
ఎట్టి పరిస్థితుల్లో 2021 నాటికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సాగు నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి…ఉమ్మడి పాలమూరు జిల్లాల ప్రజాప్రతినిధులు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఎట్టి పరిస్థితుల్లో 2021 నాటికి సాగు నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లాల ప్రజాప్రతినిధుల సమావేశం నిర్ణయించింది. శుక్రవా రం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,రాష్ట్ర ఎక్సైజ్ శాఖ …

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఎట్టి పరిస్థితుల్లో 2021 నాటికి సాగు నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లాల ప్రజాప్రతినిధుల సమావేశం నిర్ణయించింది. శుక్రవా రం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ల నేతృత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాల పార్లమెంట్ సభ్యులు,శాసన సభ్యులు,శాసనమండలి సభ్యులు,నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ,ప్రాజక్టు ఇంజనీర్లు పాలమూరు -రంగారె డ్డి పనులను తనిఖీ చేశారు.శ్రీశైలం తిరుగు జలాలనుండీ పీఆర్ ఎల్ ఐ కి నీరు తీసుకొనే పాయింట్ మొ దలుకొని,నార్లాపూర్,ఎదుల,రిజర్వాయర్,టన్నెల్,పంపు హౌసులు,అన్నింటినీ తనిఖీ చేశారు. అనంతరం ఎదుల రిజర్వాయర్ వద్ద ప్రాజక్టు ఇంజనీరింగ్ అధికారులతో ప్యాకేజీ వారిగా మంత్రులు సమీక్షించారు.ఈ సందర్బంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నార్లాపూర్ లో సాధ్యమైనంత ఎక్కువ నీరు నిలువ ఉంచే సామర్థ్యానికి చర్యలు తీసుకోవాలి. ఎదుల,నార్లాపూర్ ఆర్ అండ్ ఆర్ పెండింగ్ చెల్లింపులు వెంటనే చేయాలి.భవిష్యత్తులో పీఆర్ ఎల్ ఐ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని నియోజక వర్గాలకు తాగు నీరు అందించేలా చూడాలి.కె ఎల్ ఐ డి 5 ద్వారా తక్షణమే ఎదుల రిజర్వాయర్ ను నింపాలి.పి ఆర్ ఎల్ ఐ ప్రాజెక్ట్ కు ప్రత్యేకించి రెగ్యులర్ వర్క్ షాప్ లు ఏర్పాటు చేయాలి.ఎత్తిపోతల పథకాలకు సంబంధించి పవర్ బిల్లులు ప్రాజక్టు ఇంజనీర్ ల ఆధ్వర్యంలో ఉంచాలి.ఉపాధి హామీ కింద పి ఆర్ ఎల్ ఐ డిస్ట్రిబ్యూటరీలు,మైనర్లు చేపట్టే వకాశంప రిశీలించాలి.మిగిలిపోయిన పనుల పూర్తికి ఒక ప్రత్యేక సమయం నిర్ణయించాలి.పనులు చేయని ఏజెన్సీల ను తొలగించి బిట్స్ చేసి ఇతరులకు అప్పగించాలి.ఆర్ అండ్ ఆర్,భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి.రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పీఆర్ ఎల్ ఐ ద్వారా సాధ్యమైనంత త్వరగా సాగు నీరు ఇవ్వాలి.పనులు వేగవంతం చేయాలి.ప్రతినెలా పనుల పురోగతి ని వాట్సాఅప్ ద్వారా ఉమ్మడి పాలమూరు ప్రజా ప్రతినిధులందరికి తెలియజేయాలి.ఏక కాలంలో కాలువ పనులు,టన్నెల్ పనులు చేపట్టాలి.పి ఆర్ ఎల్ ఐ ద్వారా 80 నుండి 90 శాతం నీరు మహబూబ్ నగర్ పార్లమెంట్‌కు రావాల్సి ఉంది.ఇప్పటివరకు మహబూబ్ నగర్ కు సాగు నీటి సౌకర్యం లేదు.త్వరగా నీరివ్వాలనే మా తపన అర్థం చేసుకోండి.కర్వేన రిజర్వాయర్ లో ఎలాంటి ఇబ్బంది లేదు.ఉదండాపూర్ రిజర్వాయర్ లో సమస్యలేదురైతే శాసన సభ్యులు సహకారంతో పరిష్కరిస్తాము. ప్రజాప్రతినాధులం దరితో మరో సారి వ ట్టేం ,కరవేన, ఉదండాపూర్ సందర్శించి మహబూబ్ నగర్ లో సమావేశం నిర్వహించాలి.దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ వట్టేం,కర్వేన పై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలి.శంకర సముద్రం,భీమా ,కోయిల్ సాగర్ ప్రాజక్టుల సమస్యల పై మాట్లాడారు. కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్ కె ఎల్ ఐ కింద డి 28,గురించి మాట్లాడారు.పి ఆర్ ఎల్ ఐ కింద నియోజకవర్గాల వారిగా ఆయకట్టు వివరాలు ఇవ్వా లన్నారు.గుడిపల్లి గట్టు కింద చివరి ఆయ కట్టుకు నీరివ్వాలన్నారు.ప్రభుత్వ విప్ లు గువ్వల బాలరాజు,కూచుకుల్ల దామోదర్ రెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఎం పి లు మన్నే శ్రీనివాస్ రెడ్డి,రాములు, నాగర్ కర్నూల్ జెడ్ పి చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి,ఎం ఎల్ సి కసిరెడ్డి నారాయన రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత కుమార్,ప్రాజక్టుల సి ఈ రమేష్, ప్రాజక్టుల సలహాదారు పెంట రెడ్డి,శాసన సభ్యులు డాక్టర్ లక్ష్మ రెడ్డి,జైపాల్ యాదవ్,మర్రి జనార్ధన్ రెడ్డి, కొల్లాపూర్ శాసన సభ్యులు భీరం హర్షవర్ధన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి,నాగర్ కర్నూల్,వనపర్తి జిల్లాల కలెక్టర్లు శర్మన్,షేక్ యాస్మిన్ బాష,ఏజెన్సీ లు హాజరయ్యారు.పి ఆర్ ఎల్ ఐ ఎస్ ఈ,ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు .