• Abhi9news,Hyderbad
  • November 25, 2020
0 Comments

కరోనా మహమ్మారి వల్ల క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యంకాకపోవడంతో షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌లను బీసీసీఐ రద్దు చేస్తున్నది. తాజాగా జింబాబ్వే పర్యటనను కూడా రద్దు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. భారత క్రికెట్‌ జట్టు ఆగస్టు 22 నుంచి జింబాబ్వేలో పర్యటించాల్సి ఉంది.ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌-19 విస్తరిస్తున్న నేపథ్యంలో  భారత క్రికెట్‌ జట్టు..శ్రీలంక, జింబాబ్వే దేశాల పర్యటనకు వెళ్లదని బీసీసీఐ శుక్రవారం స్పష్టం చేసింది.  జూన్‌ 24 నుంచి టీమ్ ఇండియా లంక టూర్‌ వెళ్లాల్సి ఉంది. లంక పర్యటనలో భారత్‌ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఆగస్టు 22న ప్రారంభంకావాల్సిన జింబాబ్వే టూర్‌లో భారత్‌ మూడు వన్డేలు ఆడాల్సి ఉందని బీసీసీఐ సెక్రటరీ జై షా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   

Share this:

Author

editer.abhi9news@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!