• Abhi9news,Hyderbad
  • November 25, 2020
0 Comments
  • సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’
  • ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట
  • ఆయన పుట్టినరోజు సందర్భంగా  ‘అమృత’ సాంగ్ విడుదల

యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. సాయితేజ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘అమృత’  పాటను వి డుదల చేశారు. సాయి తేజ్ కు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. గతంలో ఈ సినిమా నుంచి ‘నో పెళ్లి’ సాంగ్‌ని వి డుదల చేసిన సంగతి తెలిసిందే.అనంతరం ‘హాయ్ ఇది నేనేనా’ అనే పాట విడుదలైంది. తాజాగా, లవ్ బ్రే కప్ సాంగ్ విడుదలైంది.  ’బల్బు కనిపెట్టినోడికే బతుకు చిమ్మ చీకటైపోయిందే, సెల్ ఫోన్ కంపెనోడికే సి మ్ కార్డు బ్లాకై పోయిందే’ అంటూ ఈ పాట ప్రారంభమవుతుంది. ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాయి తే జ్ తన బాధను ఈ పాట రూపంలో చెబుతున్నాడు.

Share this:

Author

editer.abhi9news@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!