

14 ఏళ్ల బాలిక పెళ్లికాకుండానే తల్లికావడం, సదరు వ్యక్తి పేరు చెప్పేందుకు నిరాకరించడంతో తన అన్న సహాయంతో ఆమె తండ్రి తలనరికి హత్య చేశాడు. ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిధౌలి ప్రాంతంలోని దుల్హా పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తల తెగిన బాలిక మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని ఎస్పీ ఎస్ ఆనంద్ బుధవారం తెలిపారు. కేసు దర్యాప్తు సమయంలో బాలిక ఆరు నెలల గర్భవతి, పరువు హత్య కేసుగా ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు ఎస్పీ తెలిపారు. సెప్టెంబర్ 24న బాలిక హత్యకు గురైనట్టు ఆయన పేర్కొన్నారు. బాధితురాలి తండ్రి చెప్పిన దాని ప్రకారం.. తన కూతురు గర్భవతి అని, ఇందుకు కారణమైన వ్యక్తి గురించి అడిగితే.. పేరును వెల్లడించలేదని, దీంతో కోపోద్రిక్తుడై గొంతు నులిమాడని చెప్పారు. నిందితుడు కూతురుని గర్భవతిని చేసిన వ్యక్తితో పెళ్లి చేయాలని అనుకున్నాడని ఎస్పీ వివరించారు. యువతి చనిపోయిన అనంతరం తల నరికి.. తర్వాత మృతదేహాన్ని నుల్లా (డ్రెయిన్) సమీపంలో పారేశాడని పేర్కొన్నారు. సంఘటన అనంతరం ఆమె సోదరుడు పారిపోయాడని, తండ్రిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరిపై ఐపీసీ 302, 201 కింద ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే బాలిక గర్భం దాల్చడానికి కారణమైన వ్యక్తిని సైతం గుర్తించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారని చెప్పారు.