• Abhi9news,Hyderbad
  • March 3, 2021
0 Comments

వీడ్కోలు మ్యాచ్ లేకుండానే గుడ్ బై 

 శుభాకాంక్షలతో ముంచెత్తిన క్రీడాలోకం 

పూర్తి పేరు: మహేంద్రసింగ్ ధోనీ 

పుట్టిన తేది:జూలై 7, 1981, రాంచీ(జార్ఖండ్)

భారత క్రికెట్ రెండు ప్రపంచకప్ అందించిన ధీరుడు, అత్యంత విజయవంతమైన సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికాడు. ఆటగాడిగా, కెప్టెన్ ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించిన మహీ స్వాతంత్య్ర దినోత్సవం రోజునే రిటైర్మెంట్ ప్రకటించాడు. దూకుడైన బ్యాటింగ్, వ్యూహరచనతో టీమ్ ఎన్నో చిరస్మణీయ విజయాలను సాకారం చేసిన ఆ దిగ్గజం ఇక బ్లూ జెర్సీని వదిలేస్తున్నట్టు ఆకస్మికంగా శనివారం ఇన్ వెల్లడించాడు. నిత్యం ప్రేమ, మద్దతు తెలిపిన మీకు నా కృతజ్ఞతలు. 19.29 గంటల నుంచి నేను రిటైర్ అయినట్టు పరిగణించండి అని తన ఇన్ ఖాతాలో మహేంద్రుడు  వెల్లడించాడు. భారత జట్టుతో తీపిజ్ఞాపకాలైన ఫొటోలను వీడియోగా పంచుకున్నాడు. ‘మై పల్ దో పల్ కా షాయర్ హూ’ అంటూ బాలీవుడ్ చిత్రం కభీకభీలోని  పాటను బ్యాగ్ పెట్టి కవితాత్మకంగా వీడ్కోలు ప్రకటించాడు. కంప్యూటర్ ప్రాసెసర్ కంటే వేగంగా మైదానాల్లో నిర్ణయాలు తీసుకొని జట్టుకు విజయాలు కట్టబెట్టిన ధోనీ.. రిటైర్మెంట్ విషయంలోనూ మళ్లీ అదే పంథాను అవలంభించాడు. ఆడంబరాలకు దూరంగా ఉండే లక్షణాన్ని కొనసాగిస్తూ.. వీడ్కోలు మ్యాచ్ సైతం ఆశించకుండా కర్మయోగిలా.. టీమ్ దూరమయ్యాడు. ఐపీఎల్ శిక్షణ శిబిరం కోసం చెన్నైలో ఉండే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. గతేడాది జూలై 10న వన్డే ప్రపంచకప్ సెమీఫైనలే ధోనీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్. మొత్తానికి ఈ ఏడాది ఐపీఎల్ దుమ్మురేపి మళ్లీ ధోనీ జట్టులోకి వస్తాడనుకున్న అభిమానులు నిరాశచెందారు. ప్రపంచకప్ వచ్చే ఏడాది వాయిదా పడడం కూడా ధోనీ నిష్క్రమణకు కారణమై ఉండొచ్చు. 

వికెట్ల మధ్య చిరుతలా.. వికెట్ల వెనుక సింహంలా.. 

ఆలోచనలో శ్రీకృష్ణుడిలా.. ఆచరణలో అర్జునుడిలా..

సమూహంలో సౌమ్యుడిలా.. ఏకాంతంలో ఏకలవ్యుడిలా..

దిగ్గజాలతో శిష్యుడిలా.. యువకులతో అగ్రజుడిలా..

భిన్న రూపాల్లో.. విభిన్న బాధ్యతల్లో ఒప్పించి.. మెప్పించి..

మైమరిపించిన మాస్టర్ మైండ్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికాడు. హెలికాప్టర్ షాట్లు, సూపర్ సిక్సర్లు, మెరుపు స్టంపింగ్స్ పదిహేనేండ్ల పాటు భారత అభిమానులను ఉర్రూతలూగించిన మహీ ఎక్స్ శనివారంతో తన ప్రయాణాన్ని చాలించింది. వన్డే, టీ20 ప్రపంచకప్ పాటు చాంపియన్స్ ట్రోఫీ అందించిన భారత సారథి ఘనతలను ఓ సారి గుర్తుచేసుకుంటే..

వన్డేలు:

మ్యాచ్ 350

పరుగులు: 10773 

సగటు: 50.57 

అత్యధిక స్కోరు: 183* 

సెంచరీలు: 10

అర్ధసెంచరీలు: 73 

టీ20లు: 

మ్యాచ్ 98

పరుగులు: 1617 

సగటు: 37.60 

అత్యధిక స్కోరు: 56

సెంచరీలు: 0

అర్ధసెంచరీలు: 2

వికెట్ ప్రదర్శన

టెస్టులు: క్యాచ్ 256, స్టంప్ 38

వన్డేలు: క్యాచ్ 321, స్టంప్ 123

టీ20లు: క్యాచ్ 57, స్టంప్ 34 

తొలి టెస్టు: శ్రీలంకపై 2005 డిసెంబర్ 2న, చెన్నైలో

ఆఖరి టెస్టు: ఆస్ట్రేలియాపై 2014 డిసెంబర్ 30న మెల్

తొలి వన్డే : బంగ్లాదేశ్ 2004 డిసెంబర్ 23న చిట్టగాంగ్ 

ఆఖరి వన్డే: న్యూజిలాండ్ 2019 జూలై 9-10న మాంచెస్టర్ (వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్).. 

తొలి టీ20: దక్షిణాఫ్రికాపై 2006 డిసెంబర్ 1న జొహన్నెస్ 

చివరి మ్యాచ్: ఆస్ట్రేలియాపై 2019 ఫిబ్రవరి 27న, బెంగళూరులో

ధోనీ అవార్డులు: 

జాతీయ అవార్డులు

పద్మ భూషణ్ (2018)

పద్మశ్రీ(2009) 

రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర  (2007-08)

క్రికెట్ అవార్డులు

ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్  (2008,2009)

ఐసీసీ ప్రపంచ వన్డే ఎలెవెన్ 8సార్లు చోటు (3సార్లు కెప్టెన్)

సైన్యంలో.. 

భారత టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదా 

332 కెప్టెన్ అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్

183 వికెట్ కీపర్ వన్డేల్లో అత్యధిక స్కోరు (శ్రీలంకపై 2005లో)

84 వన్డేల్లో అత్యధిక నాటౌట్

123 అంతర్జాతీయ వన్డే క్రికెట్ అత్యధిక స్టంపింగ్

41 టీ20 కెప్టెన్ అత్యధిక విజయాలు 

0.08 సెకన్లు వేగవంతమైన స్టంపౌట్ 

84 టీ20ల్లో డకౌట్ కాకుండా వరుసగా అత్యధిక మ్యాచ్

క్రికెట్ సైనికా సెల్యూట్

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం:ఛేజింగ్ ధోనీ ఉన్నాడంటే.. భారత్ విజయం సాధిస్తుందనే ధీమా.. వికెట్ల వెనుక మహీ నిల్చున్నాడంటే.. ప్రత్యర్థి పనైపోయినట్లే అని భరోసా.. సారథిగా వ్యూహం పన్నాడంటే.. మ్యాచ్ మన వశమైనట్లే అనే నమ్మకం.. దశాబ్దంన్నర పాటు అశేష అభిమానుల మనసులు గెలిచిన మహేంద్రసింగ్ ధోనీ.. యువతరానికి దారి వదులుతూ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికాడు. చడీచప్పుడు లేకుండా టెస్టు క్రికెట్ (2014లో)కు దూరమైన మహీ.. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి కూడా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండానే తప్పుకున్నాడు. 

రనౌట్ ప్రారంభించి..  రనౌట్ ముగించి..

2004లో బంగ్లాదేశ్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ అడుగుపెట్టిన ధోనీ.. పరుగులేమీ చేయకుండా రనౌట్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వికెట్ల మధ్య పరుగు తీయడంలో ప్రపంచ మేటీగా గుర్తింపు సాధించిన మహీ.. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ రనౌట్ కావడం గమనార్హం. గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో రనౌట్ అయిన ధోనీ ఆ తర్వాత మైదానంలో అడుగుపెట్టలేదు. న్యూజిలాండ్ జరిగిన ఆ పోరులో.. టాపార్డర్ విఫలమైనా.. ధోనీ క్రీజులో ఉన్నంతవరకు టీమ్ విజయం అని అభిమానులంతా అనుకున్నారు. అలాంటి క్లిష్ట స్థితిలో గప్టిల్ వేసిన డైరెక్ట్ త్రోకు రనౌట్ అయిన ధోనీ కండ్ల నిండా నీటితో పెవిలియన్ చేరడం సగటు క్రీడాభిమానులెవరూ మరిచిపోలేరు. 

ఐపీఎల్ ఉందిగా..

ధోనీని దగ్గరి నుంచి పరిశీలించిన వారెవరైనా.. అతడు హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం ప్రకటిస్తాడని ఊహించే ఉంటారు. గతేడాది ప్రపంచకప్ తర్వాత అతడు ఇక దేశం తరఫున ఆడబోడని చాలా మంది మాజీలు జోస్యం చెప్పారు. అయితే మహీ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలకడంతో ఐపీఎల్ ఇక పూర్తిస్థాయి దృష్టి పెట్టే అవకాశం ఉంది. 2022 వరకు ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ఆడుతాడని ఇటీవల ఫ్రాంచైజీ అధికారి ఒకరు తెలిపిన విషయం తెలిసిందే. నీలిరంగులో మాయ చేయకున్నా.. ఇక పసుపు జెర్సీలో తలా (చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు పెట్టిన ముద్దుపేరు) మ్యాజిక్ మరికొంత కాలం పాటు చూసే అవకాశం ఉండటం కాస్తలో కాస్త సంతోషించాల్సిన విషయం.

