• Abhi9news,Hyderbad
  • November 25, 2020
0 Comments

 ఆగస్టులో శ్రీలంక పర్యటనతో టీమ్​ఇండియా అంతర్జాతీయ క్రికెట్​ను పునఃప్రారంభించనున్నట్టు సమాచారం. కరోనా కారణంగా క్రికెట్ పోటీలన్నీ నిలిచిపోగా.. లంకతో పోరుతో కోహ్లీసేన మళ్లీ మైదానంలో తలపడే అవకాశాలు ఉన్నాయి. ఈ పర్యటన కోసం శ్రీలంక క్రికెట్​ బోర్డు(ఎస్​ఎల్​సీ)కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని లంకకు చెందిన ‘ది ఐలాండ్’​ పత్రిక వెల్లడించింది.లంకలో టీమ్​ఇండియా టూర్​కు భారత ప్రభుత్వం కూడా అంగీకరించిందని పేర్కొంది.జూన్​లోనే శ్రీలంకలో కోహ్లీసేన మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ ప్రభావంతో సాధ్యం కాకపోవడంతో.. వీటిని ఆగస్టులో నిర్వహించేందుకు శ్రీలంక క్రీడామంత్రిత్వ శాఖను ఎస్​ఎల్​సీ అనుమతి కోరింది. కరోనా నేపథ్యంలో విధించిన చాలా నిబంధనలు ఆగస్టులో తొలగిపోతాయన్న అంచనాలతో సిరీస్​లను ఆ నెలలో నిర్వహించేందుకు సిద్ధమైంది. భారత్​తో మ్యాచ్​లు జరిగితే వాటి ద్వారా వచ్చే టీవీ హక్కుల ఆదాయంతో ఆర్థిక కష్టాల నుంచి బయటపడొచ్చని ఎస్​ఎల్​సీ ఆలోచిస్తున్నది.

Share this:

Author

editer.abhi9news@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!