• Abhi9news,Hyderbad
  • July 13, 2020
0 Comments

మన నేలపై కన్నేస్తే ఊరుకోం..  జవాబు చెప్పే సత్తా మనకుంది..
ఫ్రెండ్ షిప్ కు కట్టుబడి ఉంటం.. దూకుడు చూపిస్తే జవాబిస్తం
మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ

శక్తులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. ఇండియా ఫ్రెండ్ షిప్ స్ఫూర్తి కి కట్టుబడి ఉంటుందని, అదే సమయంలో పొరుగు దేశాలు ఎలాంటి దుందుడుకు చర్యలకు దిగినా తగిన జవాబు చెప్పే సత్తా తమకు ఉందని చెప్పారు. దేశ గౌరవాన్ని దెబ్బ తీసే చర్యలను అంగీకరించేది లేదని దేశ సైనికులు తమ త్యాగాల ద్వారా నిరూపించారన్నారు. మన్ కీ బాత్ లో భాగంగా ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ రేడియా ద్వారా ప్రసంగిం చారు. ఇండియా, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పొరుగు.దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కూడా గట్టి రిప్లై ఇచ్చారు. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) దాడిలో మరణించి న 20 మంది జవాన్లకు మోడీ ఈ సందర్భంగా నివాళులర్పించారు.
లోకల్ వస్తువులే కొనండి
లోకల్ గా తయారయ్యే వస్తువులు కొనుగోలు చేసేందుకే జనం ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ కోరారు. దేశానికి సేవ చేయడానికి ఇదో మార్గమని, దీని వల్ల కంట్రీ మరింత పటిష్టమవుతుందన్నా రు. ఈ సందర్భంగా ఓ పాత కథను ఆయన ప్రస్తావించారు. ఒకప్పుడు ఓ వ్యక్తి గొడవలు సృష్టిం చడానికి తన చదువులను, అల్లర్లు సృష్టిం చడానికి సంపదను, ఇతరులను ఇబ్బం ది పెట్టడా నికి తన శక్తిసామర్థ్యా లను వాడాడని.. అదే సమయంలో ఒక జెంటిల్మెన్ చదువును జ్ఞానం కోసం.. సంపదను సహాయం చేయడానికి, తన శక్తిసామర్థ్యా లను రక్షణ కోసం వాడాడని చెప్పారు. ఇండియా కూడా ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతోందని, ఇతరులకు సాయం చేయడం, రక్షణ కల్పించడమే తమ దేశం పని అని చెప్పారు. స్వశక్తితో పైకి ఎదగడమే ఇండియా లక్ష్యమని, మన ట్రెడిషన్ , ఫ్రెండ్ షిప్ ను నమ్మడమేనని, ఈ ప్రిన్సి పల్స్ పైనే ఇకపైనా ముందుకెళతామన్నా రు.స్వశక్తితో ఇండియా ఎదగాలిమన సైనికులు చేసిన త్యాగాలకు స్వశక్తితో ఎదిగిన ఇండియాన అసలైన నివాళి అని మోడీ అన్నా రు. మన బార్డర్లను రక్షించుకునేందుకు అవసరమైన కే పబులిటీ స్, కెపాసిటీలను పెంపొందించుకునే దిశగా దేశం అడుగులు వేస్తోందని చెప్పారు. లడాఖ్ లో ఏం జరిగిందో చూసిన తర్వాత తాను లోకల్ వస్తువులే కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నానని ఓ అస్సాం మహిళ తనకు లేఖ రాసిందని, ఇలాంటి మెస్సే జ్ లే త నకు దేశం నలు మూలల నుంచి అందాయని చెప్పారు. స్వాతంత్ర్యానికి ముందు డిఫెన్స్ సెక్టార్ లో ఇండియా ఎన్నో దేశాలకంటే ముందుండేదని, దేశవ్యాప్తంగా ఎన్నో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉండేవని, కానీ ఇప్పుడు ఇతర దేశాలన్నీ మనల్ని మించి ముందుకు వెళ్లిపోయాయని, ఈ రంగంలో స్వయం శక్తితో ఇండియా ఇప్పుడు ఎదుగుతోందని చెప్పారు. ఇండియాను సెల్ఫ్​ రిలవెంట్ గా మార్చడం లో దేశ ప్రజలదే కీలక పాత్రని చెప్పారు.రెండు విషయాలపై దృష్టిమైనింగ్, స్పేస్, అగ్రికల్చర్ సెక్టార్లలో రిఫార్మ్స్ దేశ ప్రగతిని మార్చేస్తాయని ఆయన ఆకాంక్షించారు. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా 2020ని బ్యాడ్ ఇయర్ గా ప్రజలు భావించవద్దని ప్రధాని కోరారు. ఇలాంటి సంక్షోభాలను ఇండియా అవకాశాలుగా మార్చుకుని ముందుకు వెళ్లిందని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందన్నా రు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యోగా అనేది జనాల లైఫ్ స్టైల్ లో ఒక భాగమైపోయిందని మోడీ చెప్పారు. గ్లోబల్ హెల్త్​కు ఇండియా ఎంతో సహాయం చేస్తోందన్నారు. ప్రస్తుతం మన ఆయుర్వే దాన్ని ప్రపంచమంతా వాడుతోందన్నారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియాన్ ఆరిజన్ మీటింగ్ లో మోడీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
పీవీకి ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాళి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయనకు నివాళు లర్పించారు. దేశాన్ని క్లిష్టపరిస్థితుల్లో పీవీ ముందుకు నడిపించారని కొనియాడారు. మోడీ మన్ కీబాత్ లోనూ పీవీ గురించి ప్రస్తావించారు. ఇండియా మూలలకు కట్టుబడిన పీవీ.. వెస్ట్రన్ లిటరేచర్, సైన్స్ పై ఎంతో పట్టు సాధించారని, ఆయన దేశంలోని అతి ఎక్కువ అనుభవం కలిగిన నాయకుడని చెప్పారు. ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దేశగతిని మార్చిన నాయకుడు పీవీ అని వెంకయ్య ప్రశంసించారు. సమర్థవంతమైన పాలకుడే కాక, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు

Share this:

Author

editer.abhi9news@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!