వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంలో నలుగురు మరణించగా, పలువులు గాయపడ్డారు. శనివారం ఉదయం మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం …
మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె …
అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. …
ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు అంతా బాగానే ఉంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున …
సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘అమృత’ సాంగ్ విడుదల యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో …
ఇటీవలే మొదలైన ‘వకీల్ సాబ్’ షూట్ అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ దసరాకి సినిమా నుంచి అప్ డేట్ సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు …
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి మ్యాన్ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలి ప్రభావిత ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలి తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతోన్న నేపథ్యంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై …
ఎఫ్3లో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే నటిస్తే ఈ సినిమాలో మరింత ఫన్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్‌గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా …
కొవిడ్-19 నేపథ్యంలో వినూత్న కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్న చెర్రీ దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆన్లైన్ డ్యాన్స్ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా …
సుధీర్ బాబు భార్య ప్రియ పుట్టినరోజు వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ …
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు అక్కాచెల్లెళ్లు కళవతి 60 , బాలకిష్టమ్మ55 రోడ్డు దాటుతుండగా హైదరా బాద్ వైపు నుండి అతి వేగంగా వస్తున్న కారు ఢీ కొని …
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు అక్కాచెల్లెళ్లు కళవతి 60 , బాలకిష్టమ్మ55 రోడ్డు దాటుతుండగా హైదరా బాద్ వైపు నుండి అతి వేగంగా వస్తున్న కారు ఢీ కొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
నాణ్యత లేని ఆయుధాల వినియోగం వల్ల 27 మంది సైనికుల ప్రాణాలతో పాటు రూ.960 కోట్ల నష్టం వాటిల్లిందని రక్షణశాఖ అంతర్గత నివేదికలో వెల్లడైంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఉత్పత్తి చేసిన ఆయు ధాల్లో నాణ్యత సరిగా లేకపోవడం వల్ల 2014 నుండి …
నాణ్యత లేని ఆయుధాల వినియోగం వల్ల 27 మంది సైనికుల ప్రాణాలతో పాటు రూ.960 కోట్ల నష్టం వాటిల్లిందని రక్షణశాఖ అంతర్గత నివేదికలో వెల్లడైంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఉత్పత్తి చేసిన ఆయు ధాల్లో నాణ్యత సరిగా లేకపోవడం వల్ల 2014 నుండి 2019 మధ్య సైన్యం 27 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, 146 మంది గాయపడ్డారు. జవాబుదారీతనం లేకపోవడం, లోపభూయిష్టమైన ఆయుధాల కొనుగోలు వల్ల రూ.960 కోట్ల నష్టం వాటిల్లిందని సైన్యం.. రక్షణశాఖకు సమర్పించిన అంతర్గత నివేది కలో వివరించింది.2014 నుండి 2019 వరకు వారానికి సగటున ఒక ప్రమాదం చొప్పున జరిగిందని నివేదిక గణాంకాలు చెబుతున్నాయి. 2014 నుండి 2019 మధ్య కాలంలో మొత్తం 403 సంఘటనలు జరిగాయి. దీనివల్ల సైన్యం 27 మరణాలు కోల్పోగా, 146 మంది క్షతగాత్రులుగా మిగిలారు. ఎవొబీలోని ఉత్పత్తులను షెల్ఫ్ జీవితాన్ని పూర్తి చేయకుండా పారవేశారని ఓ సైనికాధికారి తెలిపారు. షెల్ఫ్ లైఫ్‌లో సుమారు రూ. 658.58 కోట్ల విలువైన మందుగుండు సామగ్రిని ఏప్రిల్ 2014 మరియు 2019 ఏప్రిల్ మధ్య పారవేసినట్లు అధికారి తెలిపారు..మే 2016 లో పుల్గావ్లోని సెంట్రల్ అమ్యునిషన్ డిపోలో ప్రమాదవశాత్తు గని పేలిన తరువాత రూ. 303.23 కోట్ల విలువైన గనులను పారవేసారు. ఈ సొమ్ముతో 100 శతఘ్నులను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ప్రభుత్వ అధీనంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ పనికి మాలిన ఆయుధాలను సరఫరా చేసినట్లు నివేదికలో తేలింది. లోపాలతో నిండిన ఆయుధాల్లో 125ఎంఎం ఎయిర్ డిఫెన్స్ షెల్స్, ఫిరంగి గుళ్లు, 125ఎంఎం ట్యాంక్ రౌండ్స్, వివిధ రకాల రైఫిళ్లలో వాడే బుల్లెట్లు ఉన్నాయి.ఎఫ్ఓబీ ప్రతిపాదిత కార్పొరేటైజేషన్ కోసం డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ తో సమానంగా స్వయంప్రతిపత్తిని ఇస్తుంది. ఉన్నత స్థాయి ప్రభుత్వ ప్యానెల్ 2024-25 నాటికి ఎఫ్ఓబీ టర్నోవర్‌ను రూ. 30,000 కోట్లకు పెంచడానికి రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తోందని సైనికాధికారి పేర్కొన్నారు. రక్షణ శాఖ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రతిపాదిత చర్యపై సైన్యం అనేక సిఫార్సులు చేసిందని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను బుధవారం ప్రకటించింది. వీటి ప్రకారం రేపటి నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఎగ్జిబిషన్ హాల్లు, ఎంటర్టైన్మెంట్ పార్కులు, స్విమ్మింగ్‌పూల్‌లను తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. కొత్త నిబంధనల ప్రకారం విద్యా సంస్థలను అక్టోబర్ 15 నుండి తిరిగి …
కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను బుధవారం ప్రకటించింది. వీటి ప్రకారం రేపటి నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఎగ్జిబిషన్ హాల్లు, ఎంటర్టైన్మెంట్ పార్కులు, స్విమ్మింగ్‌పూల్‌లను తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. కొత్త నిబంధనల ప్రకారం విద్యా సంస్థలను అక్టోబర్ 15 నుండి తిరిగి తెరుస్తారు.అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను అనుసరించి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం మాత్రమే ప్రేక్షకులను అనుమతించాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (ఎస్ఓపీ) సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేయనున్నది. ఈ మార్గదర్శకాలను అనుసరించి వచ్చే నెల 15 వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరిచేందు కు అనుమతించనున్నారు. విద్యార్థులను పాఠశాలలకు రమ్మని అడగడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సామాజిక / విద్యా / క్రీడలు / వినోదం / సాంస్కృతిక / మత / రాజకీయ విధులు, ఇతర సమ్మేళనాలకు ఇప్పటికే 100 మంది వ్యక్తులకు అనుమతిస్తున్నారు. ఇలాఉండగా, కంటైనేషన్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు అక్టోబర్ 31 వరకు అమలు చేయబడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన ఆంక్షలను ఎత్తివేసి తదుపరి దశను ప్రకటించినట్లు కేంద్రం తెలిపింది. అయితే, విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించే విషయాన్ని ఆయా రాష్ట్రప్ర భుత్వాల నిర్ణయానికే వదిలివేస్తున్నట్లు పేర్కొన్నది. ఆన్లైన్ తరగతులను కూడా సమాంతరంగా అను మతిస్తామని కేంద్రం తెలిపింది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, ఎగ్జిబిషన్ హాల్లు, ఎంటర్టైన్మెంట్ పార్కుల ను తిరిగి తెరవడానికి అనుమతిస్తామని, అయితే సంఖ్యలపై పరిమితి ఉందని ప్రభుత్వం తెలిపింది.
నిరుద్యోగులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్న ముఠాను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉపాధి వేటలో ఉన్న యువతే లక్ష్యంగా ఉద్యోగాల ఆశ చూపి, ఓ ముఠా రూ.లక్షల్లో వసూలు చేసింది. అనంతరం బాధితులకు కుచ్చుటోపి పెడుతున్న ఓ మహిళతోసహా మరో ముగ్గురు …
నిరుద్యోగులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్న ముఠాను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉపాధి వేటలో ఉన్న యువతే లక్ష్యంగా ఉద్యోగాల ఆశ చూపి, ఓ ముఠా రూ.లక్షల్లో వసూలు చేసింది. అనంతరం బాధితులకు కుచ్చుటోపి పెడుతున్న ఓ మహిళతోసహా మరో ముగ్గురు వ్యక్తులను కరీంనగ ర్ పోలీసులు అరెస్టు చేశారు.మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ కుటుంబసభ్యులతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. కరీంనగర్‌లోని ఆదర్శ నగర్లో నివాసముంటున్న మహిళ.. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించాలని స్కెచ్ వేసింది. అమాయక యువకులను లక్ష్యం గా చేసుకొని, ప్రేమ, ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెబుతూ వారి నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. అంతేకాదు, ఇందు కోసం ముగ్గురు సభ్యులతో ముఠాగా ఏర్పడి దందా సాగిస్తోంది. ఇందుకు కోసం కరీంనగర్ జిల్లాకు చెందిన కంబాల రాజేశ్(41), కుసుమ భాస్కర్(48), భీమాశం కర్(28)లను ఎంచుకుంది. వీరంతా కరీంనగ్ కేంద్రంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.కరీంనగర్‌లోని సిక్‌వాడీకి చెందిన ఓ యువకుడిని వరం గల్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. సదరు మహిళ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని, అధికారుల వద్ద పలుకుబడి ఉందని నిరుద్యోగులతో నమ్మబలికింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని, రిజిస్ట్రేషన్ నిమిత్తం, అధికారులకు ఇవ్వడానికి డబ్బులు ఖర్చవుతాయని నమ్మించింది. తన ముఠా సభ్యులను అధికారులుగా చూపించి, వసూళ్లకు తెరలే పింది. మరో వ్యక్తి నుంచి అస్పత్రిలో క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్టు పేరుతో రూ.13.5 లక్షలు, కరీంన గర్‌లోని తిరుమల నగర్లో నివాసం ఉంటున్న మరో వ్యక్తి నుంచి ప్రభుత్వ ఊద్యోగం పేరుతో రూ.7 లక్షలు, గోదావరిఖనికి చెందిన ఓ యువకుడి వద్ద నుంచి రూ.3లక్షలు వసూలు చేశారు. అంతేకాదు, నిందితురాలు వరంగల్‌కు చెందిన యువకుడితో తనను నికితారెడ్డిగా పరిచయం చేసుకొని, అతనితో చేసిన ఫోన్ చాటింగ్ చేసింది. దాన్ని అడ్డు పెట్టుకొని అతడిని బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.8 లక్షల వరకు లాగేసుకుంది.కాగా, రోజుల తరబడి నిరీక్షించినా ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితు లు తాము మోసపోయామని గ్రహించారు. తమ నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే రాజేష్, భాస్కర్, భీమాశంకర్‌లను పెద్ద మనుషులుగా చూపించింది. తన మొబైల్లో చాటింగ్‌ను చూపి స్తూ వారిపైనే కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో చేసేదీలేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. భాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనలతో నిఘా పెట్టిన పోలీసులు నిందితులందరినీ పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.20 వేల నగదు, నకిలీ నియామక పత్రాలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కరీంనగర్, గోదావరిఖని, వరంగల్, హైద్రాబాద్ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని కరీంనగర్ సీపీ వీబీ.కమలాసన్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని వచ్చేవారి మాయమాటలు నమ్మి, డబ్బు, సమయం కోల్పోవద్ద న్నారు. ఈ ముఠా వల్ల మోసపోయిన వారు ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు.
తెలుగురాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న జల సంబంధిత అంశాలను ప్రభుత్వాల స్థాయిలో చర్చించేందు కు కేంద్రం సిద్ధమవుతున్నది. కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నారంటూ తెలంగాణ, ఏపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న నేపథ్యంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇద్దరు ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం …
తెలుగురాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న జల సంబంధిత అంశాలను ప్రభుత్వాల స్థాయిలో చర్చించేందు కు కేంద్రం సిద్ధమవుతున్నది. కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నారంటూ తెలంగాణ, ఏపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న నేపథ్యంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇద్దరు ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం కావాలని నిర్ణయించింది. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశాలతో ఇప్పటికే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు రెండు రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించాయి. దీంతో కేంద్ర జల్‌శక్తి అధికారులు అపెక్స్ కౌన్సిల్ భేటీపై దృష్టిసారించారు.నదీ జలాల వినియోగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేయాలని కేసీఆర్ అధికారులకు తెలిపారు. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాల అలసత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఎండగట్టాలని సూచించారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలని, నిజనిజాలను యావత్ దేశానికి తెలిసేలా వాస్తవాలను రూపొందించాలని సీఎం అధికారులనుఆదేశించినట్లు సమాచారం.నదీ జలాల వినియోగంలో తెలంగా ణకు జరుగుతున్న అన్యాయాన్ని, వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేయాలని కేసీఆర్ అధికారులకు తెలిపారు. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాల అలసత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఎండగట్టాలని సూచించారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలని, నిజనిజాలను యావత్ దేశానికి తెలిసేలా వాస్తవాలను రూపొందించా లని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం.దేశంలో రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి నీటివాటా కేటాయింపులు జరగాలని.. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు సీఎం గుర్తు చేశారు. చట్ట ప్రకారం కొత్త ట్రైబ్యునల్ లేదా ప్రస్తుత ట్రైబ్యునల్ ద్వారా అయినా తెలంగాణకి నీటి కేటాయింపులు జరపాలని కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ పరీవాహక ప్రాంతాల్లోని మొత్తం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరపాలని కోరినట్లు సీఎం వివరించారు. అయితే, ఏడేళ్లు గడుస్తున్నా ప్రధానికి రాసిన లేఖకు సంబం ధించి ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదన్నారు. వచ్చే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా నిలదీయాలని.. అదే సమయంలో తెలంగాణకు రావల్సిన నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. ఈ సారి జరిగే అపెక్స్ కౌన్సిల్ లో అయినా న్యాయం చేయాల్సిందిగా కోరుతామని సిఎం స్పష్టం చేస్తున్నారు.అపెక్స్ కౌన్సిల్ భేటీకి హాజరయ్యేందుకు అజెండాలతో సిద్ధం కావాలని ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లేఖలు రాశారు. దీంతో ఏపీ, తెలంగాణ రెండూ ఇప్పుడు ఆ పనిలో బిజీగా ఉన్నాయి.
ఇది ఘోరం.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. తన కూతురును అమ్మేశాడు. అది కూడా అక్షరాల మూడు వేల రూపాయాలకు. ఈ ఘటన రెండేళ్ల క్రితం చోటు చేసుకోగా ఇప్పుడు వెలుగు చూసింది.ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ఘడ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను …
ఇది ఘోరం.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. తన కూతురును అమ్మేశాడు. అది కూడా అక్షరాల మూడు వేల రూపాయాలకు. ఈ ఘటన రెండేళ్ల క్రితం చోటు చేసుకోగా ఇప్పుడు వెలుగు చూసింది.ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ఘడ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను రెండేళ్ల క్రితం 21 ఏళ్ల యువకుడికి రూ. 3 వేలకు అమ్మేశాడు. అప్పుడామె వయసు 16 సంవత్సరాలు. ఇంట్లో పని చేయిం చుకునేందుకని చెప్పి ఆ బాలికను యువకుడు తీసుకెళ్లాడు. కానీ ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేసి హింసించాడు. ఈ క్రమంలో బాధితురాలు కొన్ని నెలల క్రితం గర్భం ధరించింది. దీంతో ఆ యువకుడు.. ఆమెను నడిరోడ్డుపై వదిలేశాడు. ఆమెతో డబ్బు లేకపోవడంతో వీధుల్లో తిరుగుతూ జీవనం సాగించిం ది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆమెను ఎవరూ ఆదుకోలేదు. మొత్తానికి ఈ ఏడాది మే నెలలో బాధితురా లిని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు చేరదీశారు. ఆ తర్వాత ఆమె పండంటి బిడ్డకు జన్మని చ్చింది. నెల రోజుల క్రితం ఆమెను బిలాస్‌పూర్‌లోని సఖి కేంద్రానికి తరలించారు.తనకు జరిగిన ఘోర అవమానాన్ని సఖి కేంద్ర నిర్వాహకులకు బాధితురాలు చెప్పింది. రెండేళ్ల క్రితం తన అమ్మ చనిపోయి నప్పుడు.. తనను ఓ యువకుడికి రూ. 3 వేలకు నాన్న అమ్మాడు. తాను కేవలం ఇంటి పని చేయిస్తా నని చెప్పి తనను ఆ యువకుడు తీసుకెళ్లాడు. కానీ తనపై అనేకసార్లు అత్యాచారం చేశాడు. చివరకు గర్భం వచ్చాక రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు అని చెబుతూ బాధితురాలి కన్నీరు పెట్టుకుంది.
సత్యం గెలిచింది దేశంలోని ఎంతో గౌరవనీయులైన నాయకులపై కేసు చివరకు మూడు దశాబ్దాల తర్వాత తొలగిపోయింది ఈ తీర్పును ప్రతి ఒక్కరు స్వాగతించాలి బాబ్రీ మసీదు కూల్చి వేత కేసులో 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థా …
బాబ్రీ మసీదు కూల్చి వేత కేసులో 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థా నం ఈ రోజు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు ఈ కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా తేల్చడం పట్ల ఆ పార్టీ నేతలు హర్షం వ్య క్తం చేస్తున్నారు.’సత్యం గెలిచింది. బాబ్రీ కుట్రపూరిత కేసులో నిందితులుగా ఉన్న వారిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించడంలో చాలా ఆలస్యం జరిగింది. దేశంలోని ఎంతో గౌరవనీయులైన కొందరు నాయకులపై కుట్రపూరితంగా పెట్టిన ఈ కేసు చివరకు మూడు దశాబ్దాల తర్వాత తొలగిపోయిం ది. ఈ తీర్పును ప్రతి ఒక్కరు స్వాగతించాలి’ అని బీజేపీ నేత రామ్ మాధవ్ పేర్కొన్నారు.
పెద్దల్ని ఎదిరించే పెళ్లి చేసుకోవడమే కాదు, అంతే ధైర్యంగా దాంపత్య జీవితాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి. లేకపోతే విధి ఆడే ఆటలో సమిధలు కాక తప్పదు. తాజాగా తమిళనాడులో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. భర్త తిట్టాడని …
పెద్దల్ని ఎదిరించే పెళ్లి చేసుకోవడమే కాదు, అంతే ధైర్యంగా దాంపత్య జీవితాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి. లేకపోతే విధి ఆడే ఆటలో సమిధలు కాక తప్పదు. తాజాగా తమిళనాడులో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. భర్త తిట్టాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య ఎడబాటును తట్టుకోలేకపోయాడో, లేక ఆమె మరణం తన పీకల మీదకు వస్తుందని భావించాడో భర్త కూడా ఆమె బాటనే ఎంచుకున్నాడు. ఈరోడ్ జిల్లా అందియూరు దగ్గర్లోని ఒరుచ్చేరికి చెందిన ఇలంగోవన్(23), తిరుచంగోడుకు చెందిన రమ్య(23) ఒకరినోకరు ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు నో చెప్పడంతో ఇంట్లో నుంచి వెళ్లి వివాహం చేసుకున్నారు. మూడు నెలలుగా అందియూర్‌లో కాపురం ఉంటున్నారు. పని ముగించుకుని ఇంటికొచ్చిన ఇలంగోవన్, రమ్య ఉరికి వేలాడుతూ ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందాడు. కాసేపటికే అతను కూడా ఉరేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఇద్దరూ ఇంట్లో బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా ఆత్మహత్య ఉదంతం వెలుగుచూసింది. ఉదయాన్నే ఇలంగోవన్ తనను తిట్టడంతో రమ్య తీవ్ర మనస్తాపానికి లోనైనట్టు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయ్యింది. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకోవడం, భయంతో ఇలంగోవన్ సైతం బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
పాలు, పాల సంబంధిత పదార్థాలను తీసుకుంటే పేగు క్యాన్సర్ ముప్పును 13 శాతం నుంచి 19 శాతం వరకు తగ్గించుకోవచ్చని కెనడాలోని మెక్‌గ్రిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వివరాలు ‘గట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఆస్ప్రిన్ వంటి మాత్రలతో (రోజుకు 75మిల్లీగ్రామ్-325మిల్లీగ్రామ్) కూడా …
పాలు, పాల సంబంధిత పదార్థాలను తీసుకుంటే పేగు క్యాన్సర్ ముప్పును 13 శాతం నుంచి 19 శాతం వరకు తగ్గించుకోవచ్చని కెనడాలోని మెక్‌గ్రిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వివరాలు ‘గట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఆస్ప్రిన్ వంటి మాత్రలతో (రోజుకు 75మిల్లీగ్రామ్-325మిల్లీగ్రామ్) కూడా ఈ క్యాన్సర్ ముప్పు 14 శాతం నుంచి 29 శాతం వరకు తగ్గుతున్నట్టు వివరించారు.
27న కిడ్నాప్ అయిన దీపిక తననెవరూ కిడ్నాప్ చేయలేదన్న యువతి కోర్టులో చెప్పేదానిని బట్టి చర్యలు ఉంటాయన్న పోలీసులు వికారాబాద్ యువతి దీపిక కిడ్నాప్ కేసులో 48 గంటల ఉత్కంఠకు తెరపడింది. భర్తతో కలిసి ఉండేం దుకే యువతి అతడితో వెళ్లినట్టు పోలీసులు …
కోర్టులో చెప్పేదానిని బట్టి చర్యలు ఉంటాయన్న పోలీసులు
వికారాబాద్ యువతి దీపిక కిడ్నాప్ కేసులో 48 గంటల ఉత్కంఠకు తెరపడింది. భర్తతో కలిసి ఉండేం దుకే యువతి అతడితో వెళ్లినట్టు పోలీసులు తేల్చారు. నిన్న వారిద్దరినీ విలేకరుల ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఖలీల్ అలియాస్ అఖిల్‌ను ప్రేమించిన దీపిక నాలుగేళ్ల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టంలేని దీపిక తల్లి దండ్రులు కుమార్తెను ఇంటికి తీసుకొచ్చి ఆమెతో విడాకులకు దరఖాస్తు చేయించారు.ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా, ఈ నెల 27న సాయంత్రం పట్టణంలోని ఎమ్మార్పీ చౌరస్తా సమీపంలో దీపిక కిడ్నా ప్ అయింది. ఆమె కోసం గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరు బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తననెవరూ కిడ్నాప్ చేయలేదని, కావాలనే భర్తతో కలిసి కారులో వెళ్లినట్టు దీపిక పేర్కొందని పోలీసులు తెలిపారు. కోర్టులో దీపిక చెప్పే దానిని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.