• Abhi9news,Hyderbad
  • July 13, 2020
0 Comments

 పేస‌ర్ల‌ను ఎదుర్కునేందుకు తాను భ‌య‌ప‌డుతాన‌ని రోహిత్ శ‌ర్మ చెప్పిన మాట‌లు అబ‌ద్ధాల‌ని అత‌డి స‌హ‌చ‌రుడు శిఖ‌ర్ ధ‌వ‌న్ పేర్కొన్నాడు. ఇటీవ‌ల ఆసీస్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌తో జ‌రిపిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో రోహిత్ మాట్లాడుతూ.. `శిఖ‌ర్ ఒక ఇడియ‌ట్‌. పేస‌ర్ల‌ను ఎదుర్కునేందుకు భ‌య‌ప‌డ‌తాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ తొలి బంతిని అస్సలు ఎదుర్కోలేడు` అని పేర్కొన్నాడు. దీనిపై తాజాగా స్పందించిన శిఖ‌ర్‌.. `అది పూర్తిగా అబద్ధం. అలాంటిదేమీ లేదు. తొలి ఓవ‌ర్ ఎదుర్కోవ‌డానికి ఇబ్బందైతే.. రెండో ఓవ‌ర్‌లో కూడా ఉండాలి క‌దా. తొలిసారి ఓపెనింగ్ చేసిన‌ప్ప‌టి నుంచి నాన్‌స్ట్ర‌యిక‌ర్ ఎండ్ నుంచి మొద‌లుపెట్ట‌డ‌మే నాకు అల‌వాటు. దాన్నే కొన‌సాగిస్తున్నా. పృథ్వీ షా లాంటి కొత్త కుర్రాడు ఇన్నింగ్స్ ఆరంభించేందుకు ఇబ్బంది ప‌డి స్ట్రయిక్ తీసుకొమ్మంటే త‌ప్ప‌క తీసుకుంటా` అని అన్నాడు. భార‌త మాజీ ఆట‌గాడు ఇర్ఫాన్ ప‌ఠాన్‌తో జ‌రిపిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ధ‌వ‌న్ త‌న అభిప్రాయాలు వ్య‌క్తం చేశాడు. 

Share this:

Author

editer.abhi9news@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!