

క్రెడిట్, డెబిట్ కార్డుల నిబంధనలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్పులు చేసింది. ఈ మార్పులు ఈ నెల 30 నుంచి అమల్లోకి వస్తాయి. డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించేవారు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈ కొత్త నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులకు అంతర్జాతీయ లావాదేవీలు, ఆన్లైన్ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీలను నిలిపివేస్తారు. వినియోగదారుడు కోరుకున్న పక్షంలో ప్రాధాన్యత నమోదు చేసుకోవాల్సి ఉంటుది. ఈ సేవ కోసం దరఖాస్తు చేసిన తర్వాతే అంతర్జాతీయ, ఆన్ లైన్, కాంటాక్ట్ లెస్ లావాదేవీల సౌకర్యం వినియోగదారులకు లభిస్తుంది. డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేసేటప్పుడు వినియోగదారులు దేశీయ లావాదేవీలను అనుమతించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. దీని ప్రకారం, పీఓఎస్ టెర్మినల్ వద్ద కాకుండా ఏటీఎం నుంచి నగదును ఉపసంహరించుకునేటప్పుడు, అవసరమైతే విదేశీ లావాదేవీలను అనుమతించవద్దని ఆర్బీఐ సూచించింది.వినియోగదారులకు తమ కార్డుపై విదేశీ లావాదేవీలను ఎప్పుడైనా పొందగలిగే సదుపాయం ఉంటుంది. కస్టమర్ తన కార్డులోని ఏదైనా సేవను సక్రియం చేయడానికి లేదా తొలగించడానికి అధికారం కలిగి ఉంటారు. కస్టమర్ తన లావాదేవీల పరిమితిని రోజులో ఎప్పుడైనా మార్చవచ్చు. మీ కార్డు పరిమితిని మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం మెషిన్ లేదా ఐవీఆర్ ద్వారా ఎప్పుడైనా మార్చుకొనే వెసులుబాటు ఉన్నది. ఈ నియమాలు జనవరిలో తయారు చేయసినప్పటికీ అమలుపర్చలేదు. కరోనా మహమ్మారి కారణంగా ఈ మార్పులు ఇప్పుడు సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తాయి.