September 26, 2021
అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని  ప్రమాదం పై నాగార్జున

అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం పై నాగార్జున

  • ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం
  • మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి
  • అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు
  • అంతా బాగానే ఉంది

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున స్పందించారు. ‘ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జ రి గిం దంటూ మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి. అయితే, అవి తప్పుడు వార్తలు.. బాధపడాల్సిన పనేం లేదు.. అంతా బాగానే ఉంది’ అని నాగార్జున ట్వీట్ చేశారు కాగా, అన్నపూర్ణ స్టూడియో కూడా  తమ అ ధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇప్పటికే దీనిపై ఓ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో అంతా బాగానే ఉందని, నిర్ధారణ చేసుకోకుండా వార్తలు వ్యాప్తి చేయొద్దని కోరుతున్నామని పేర్కొంది. ని న్న సాయంత్రం అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మాత్రం ఆగడం లేదు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *