృహాలలో నీటి తొట్లలో ఉన్న నీటిని బయట పారబోయించారు. అంతేకాక ఇండ్లలో ఉన్న పాత టైర్లు, పాత వస్తువులను తీసివేయాలని, ఇంటిముందు చెత్తా,చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని లేనట్లయితే పాములు వచ్చే అవకాశం ఉందని అన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు డిసిసిబి బ్యాంకు ఉపాధ్యక్షులు వెంకటయ్య,అదనపు కలెక్టర్ సీతారామారావు ,మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, వార్డు కౌన్సిలర్ వనజ, విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ సురేందర్ , ఇతర అధికారులు ప్రజా ప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు…