

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1.40 కోట్లు దాటింది. ఆరు లక్షల మందికిపైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పలు దేశాలు కరోనాకు వ్యాక్సిన్ను తయారు చేస్తున్నాయి. వాటిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సి టీకి చెందిన జెన్నర్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న టీకా ముందంజలో ఉన్నది. అదేవిధంగా కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కూడా పలు సంస్థలు కొత్తకొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి.ఈ నేపథ్యం లోనే ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్తరకం రక్తపరీక్షను అభివృద్ధి చేశారు. ఈ కొత్త పరీక్ష ద్వారా ఒక వ్యక్తికి కరోనా సోకిందా లేదా అనే విషయాన్ని కేవలం 20 నిమిషాల్లోనే తెలు సుకోవచ్చు. అంతేగాక ఈ కొత్తరకం పరీక్ష ద్వారా కరోనా సోకినవారినే కాకుండా కరోనా బారినపడి కోలు కున్నవారిని సైతం గుర్తించవచ్చని మోనాష్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. అదేవిధంగా వ్యాక్సిన్ పరీక్షల్లో అవసరమైన యాంటీబాడీల వృద్ధిని కూడా కరోనా పరీక్షల ద్వారా త్వరగా తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.ఇటీవల తమ పరిశోధకులు 25 మైక్రోలీటర్ల ప్లాస్మాను ఉపయోగించి కరోనా కేసులను గుర్తించినట్లు మోనాష్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా పాజిటివ్ కేసులు ఎర్ర రక్తకణాల క్లస్టరింగ్కు కారణమవుతాయని, ఇకపై దాన్ని కంటితో సులభంగా గుర్తించవ చ్చని యూనివర్సిటీ పేర్కొన్నది. ఈ పరీక్షను ఉపయోగించి పరిశీలకులు కేవలం 20 నిమిషాల్లోనే పాజిటివ్, నెగెటివ్ రీడింగ్స్ పొందవచ్చని యూనివర్సిటీ వెల్లడించింది.