• Abhi9news,Hyderbad
  • July 13, 2020
0 Comments
  • గత 24 గంటల్లో 18,522 మందికి కొత్తగా కరోనా
  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 5,66,840
  • మృతుల సంఖ్య మొత్తం 16,893
  • నిన్నటి వరకు మొత్తం 86,08,654 శాంపిళ్ల పరీక్ష

దేశంలో కొవిడ్‌-19 ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 18,522 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 418 మంది మరణించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,66,840కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16, 893కి పెరిగింది. 2,15,125  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్ప టివరకు 3,34,822 మంది కోలుకున్నారు.కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 86,08,654 శాంపి ళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,10,292 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.

Share this:

Author

editer.abhi9news@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!