వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంలో నలుగురు మరణించగా, పలువులు గాయపడ్డారు. శనివారం ఉదయం మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం …
మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె …
అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. …
ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు అంతా బాగానే ఉంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున …
సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘అమృత’ సాంగ్ విడుదల యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో …
ఇటీవలే మొదలైన ‘వకీల్ సాబ్’ షూట్ అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ దసరాకి సినిమా నుంచి అప్ డేట్ సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు …
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి మ్యాన్ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలి ప్రభావిత ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలి తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతోన్న నేపథ్యంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై …
ఎఫ్3లో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే నటిస్తే ఈ సినిమాలో మరింత ఫన్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్‌గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా …
కొవిడ్-19 నేపథ్యంలో వినూత్న కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్న చెర్రీ దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆన్లైన్ డ్యాన్స్ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా …
సుధీర్ బాబు భార్య ప్రియ పుట్టినరోజు వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ …
కరోనా వ్యాక్సిన్ అంశంపై ప్రధాని సమీక్ష పలు సూచనలు చేసిన ప్రధాని ధర కారణంగా ఎవరూ వ్యాక్సిన్ కు దూరం కారాదన్న మోదీ యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా భూతాన్ని పారదోలే వ్యాక్సిన్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పరిశోధక సంస్థలు, శాస్త్రవేత్తలు …
యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా భూతాన్ని పారదోలే వ్యాక్సిన్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పరిశోధక సంస్థలు, శాస్త్రవేత్తలు యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ తయారీ కోసం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారత్ లో కరోనా వ్యాక్సిన్ తయారీ, అభివృద్ధి, పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతస్థాయి అధికారులు హాజరయ్యారు. అయితే, కరోనాకు వ్యాక్సిన్ వస్తే మొదట ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలన్న దానిపై మోదీ కీలక సూచనలు చేశారు. కరోనా వైరస్ పై ముందు నిలిచి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, కరోనా బారిన పడేందుకు అత్యధిక అవకాశాలు ఉన్న వారికి మొద టగా వ్యాక్సిన్ అందించాలని స్పష్టం చేశారు. ఆ తర్వాతే దేశ వ్యాప్త పంపిణీపై దృష్టి సారించాలని అన్నా రు.రెండో దశలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలని, వ్యాక్సిన్ పంపిణీకి ఎలాంటి ఆంక్షలు ఉండ రాదని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి వ్యాక్సిన్ వెళ్లాల్సిందేనని తెలిపారు. ముఖ్యమైన అంశం ఏమిటంటే, కరోనా వ్యాక్సిన్ ధర అందరికీ అందుబాటులో ఉండాలని, ధర కారణంగా ఎవరూ వ్యాక్సిన్ కు దూరమయ్యే పరిస్థితి రాకూడదని అన్నారు. వ్యాక్సిన్ అన్ని దశలు పూర్తి చేసుకుని బయటికి వచ్చా క… ఉత్పత్తి నుంచి పంపిణీ వరకు టెక్నాలజీ సాయంతో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. నిర్ణీత సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు చేయాలని పేర్కొన్నారు.
