
మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె తండా వద్ద చిరుత కనిపించడంతో తండాకు చెందిన రైతులు పొలాల వైపు వెళ్ళడానికి జంకుతున్నారు. ఈ రోజు మధ్యాహ్న సమయంలో కారులో కొండపైకి వెళ్తున్న భక్తునికి రెండు చిరుత పులులు అడ్డం రావడంతో భయపడి వెనక్కి వచ్చేశానని తెలిపాడు. సమీప గ్రామానికి చెందిన ఓ అయ్యప్ప భక్తుడు నిన్న సాయంత్రం కొండ పైకి దైవదర్శనానికి వెళ్తుండగా చిరుతను చూశానని తెలిపాడు. దీంతో చిరుత విషయం తెలుసుకున్న సమీప గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సాయంత్రం సమయంలో కొండ పైకి వెళ్లే దారిలో ఉన్న చెరువు వద్దకు వస్తున్నాయని స్థానికులు కొందరు చెబుతున్నారు. నిన్న అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో నిన్న సాయంత్రం అధికారులు వచ్చి పులి జాడ సేకరించారు.కానీ పులి మాత్రం కనిపించలేదని చెపుతున్నారు. రైతులు మాత్రం చీకటి కాగానే పంట పొలాలకు, బయటకు వెళ్ళడానికి భయాందోళన చెందుతున్నారు…అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత పులులను బంధించాలని స్థానికులు కోరుతున్నారు…