• Abhi9news,Hyderbad
  • November 25, 2020
0 Comments

బ‌హిరంగ ప్ర‌దేశాల‌ను ధ‌ర్నాల కోసం ఆక్ర‌మించ‌రాదు అని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది.  పౌర‌స‌త్వ చ‌ట్టాన్ని వ్య‌తిరేకిస్తూ ఢిల్లీలోని షెహీన్‌భాగ్‌లో ఆందోళ‌న‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఆందోళ‌న పేరుతో షెహీన్‌భాగ్‌ను నిర‌స‌న‌కారులు ఆక్ర‌మించారు. దీనిపై జారీ అయిన పిటిష‌న్ల‌పై ఇవాళ సుప్రీంకోర్టు స్పందించింది. నిర‌స‌న‌, ప్ర‌జాస్వామ్యం క‌లిసి ముందుకు సాగ‌వ‌చ్చు అని, కానీ షెహీన్‌భాగ్ లాంటి నిర‌స‌ న‌ల‌ను ఆమోద‌యోగ్యం కాదు అని కోర్టు వెల్ల‌డించింది.  ప‌బ్లిక్ ప్లేస్‌ల‌ను ఎప్ప‌టి కోసం ఆక్ర‌మించ‌డం స‌రికాదు అని కోర్టు పేర్కొన్న‌ది.  షెహీన్‌భాగ్ అయినా లేక ఇత‌ర ప్ర‌దేశ‌మైనా ఇది క‌రెక్ట్ కాదు అని కోర్టు చెప్పింది.  షెహీన్‌భాగ్ లాంటి నిర‌స‌న‌ల‌ను ఆమోద యోగ్యం కాదు అని, అధికారులు నిర‌స‌న‌కారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టు ఆదేశించింది.  షెహీన్‌భాగ్ లాంటి ప్రాంతాల‌ను అవరోధాల నుంచి దూరంగా పెట్టాల‌ని కోర్టు చెప్పింది. నిర‌స‌న ప్ర‌దేశాల నుంచి జ‌నాల్ని తొల‌గించేందుకు కోర్టు ఆదేశాల కోసం అధికా రులు వేచి చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని సుప్రీం పేర్కొన్న‌ది.శాంతియుతంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టడాన్ని తాము స్వాగ‌తిస్తున్నామ‌ని, కానీ అలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్దేశిత ప్రాంతాల్లో మాత్ర‌మే జ‌ర‌గాల‌ని కోర్టు వెల్ల‌డించింది. ఒకే చోట నిరంత‌ర ధ‌ర్నా చేయ‌డం వ‌ల్ల ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌న్న అంశంపై వేసిన పిటిష‌న్‌కు సుప్రీం స్పందించింది.  జ‌స్టిస్ ఎస్‌కే కౌల్‌, అనిరుద్ బోస్‌, కృష్ణ మురారీ నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఈ తీర్పునిచ్చింది. సీఏఏను వ్య‌తిరేకిస్తూ షెహీన్‌భాగ్‌లో సుమారు మూడు నెల‌ల పాటు మ‌హిళ‌లు బైఠాయింపు చేశారు.  

Share this:

Author

editer.abhi9news@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!