నేర సంబంధ టీవీ కార్యక్రమాల నుండి ప్రేరణ పొందిన ఓ వ్యక్తి.. హర్యానా టిక్‌టాక్ స్టార్‌ను దారుణంగా హత్య చేశాడు. ఆమె చనిపోయిన రెండురోజుల తర్వాత కూడా ఆమె ఫోన్ నుంచి మెసేజ్‌లు, వీడియోలు పోస్ట్ కావడంతో.. ఆమె ఇంకా బతికేఉన్నదని అభిమానులు …
నేర సంబంధ టీవీ కార్యక్రమాల నుండి ప్రేరణ పొందిన ఓ వ్యక్తి.. హర్యానా టిక్‌టాక్ స్టార్‌ను దారుణంగా హత్య చేశాడు. ఆమె చనిపోయిన రెండురోజుల తర్వాత కూడా ఆమె ఫోన్ నుంచి మెసేజ్‌లు, వీడియోలు పోస్ట్ కావడంతో.. ఆమె ఇంకా బతికేఉన్నదని అభిమానులు భావించారు. చివరకు ఆమెకు చెందిన బ్యూటీపార్లర్‌లోనే ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.హర్యానా సోనిపట్ నగరంలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న శివానీ ఖుబియాన్.. టిక్‌టాక్‌లో చేరిన కొద్దికాలానికే స్టార్ స్థాయికి ఎదిగింది. ఈమెకు టిక్‌టాక్‌లో లక్ష మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ నెల 26 నుంచి ఆమె కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆదివారం సాయంత్రం ఆమె కు చెందిన బ్యూటీ పార్లర్ నుంచి దుర్గంధం వస్తుండటాన్ని గుర్తించిన శివానీ సన్నిహితులు విషయం ఆమె ద్వారా పోలీసులకు చేరవేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.“ఇంటి పొరుగునే ఉండే ఆరిఫ్ అనే వ్యక్తి జూన్ 26 న శివానిని కలవడానికి వచ్చాడు. ఆరోజు రాత్రి శివానీ ఇంటికి తిరిగి రాలేదు. తల్లి ఆరోగ్యం బాగోలేనందున వెంటనే రావాల్సిందిగా నేను ఆమె ఫోన్‌కు మెసేజ్ పెట్టాను. అయితే, తాను బాగానే ఉన్నానని, హరిద్వార్‌కు వెళ్లినందున మంగళవారం నాటికి ఇంటికి తిరిగి వస్తానని ఆమె ఫోన్ నుంచి నాకు సందేశం వచ్చింది. ”అని శివానీ సోదరి శ్వేత పోలీసులకు చెప్పారు.శివానీ అభివృద్ధిని చూసిన పొరుగున ఉండే ఆరిఫ్ గిట్టేవాడుకాదు. ఆమెను గత మూడేండ్లుగా కొడుతున్నాడు. ఆయన బాధ భరించలేక ఇంటిని వేరే ప్రాంతానికి మార్చాం అయినా అడ్రస్ తెలుసుకొని ఆమెను అనుసరిస్తున్నాడు. ఇంతలో ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు అని శివానీ తండ్రి వినోద్ ఖుబియాన్ పోలీసులకు వెల్లడించాడు. పరారీలో ఉన్న ఆరిఫ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని గుర్తించడానికి 7 గంటల ముందు ఆమె ఫోన్ ఖాతా నుంచి టిక్‌టాక్‌లో వీడియో పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఇవాళ మరో 945 కరోనా పాజి టివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 869 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,339 కరోనా కేసులు నమో దయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 260 మంది మృతి చెందారు.రంగారెడ్డి జిల్లాలో అత్య ధికంగా 29, సంగారెడ్డి జిల్లాలో 21 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 13 కరోనా కేసు లు, నిర్మల్ జిల్లాలో 4 కేసులు, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో కొత్తగా 2 కరోనా కేసులు, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కనిపించకుండా పోయారు. గండిమైసమ్మకు చెందిన అక్కాచెలెళ్లు యాస్మిన్(17), హార్షియా(16) గడిచిన రాత్రి నుంచి అదృశ్యమయ్యారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు …
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కనిపించకుండా పోయారు. గండిమైసమ్మకు చెందిన అక్కాచెలెళ్లు యాస్మిన్(17), హార్షియా(16) గడిచిన రాత్రి నుంచి అదృశ్యమయ్యారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పలు హత్యలు, లైంగికదాడులకు పాల్పడిన అమెరికాకు చెందిన ఓ మాజీ పోలీసును స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. గోల్డెన్ స్టేట్ కిల్లర్‌గా పేరుగాంచిన జోసెఫ్ జేమ్స్ డాంగెలో జూనియర్.. డజన్ల కొద్దీ లైంగికదాడులు, దోపిడీలు, కిడ్నాప్‌లకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఈ హృదయ విదారక …
పలు హత్యలు, లైంగికదాడులకు పాల్పడిన అమెరికాకు చెందిన ఓ మాజీ పోలీసును స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. గోల్డెన్ స్టేట్ కిల్లర్‌గా పేరుగాంచిన జోసెఫ్ జేమ్స్ డాంగెలో జూనియర్.. డజన్ల కొద్దీ లైంగికదాడులు, దోపిడీలు, కిడ్నాప్‌లకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఈ హృదయ విదారక నేరాలు కాలిఫోర్నియాలో 20 ఏండ్లుగా స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. జోసెఫ్ అరాచకాలు 1970-1980 లలో రాష్ట్రంలో కొనసాగడంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని జీవించారు.సాక్రమెం టోలోని కోర్టు విచారణలో అతని నేరాలకు సంబంధించిన భయంకరమైన వివరాలను ప్రాసిక్యూటర్ చదివి వినిపించారు. జోసెఫ్ నేరానికి పాల్పడిన ప్రతిసారీ తప్పించుకొన్నాడని, నిశ్శబ్దంగా రాత్రుల్లో పారిపోతాడని, ఆయన చేసిన నేరాలకు సమాజం చాలా భయపడిందని ప్రాసిక్యూటర్ థియన్ హో చెప్పారు. ఆరెంజ్ జంప్ సూట్ ధరించి కోర్టుకు హాజరైన 74 ఏళ్ల జోసెఫ్ న్యాయమూర్తికి ప్రతిస్పందనగా.. “అవును”, “లేదు,” “నేను అంగీకరిస్తున్నాను” అని ముక్తసరిగా చెప్పాడు.మరణశిక్షను తొలగించడాని కి రాష్ట్రం సిద్ధంగా ఉందని, మాజీ పోలీసుకు పెరోల్ లేకుండా వరుసగా 11 జీవిత ఖైదులు విధించినట్లు మరో ప్రాసిక్యూటర్ అమీ హాలిడే తెలిపారు. జోసెఫ్ చేసిన నేరాలలో 13 హత్యలు, దాదాపు 50 లైంగికదాడులు, డజన్ల కొద్దీ దోపిడీ సంఘటనలు ఉన్నాయని చెప్పారు.”గోల్డెన్ స్టేట్ కిల్లర్” చివరిసారిగా చేసిన నేరం తర్వాత 30 ఏండ్లకు 2018 లో అరెస్టయ్యాడు. 1978 లో కొత్తగా వివాహం చేసుకొన్న బ్రియాన్, కేటీ మాగిగోర్ హత్యతో జోసెఫ్‌పై తొలుత అభియోగాలు నమోదయ్యాయి.
అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మండల కేంద్రంలో విద్యుదాఘాతంతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది. ఉరవకొండ గ్రామం బాలాజీ సినిమా థియేటర్ వద్ద ఉండే మల్లేశ్, రమేశ్ అనే ఇద్దరు అన్నదమ్ములు బహిర్భూమికి వెళ్లారు. నీటి ట్యాంకు …
అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మండల కేంద్రంలో విద్యుదాఘాతంతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది. ఉరవకొండ గ్రామం బాలాజీ సినిమా థియేటర్ వద్ద ఉండే మల్లేశ్, రమేశ్ అనే ఇద్దరు అన్నదమ్ములు బహిర్భూమికి వెళ్లారు. నీటి ట్యాంకు వద్ద విద్యుత్ ప్రవాహంతో ఉన్నఇనుప కంచెను గమనించక తాకడంతో అన్నదమ్ములు విద్యుదాఘాతా నికి గురయ్యారు.దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యతోనే ప్రమా దం జరిగిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింప చేశారు. ప్రమాద విషయా న్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీర్ మురళీకృష్ణ తెలిపారు.
ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న రఘునాధ్ రూ. 25 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండె డ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఆరోగ్య శ్రీ లో ఓ డెంటల్ హాస్పిటల్ రెన్యూవల్ కోసం రూ. 30 …
ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న రఘునాధ్ రూ. 25 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండె డ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఆరోగ్య శ్రీ లో ఓ డెంటల్ హాస్పిటల్ రెన్యూవల్ కోసం రూ. 30 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాగా, ఒప్పందంలో భాగంగా ముందస్తుగా రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకు న్నారు. రఘునాధ్ కార్యాలయంతో పాటు ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా కో ఆర్డినేటర్ గా కూడా రఘునాధ్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో నేడు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పదవీ విరమణ పొందుతున్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ మల్లారెడ్డి, ఎస్ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు, వరంగల్ సీపీ రవీందర్, మాదాపూర్ డీసీపీ వెం కటేశ్వర్‌రావు, నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజ్ నేడు పదవీ విరమణ పొందారు. పదవీ …
రాష్ట్రంలో నేడు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పదవీ విరమణ పొందుతున్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ మల్లారెడ్డి, ఎస్ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు, వరంగల్ సీపీ రవీందర్, మాదాపూర్ డీసీపీ వెం కటేశ్వర్‌రావు, నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజ్ నేడు పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో ఇతరులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్వర్వులు జారీ చేశారు. ఐజీ సంజయ్‌కుమార్‌కు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్‌కు బాధ్యత లు అప్పగించారు. అదేవిధంగా వరంగల్ సీపీ బాధ్యతలు సీఐడీ ఐజీ ప్రమోద్‌కుమార్‌కు, మాదాపూర్ డీసీపీ బాధ్యతలు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు, నిర్మల్ ఎస్పీ బాధ్యతలు ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారి యర్కు అప్పగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు.
గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడికి దిగి 20 మందిని హతమార్చిన నేపథ్యంలో.. చైనాను ఏకాకిగా చేసేందుకు భారత్ కంకణం కట్టుకొన్నది. చైనాను సైనికపరంగా కాకుండా ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారత్ పావులు కదుపుతున్నది. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చైనా యాప్‌లపై నిషేధం విధించిన …
గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడికి దిగి 20 మందిని హతమార్చిన నేపథ్యంలో.. చైనాను ఏకాకిగా చేసేందుకు భారత్ కంకణం కట్టుకొన్నది. చైనాను సైనికపరంగా కాకుండా ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారత్ పావులు కదుపుతున్నది. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చైనా యాప్‌లపై నిషేధం విధించిన భారత్.. త్వరలో చైనా దిగుమతులపై కూడా నిషేధం విధించే యత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తున్నది.
ప్రత్యామ్నాయాలపై దృష్టి
చైనా వస్తువుల దిగుమతులపై నిషేధ నిర్ణయం తీసుకునే ముందు పారిశ్రామిక సంస్థలు, ఇతర ఉత్పా దక సంఘాలు, ఎగుమతిదారుల అభిప్రాయాలను కోరింది. చైనా నుంచి దిగుమతులపై నిషేధం విధిం చిన సందర్భంలో ఎదురయ్యే ఇబ్బందులేమిటో వారిని అడిగినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా ప్రత్యా మ్నాయాల గురించి అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు సమాచారం. టెలికాం, చైనీస్ యాప్‌లపై నిషేధపు ఆంక్షల విధింపు తరువాత.. ఇప్పుడు దిగుమతులను కఠినతరం చేయడానికి సన్నాహాలు జరుగుతు న్నట్లు స్పష్టమైంది.చైనా నుంచి దిగుమతి చేసుకొంటున్న వస్తువుల జాబితా ఇవ్వాల్సిందిగా వివిధ పారిశ్రామిక సంస్థలు, ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్‌ను ప్రభుత్వం ఇప్పటికే కోరింది. తద్వారా ఏయే వస్తువులను మన దేశంలో సులభంగా తయారు చేసుకోవచ్చో గుర్తించి.. ఆ వస్తువులను నిషేధించడం ద్వారా భారతీయ తయారీదారులకు ఎటువంటి హాని ఉండదని భావిస్తున్నది. చైనాకు బదులుగా ఇతర దేశాల నుంచి ముఖ్యమైన వస్తువులు, ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడంపై ఆలోచిస్తున్నారు. చైనా వస్తువుల ఎంపికకు సంబంధించి పారిశ్రామిక ప్రపంచం నుంచి భారత ప్రభుత్వం అభిప్రాయాలు తెలుసుకొంటున్నది. ఆయా వస్తువులను ఇక్కడే తయారుచేసి భర్తీ చేయాలన్న నిర్ణయంతో ముందగుడు వేస్తున్నారు.
