• Abhi9news,Hyderbad
  • August 8, 2020
0 Comments

మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా మెడికల్ కాలేజీ భవనాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ఈటల రాజేందర్ , V. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద ఎకో టూరిజం పార్క్ 2087 ఎకరాల్లో ఉన్న KCR ఎకో అర్బన్ పార్క్ ను ప్రారంభించారు. అనంతరం తెలంగాణ కు హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఈత చెట్ల ను నాటారు. KCR ఎకో అర్బన్ పార్క్ లో చైన్ లింక్ ఫెన్సింగ్ తో పాటు ఇతర 155.60 లక్షల రూపాయల తో చేప ట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.మహబూబ్ నగర్ పట్టణంలోని అభివృద్ధి పనులపై రూపొందించిన ప్రగతి పథం ప్రత్యేక పుస్తకాన్ని మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.అనంతరం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ని మంత్రులు శ్రీ KT రామారా వు , శ్రీ. ఈటల రాజేందర్ , శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు అనతికాలంలోనే రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచినందుకు మంత్రులు సంతోషం వ్యక్తంచేశారు…

Share this:

Author

editer.abhi9news@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!