జులపాల జుట్టు నుంచి.. హెలికాప్టర్ షాట్ వరకు..

కెరీర్ తొలినాళ్లలో జులపాల జుట్టు.. ఐదు లీటర్ల పాలు.. జార్ఖండ్ డైనమైట్.. టార్జన్ అంటూ వార్తల్లో నిలిచిన ధోనీ.. అరంగేట్రం చేసి మూడేండ్లు తిరగక ముందే.. జట్టు పగ్గాలు చేపట్టాడు. తన నాయకత్వ ప్రతిభతో దాదా వారసుడిగా ఎన్నికైన మహీ.. తొలి టోర్నీలోనే యువ ఆటగాళ్లతో కూడిన జట్టును టీ20ల్లో ప్రపంచ చాంపియన్ (2007)గా నిలబెట్టాడు.2011 వన్డే ప్రపంచకప్ పాటు 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో హెలికాప్టర్ షాట్ ద్వారా ధోనీ సిక్సర్ బాది దేశానికి రెండో సారి ప్రపంచకప్ అందించిన క్షణాలను ఎవరు మరువగలరు. అతడి కెప్టెన్సీలోనే టీమ్ తొలిసారి టెస్టు ర్యాంకింగ్స్ నంబర్ (2009)గా నిలిచింది.

షాకిచ్చిన మహీ

ప్రపంచ క్రికెట్ అంతలా తన ముద్రవేసిన మహీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడం పెద్ద షాక్ అనే అనాలి. మిస్టర్ కూల్, మాస్టర్ మైండ్, అపర చాణక్యుడు, క్రికెట్ మేధావి ఇలా పేరేదైనా రూపం మాత్రం ఒక్కటే. పదిహేనేండ్ల పాటు టీమ్ వికెట్ల వెనుక వెన్నెముకలా నిలిచిన మహీ  ఇక విరామం తీసుకున్నాడు. జట్టులో అందరికంటే వేగంగా పరిగెత్తగలిగినంత కాలం కొనసాగుతానని ఓ సందర్భంలో పేర్కొన్న మహీ.. అదే జోరులో ఉండగానే తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

భారత క్రికెట్ నువ్వు అందించిన సేవలు అపారమైనవి. నీతో కలిసి వన్డే ప్రపంచకప్ గెలిచిన క్షణాలు నా జీవితంలో అమూల్యమైనవి. సెకండ్ ఇన్నింగ్స్ నీకు, నీ కుటుంబానికి అంతా మంచే జరుగాలని కోరుకుంటున్నా.   – సచిన్ టెండూల్కర్

ఇలాంటి ఆటగాడిని తిరిగి సృష్టించడం సాధ్యంకాని పని. అలాంటి ఆటగాళ్లు ప్రస్తుత తరంలో లేరు, గతంలోనూ లేరు, ఇకపై కూడా రారు, (నా కోయి హై, నా కోయి థా, నా కోయి హోగా ఎమ్ కే జైసా). ఎందరో ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ మహీ లాంటి వారు మరొకరు లేరు. కోట్లాది కుటుంబాల్లో అతడు ఓ సభ్యుడిగా మారిపోయాడు. ఓం ఫినిషాయ నమహః.          – వీరేంద్ర సెహ్వాగ్

ప్రతీ ఆటగాడు ఏదో ఒక రోజు కెరీర్ ముగించాల్సిందే. కానీ దగ్గరగా చూసిన వ్యక్తి వీడ్కోలు పలకడంతో.. ఆ బాధ ఎక్కువగా ఉంది. నువ్వు దేశానికి అందించినదాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకుంటారు. ఎప్పటికీ నువ్వే నా సారథివి. అందరూ నీ ఘనతలు చూశారు. నేను నిన్ను చూశా.   -విరాట్ కోహ్లీ, టీమ్ కెప్టెన్

చివరి ఓవర్ 15 పరుగులు చేయాల్సి ఉన్నా.. ధోనీ క్రీజులో ఉన్నాడంటే.. ఒత్తిడంతా బౌలర్ ఉంటుంది. ఇది ఎవరో అల్లాటప్పా వ్యక్తి చేసిన కామెంట్ కాదు. క్రికెట్ తల నెరిసిన సీనియర్ ఆటగాడి వ్యాఖ్య. స్వాతంత్య్ర దినోత్సవం నాడు కోట్లాది మంది అభిమానులకు మింగుడుపడని మాత్రవేసిన మహీ.. అంతర్జాతీయ క్రికెట్ నీ మాయ కనబర్చేందుకు మళ్లీ వస్తావా..!  

Share this:

Author

editer.abhi9news@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!