• Abhi9news,Hyderbad
  • November 25, 2020
0 Comments
  • సుధీర్‌ బాబు భార్య ప్రియ పుట్టినరోజు
  • వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ
  • అందరూ కలిసి భోజనం

సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి  పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్‌ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్‌ చేసింది. కేక్‌ కటింగ్ అయి పోయిన తర్వాత వారంతా కలిసి డైనింగ్‌ టేబుల్‌ వద్ద కూర్చొని, ముచ్చట్లు చెప్పుకుంటూ కడుపునిండా భోజనం చేశారు. చివరకు కృష్ణకు టాటా చెప్పి కారులో పంపించేశారు ఇందుకు సంబంధించిన ఫొటో లను హీరో సుధీర్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘ఆ తేదీ వచ్చింది.. నా ప్రేమ ఈ రోజే పు ట్టింది. హ్యాపీ బర్త్‌ డే ప్రియ’ అని సుధీర్ బాబు అన్నాడు. ఇందులో టీడీపీ ఎంపీ, మహేశ్ బావ గల్లా జ యదేవ్‌ కూడా పాల్గొన్నారు.  సూపర్‌ స్టార్ కుటుంబం అంతటిని ఒకే చోట చూసిన అభిమానులు సంబ రపడిపోతున్నారు. కృష్ణ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతు న్నాయి.

Share this:

Author

editer.abhi9news@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!