వ్యాపారవేత్తలు ఏమంటున్నారు
ఔషధాలు, ఆటో విడిభాగాలు, మొబైల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, రసాయనాలు వంటివి అనేకం చైనా నుంచి మనం దిగుమతి చేసుకొంటున్నాం. గత కొన్ని రోజులుగా చైనా నుండి ముడి పదార్థాల సరఫరా నిలిచిపోవడం వల్ల వస్తువుల ఉత్పత్తి సాధ్యం కాలేదు. 90 శాతం ఔషధ తయారీ ముడి పదార్థాల కోసం, 70 శాతం మొబైల్ ఫోన్ల కోసం చైనాపై భారత్ ఆధారపడుతున్నది. ఆటో విడిభాగాలను తయారు చేయడానికి చైనా నుండి అనేక ముడి పదార్థాలు వస్తున్నాయి. అవి లేకుండా విడిభాగాలు తయారు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. చైనా ముడి పదార్థాలపై పూర్తిగా ఆధారపడే అనేక సౌందర్య ఉత్పత్తులు ఉన్నాయి. చైనా నుంచి తక్కువ ధరకు ముడి పదార్థాలు లభిస్తున్నందున వేరే దేశాల దిగుమతులపై దృష్టిసారించడం లేదని పలువురు వ్యాపారవేత్తలు అంటున్నారు.మనం ఖరీదైన వస్తువులను కొనవలసి వచ్చినప్పటికీ.. ప్రభుత్వం ధైర్యమైన నిర్ణయాలు తీసుకొంటుందని పీహెచ్డీ ఛాంబర్ టెలికాం కమిటీ చైర్మన్ సందీప్ అగర్వాల్ అభిప్రాయపడుతున్నారు. అన్ని రంగాల్లో వస్తువులకు భారతీయ కంపెనీలకు ట్రయల్ ఆర్డర్లు ప్రవేశపెట్టాలని ఆయన సూచిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలతో టెలికాం రంగంలో చైనాతో పోటీ పడటానికి భారతీయ కంపెనీలకు వీలు చిక్కుతుందని ఆయన చెప్తున్నారు.
రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. మే నెలలో ఎంట్రన్స్ టెస్టులు జరగాల్సి ఉండగా కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్‌తో వాటిని జులైలో నిర్వహిస్తామని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రకటించిన …
రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. మే నెలలో ఎంట్రన్స్ టెస్టులు జరగాల్సి ఉండగా కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్‌తో వాటిని జులైలో నిర్వహిస్తామని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం జులై 1న పాలిసెట్‌తో పాటు పీజీ ఈసెట్ పరీక్ష ప్రారంభం కావాల్సి ఉంది. జులై 4న ఈసెట్, జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్, 10 న లాసెట్, 13న ఐసెట్, 15న ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షల నిర్వహణ జరగనుంది.కాగా కరోనా కేసులు పెరుగుతున్నందున ఎంట్రెన్స్ టెస్టులను రద్దు చేయాలని కోరుతూ స్టూడెంట్ యూనియ న్ నేతలు హైకోర్టులో పిల్ వేశారు. పిల్‌పై విచారణ సందర్భంగా రాష్ట్రంలో జరగనున్న వివిధ ప్రవేశ పరీ క్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో రేపటి నుంచి జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి.